బాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా చెలామణి అవుతోంది దీపికా. మొదటి సినిమా 'ఓం శాంతి ఓం' తోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఘనత ది ఒన్ అండ్ ఓన్లీ హీరోయిన్ దీపికకే దక్కిందంటే అతిశయోక్తి కాదు. ఏ రకమైన నటనైనా, ఎలాంటి హావభావాన్ని అయినా ఎంతో తేలికగా ప్రదర్శించగల టాలెంట్ ఈ ముద్దుగుమ్మది. అందుకే బాలీవుడ్‌కే కాకుండా టాలీవుడ్‌లో కూడా అభిమానుల్ని సంపాదించుకుంది ఈ పొడుగు కాళ్ల సుందరి. ఏ కాస్ట్యూమ్ వేసినా అదిరిపోయే ఫిజిక్ ఆమెది.
ఇన్ని గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే ఈమెకి బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్ నుండి కూడా ఆహ్వానం అందింది. తాజాగా హాలీవుడ్‌లో దీపిక నటిస్తున్న సినిమా 'ట్రిపుల్ ఎక్స్' గురించి హాట్ హాట్‌గా టాపిక్స్ నడుస్తున్నాయి. హాలీవుడ్‌లో తొలి సినిమా అయినప్పటికీ ఎంతో ఎక్స్‌పీరయన్స్ ఉన్నట్లుగా నటిస్తున్న ఆమె నటనకు ఆ చిత్ర బృందం షాక్‌కి గురవుతోందట. అంతేకాదు, దీపిక డాన్సుల్లో ఎక్స్‌పర్ట్. తన డాన్సింగ్ టాలెంట్‌ని హాలీవుడ్ హీరోయిన్స్‌కి పరిచయం చేస్తుందట. దీపిక డాన్సులు చూస్తుంటే అక్కడి హీరోయిన్స్‌కి కూడా డాన్సుల మీద ఎక్కడలేని ఇంట్రెస్ట్ పుట్టుకొస్తోందట. ఈ రకంగా దీపిక పుణ్యమా అని హాలీవుడ్‌లో బాలీవుడ్ ఖ్యాతి పెరగనున్నదని బాలీవుడ్ సినీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
|