Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mega star ready.. start action camera

ఈ సంచికలో >> సినిమా >>

దర్శకేంద్రుడితో నాగార్జున 'ఓం నమో వెంకటేశాయ'

nagarjuna ready to act ragavendra rao direction

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరో ఆధ్యాత్మిక చిత్రానికి తెర లేపనున్నారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన ''అన్నమయ్య' సినిమా ప్రేక్షకులను భక్తి రసంలో ఓలలాడేలా చేసింది. సినిమా చూస్తున్నంత సేపు నాస్తికుడైనా సరే ఆ వెంకన్నకు చేతులెత్తి నమస్కారం చేయాలి అనుకుంటాడు. అంత గొప్పగా ఉంటుంది సినిమా తెరకెక్కిన వైనం. ఆ సినిమాకు అన్నమయ్యగా నాగార్జున నటన అద్భుతం. ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచేసిన 'అన్నమయ్య' కమర్షియల్‌గా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు అదే నాగార్జునతో మళ్లీ 'ఓం నమో వెంకటేశాయ' అనే చిత్రానికి ప్రాణం పోస్తున్నారు రాఘవేంద్రరావు. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌కి వెళ్ళనుంది. దీనికి ముందుగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని చిత్ర దర్శకుడు రాఘవేంద్రరావు, నాగార్జున దర్శించుకున్నారు. ఇదో తనకి మరో అద్భుత అవకాశంగా భావిస్తున్నట్లు నాగార్జున చెప్పాడు. హథీరామ్‌ బాబాగా నటించడం పూర్వజన్మ సుకృతమని నాగ్‌ వివరించాడు. భగవంతుడి ఆశీస్సులు ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు చేయలేమని వరుసగా ఇలాంటి సినిమాలు చేసే అవకాశం రావడం దేవుడి దయేనని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో 'అన్నమయ్య' సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వెంకటేశ్వరస్వామి భక్తుడిగా నాగార్జునను దర్శకేంద్రుడు ఇప్పుడు 'ఓం నమో వెంకటేశాయ'లో చూపిస్తున్నాడు. 'అన్నమయ్య'తో అందర్నీ భక్తి లోకంలోకి తీసుకెళ్లిన నాగార్జున ఇప్పుడు ఈ సినిమాతో ఎంతగా అలరిస్తాడో చూడాలి. 

మరిన్ని సినిమా కబుర్లు
sister role can not  act says chandini choudary