ఇంత వరకూ మెగా ఫ్యామిలీ నుండి హీరోలే వచ్చారు. ఇప్పుడు హీరోయిన్‌కీ గ్రాండ్ వెల్‌కమ్ అందనుంది. తొలిసారిగా మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న క్రెడిట్ ఒన్ అండ్ ఓన్లీ నిహారికకే దక్కింది. నాగబాబు తన కుమార్తె నిహారికకు నటన పట్ల ఉన్న ఇంట్రెస్ట్‌ను గుర్తించి, తొలుత బుల్లితెరపైకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో నిహారికకు పెదనాన్న చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం నుండీ పూర్తి ప్రోత్సాహం లభించింది. నిహారిక బుల్లి తెర నుంచి వెండితెరకు ప్రమోట్ అవుతోంది.
హీరోయిన్‌గా 'ఒక మనసు' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కార్యక్రమం హైద్రాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్‌కు చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ, సాయిధరమ్ తేజ తదితర మెగా హీరోలు హాజరయ్యారు. నిహారికకు మనస్పూర్తిగా తమ శుభాకాంక్షలు అందించారు. ఈ ఫంక్షన్‌లో నిహరిక నిండైన చీర కట్టులో చాలా అందంగా కనిపించింది. రామరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడు. అందమైన ప్రేమకథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. సో ఆల్ ది బెస్ట్ టు నిహారిక.
|