Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chaitanya deepikalu

ఈ సంచికలో >> కథలు >> ఒక్క చుక్కే !

okka chukke!

స్కూల్ టైమైంది. పిలల్లంతా భుజాలకు బ్యాగులు తగిలించుకుని గబగబా నడుస్తూ వెళుతున్నారు. ఉన్నట్లుండి ఆగుంపులో నడుస్తున్న నరేష్ ఏదోవినిపించినట్లై  ఆగిపోయాడు.” ఏమైందిరా! అలా ఆగిపోయావ్ ?రా రా ! టై మవుతున్నది"  అంటూ వెనక్కు చూశాడు శాయి."ఒరే శాయీ !  నా బ్యాగ్ కూడా పట్టుకుని నడుస్తుండరా! నేను ఐదు నిముషాల్లో మిమ్మల్ని కలుస్తాను." అంటూ మెడకు తగుల్చుకుని ఉన్న స్కూల్ బ్యాగ్ తీసి శాయికి అందిం చాడు. "ఒరే నరేష్ పాస్ కెళ్ళాల్సి ఉంటే త్వరగా వెళ్ళిరారా! ఈ రోజు నుంచీ పరీక్షలు మొదలవు తున్నా య్! లేటైతే సార్లు పరీక్ష  రాయనివ్వరు.జల్దీ వచ్చెయ్ !" అంటూ తన గుపులో కల్సి ముందుకు సాగాడు  శాయి.

అంతా స్కూల్ చేరారు. ఫస్ట్ బెల్లైంది.సెకండ్ బెల్లైంది.ఎంతకూ నరేష్ రాలేదు. శాయికి కంగారెక్కువైంది.హాజర్ కూడా తీసేసుకున్నారు సార్ గారు. తెల్లకాయితాలు ఇచ్చేశారు. మూడో బెల్ ఐంది.  ప్రశ్నాపత్రాలు ఇవ్వ సాగారు. ఇంతలో వగర్చుకుంటూ వచ్చాడు నరేష్ . "మే ఐ కమిన్ సర్ !" అంటూ వినయంగా నమస్కరించాడు.

"ఏరా పరీక్ష రోజైనా త్వరగా రావాల్ని తెలీదా! హాజర్ పట్టీలో ఆబ్ సెంట్ పడింది. వెళ్ళి పెద్దసార్ గార్ని పర్మిషన్ తీసు కురా! అప్పుడే పరీక్షరాయనిచ్చేది."అంటూ ప్రశ్నాపత్రాలు పంచడంలో మునిగిపోయాడు సార్.

నరేష్  పెద్దసార్ ఆఫీస్ రూం ముందు కెళ్ళి నిల్చుని " మే ఐ కమిన్ సర్ " అని నమస్కరించాడు. ఆయన తలెత్తి నరేష్ ను చూసి " ఎస్ .ఏంకావాలి? " అని అడిగారు. "సర్ ఆలస్యం గావచ్చాను ఇప్పుడే, పరీక్ష రాయాలంటే మీ పర్మిషన్ అడగమన్నారు సర్ గారు." అని మెల్లిగా చెప్పాడు .

పెద్దసార్ తలెత్తి వాడికేసి చూశాడు.యూనిఫాం చొక్కా తడిసి ఉంది.ముఖం గాభరాగాఊంది."ఏరా! ఏంచేశావు ఇంత సేపూనూ? సమయం తెలీలేదా? లేక పరీక్ష సంగతి మర్చిపోయి ఇంతసేపూ ఆడుకుంటూ ఇప్పుడు గుర్చొ చ్చి వస్తున్నావా?" అని అడిగారు ఆగ్రహంతో.

"లేదు సార్! నేను వచ్చేదార్లో ..."అంటూ వాడు జరిగిందంతా చెప్పాడు.ఆమాటలు వింటూ పెద్దసార్ తన కుర్చీలోం చీ లేచి  వాడిదగ్గరగా వచ్చారు. అంతావిన్నాక భుజంతట్టారు. " సరే పద "అంటూ వాడి తరగతి గది దగ్గరకు వచ్చా రు.ఆయన్ని చూసి గదిలో పరీక్ష నిర్వహిస్తున్న సార్ వచ్చారు." ఈ నరేష్ కు ప్రశ్నాపత్రం ఇవ్వండి, నేను హాజరు వేస్తాను. పరీక్షయ్యాక అంతా అసెంబ్లీ హల్లో హాజరవండి. మాట్లాడాలి. నరేష్ వెళ్ళి పరీక్షరాయి." అని చెప్పి వెళ్ళి పోయారు. పరీక్ష పూర్తైంది . అంతా భయభయంగా అసెంబ్లీ  హాల్లో కొచ్చారు. పిల్లలకంతా భయంగానే ఉంది. పెద్ద సార్ ఏం కోప్పడతారో అని. పెద్దసార్ వచ్చారు." పిల్లలూ!  మీరంతా కూడా నరేష్ లాగా ఉండాలి. ఈరోజు వాడు పరీక్షకు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెల్సి నేను ఆశ్చర్యపోయాను.

