Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Healthy Indian Snacks for Children | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

సభకు నమస్కారం - రాంప్రసాద్

 

తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం 2016  

‘సత్కళాభారతి’, ‘హాస్యానందం’ సంయుక్తంగా, తెలంగాణా భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో  తొలితెలుగు కార్టూనిస్ట్ శ్రీ తలిసెట్టి రామారావు జయంతి, మే 20వ తేదిన ,హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన కార్టూన్ పోటిలో గెలుపొందిన తెలుగు కార్తూనిస్టులకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ పోటిలో కార్టూనిస్ట్ రామ్ ప్రసాద్ కార్టూను “బాపు రమణ పురస్కారం -2016” కు ఎన్నికైనది. 



శ్రీ కె.వి. రమణాచారి  గారు కార్టూనిస్ట్ రామప్రసాద్ కు మేమెంటో,  బాపు రమణ అకాడమీ హైదరాబాద్, ఆత్రేయపురం సభ్యులు శ్రీ బ్నింగారు, శ్రీ సుబ్బరాజు గారు   శాలువాతో సత్కరించి, నగదు బహుమతి ప్రదానం చేసారు. తెలుగు కార్తూనిస్తులందరి కార్టూన్ల ప్రదర్శన జరిగింది. తెలుగు రాష్ట్రాల పలు జిల్లాలనుంచి  కార్టూనిస్టులు,  కార్టూనిస్టులు ఈకార్యక్రమంలో పాల్గున్నారు. పండుగ వాతవరణంలో ప్రాంగణమంతా కళకళ లాడింది. 


రాంప్రసాద్ ;

‘బాపు రమణ పురస్కారం 2016” అవార్డు అందుకోడం నాకెంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చింది. అందరికీ ధన్యవాదాలు.

పేరు : టి.వి.ఎస్. రామప్రసాద్
తలిదండ్రులు: తోరహతుల వెంకటరత్నం, వనజాక్షమ్మ దంపతులు.
చిరునామా : 16-1 -469 ,మధ్వపతివారి వీధి, నెల్లూరు- 524001 ( ఏ.పి.)
పుట్టిన తేది :
20-3-1953
విద్య : B.Sc(Ag); PGD IR&PM.
వృత్తి :  బ్యాంకింగ్ ,రిటైర్డ్ మేనేజర్ .

కార్టూనింగ్ : 1983 సం . నుంచి కార్టూన్లు గీయటం మొదలైయింది.ప్రఖ్యాత కార్టూనిస్ట్ శ్రిజయదేవ్ బాబు గారూ నాగురువుగారూ, అన్ని తెలుగు పత్రికలలో కార్టూన్లు ప్రచురిoo0పబడినవి. దినపత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి,ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ. ఆంగ్ల పత్రికలూ ది హిందూ,న్యూస్ టైం,కార్తూన్ వాచ్. సుధా,కర్మవీర్ కన్నడ పత్రికలు. 

బహుమతులు: కొన్ని బహుమతులు ,మొమెంటోలు, ప్రశంసాపత్రాలు.  ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ  – ఏ.పి.చాప్టర్ వారి కార్తూన్ పోటిలో ద్వితీయ బహుమతి .మళ్ళ జగనాథం స్మారక కార్టూన్ పోటిలో బెస్ట్ కార్టూనిస్ట్ 2012 బహుమతి. తలిసేట్టి రామారావు స్మారక కార్టూన్ పోటిలో 2013 & 15 సం.లలో కన్సోలేషన్ బహుమతులు.కార్టూన్ వాచ్ కార్టూన్ పోటిలో ప్రత్యేక బహుమతి.  పోర్చుగీసు ,తబ్రిజ్, చైనా దేశాల కార్టూన్ కాటలాగులలో కార్టూన్లు ప్రచురిoo0పబడినవి. ‘బాపురమణ పురస్కారం-2016’ అవార్డు అందుకోడం ఎంతో సంతోషాన్నిచింది.       

బాపు రమణ పురస్కార గ్రహీత సీనియర్ కార్టూనిస్టు శ్రీ రాం ప్రసాద్ గారు పదునైన చతురోక్తులూ - పసందైన కార్టూన్ల " పంచ్ పటాస్ " శీర్షికద్వారా గోతెలుగు పాఠకులను చిర పరిచితులే. ఒక మంచి శీర్షిక ద్వారా గోతెలుగు కుటుంబంలో ఒకరైపోవడం సంతోషకరం. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఇలాంటి పురస్కారాలెన్నింటినో వారు అందుకోవాలని అందుకోవాలనీ, ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలనీ కోరుకుంటోంది గోతెలుగు.   

మరిన్ని శీర్షికలు
ootapadaalu