మునిసిపాలిటీ వారు నీరు వీధి ట్యాప్స్ కు ఉదయం ఆరుకే వదులుతుంటారు . ఈరోజు ఆలస్యంగా వదిలారు. అప్పటికే నీటికోసం ట్యాప్స్ త్రిప్పేసి, నీరు రాక పోడంతో వాటి నలాగే వదిలేసి , నీరు వస్తే ఆశబ్దానికి రావచ్చని ఎవరో  వెళ్ళిపోయారు.నీరు వదలగానే ట్యాప్స్ లోం చీ నీరు క్రిందికి కారే శబ్దం నరేష్ విన్నాడు. వెంటనే ఒక బాధ్యతాయుత పౌరునిగా తన స్కూల్ బ్యాగ్ స్నేహితునికి ఇచ్చేసి , అతడు వరుసగా తిప్పేసి ఉన్న పది ట్యాప్స్ ఆపేసుకుంటూ ఆకాలనీ అంతా తిరిగాడు .అతది యూనిఫాం షర్ట్ తడిసిపోయినా లెక్కచేయలేదు. అంతేకాక అక్కడ ఒక చెట్టుక్రింద  పడి ఉన్న ఒక ముసలవ్వకు నీరు పట్టి దాహం తీర్చాడు.అక్కడే చెట్టుక్రింద దాహంతో నాలిక తెరుచుకుని స్పృహ లేక ఉన్న ఒక ఆవుకు నీరు పోసి కాపా డాడు. ప్రాణాధారమైన నీరు వృధా కానివ్వక పోడమే కాక ఆప్రాణాధారమైన నీరు తెచ్చి అందించి ఇరువురి ప్రాణాలు కాచాడు మన పన్నెండేళ్ళ  నరేష్. ఇంత చిన్నవయస్సులో సమాజం పట్లా, తోటి జీవులపట్లా , ప్రకృతి సంపద పట్లా తన బాధ్యత తెల్సుకుని ప్రవర్తించాడు, ఇతడు మన బళ్ళో చదవడం మనకు గర్వకారణం. ఈ మండే వేసవిలో నీరు వృధాచేయడం నేరం. మన నరేష్ నీటి శబ్దం దూరం నుంచే విని గమనించి వెళ్ళి ఇలా సేవచేయడం నిజానికి ఒక మంచి పౌరుని బాధ్యత.  నరేష్ ! నీకు ఇలా చేయాలని ఎందుకని అనిపించింది బాబూ!"అని అడిగారు  పెద్దసార్.

" సార్ ! నీటి బొట్టు విలువ నాకు బాగాతెల్సు. మా ఇంట్లో నీరులేక మేము ఒకే బకెట్ నీళ్ళతో తలా రెండు చెంబు లతో ఒళ్ళుతడుపుకుని స్నానం చేస్తాం .ఒక్కోమారు త్రాగను నీరులేక చాలా ఇబ్బంది పడుతుంటాం. మా అమ్మ ' ఎక్కడ కొళాయి నీరు పోతున్నా ఆపేసి వెళ్ళు బాబూ !' అని ,మానాయనగారు "నీరులేక ఎన్నో ప్రాణాలు పోతు న్నాయ్ ,నీరు వృధా కానీయరాదు.'అని చెప్పారు.  మా ఆంగ్ల ఉపాధ్యాయులు  ఒక ఆంగ్లపద్యం చెప్పారు .దాని అర్ధం చిన్న నీటిబొట్లు , చిన్న  ఇసుక రేణువులే బ్రహ్మండమైన సముద్రంగా మారాయని.  Little drops of water – little grains of sand make a mighty ocean - చిన్న నీటి బొట్టును కూడా వృధాచేయకూడదని మా సార్ చెప్పారు. అందుకని నేను తల్లి తండ్రి గురువులు చెప్పిన మాటలు దైవ వాఃక్కులుగా భావించి ఎక్కడ నీటి చు క్క  వృధా అవుతున్నా చూస్తూ ఉండలేను. ఆ చిన్న నీటి చుక్కలన్నీ కలిసి చెరువుగా, నదిగా సముద్రంగా మార టం  నాకళ్ళకు కనిపిస్తుంటుంది." అని చెప్పగానే అంతా కరతాళ ధ్వనులు చేసారు. -

 

మరిన్ని కథలు