Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nats yuva kalavahini awards

ఈ సంచికలో >> సినిమా >>

ప్రయోగాల బాటలో మిల్కీ బ్యూటీ

milk beauty in going on experment way

ఇంత వరకూ గ్లామరస్‌ పాత్రల్లోనే మెప్పించిన మిల్కీ బ్యూటీ ఇకపై ప్రయోగాలు చేయాలనుకుంటోందట. కొత్తదనం ఉన్న క్యారెక్టర్స్‌ని ఎంచుకోవాలనుకుంటోందట. అందులో భాగంగానే 'బాహుబలి ది బిగినింగ్‌'లో అవంతిక పాత్ర నుండీ స్టార్ట్‌ చేసింది. ఇప్పుడు ప్రభుదేవాతో 'అభినేత్రి' సినిమాలో నటిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇక నుంచీ గామర్‌ పాత్రలు చేస్తూ కూడా ప్రయోగాత్మక కథలు ఏమైనా తన దాకా వస్తే అస్సలు వదులుకోనంటోంది ముద్దుగుమ్మ తమన్నా. ఈ విషయంలో స్వీటీ బ్యూటీ అనుష్కనే తన టార్గెట్‌ అంటోంది. ఆమెలాగే అన్ని రకాల ప్రయోగాలను చేస్తానంటోంది.

హీరోయిన్‌గా తనదైన స్థానాన్ని సంపాదించిన తమన్నా, వేరియేషన్‌ పాత్రల్లో కూడా తన యాక్టింగ్‌ టాలెంట్‌ని చూపిస్తానంటోంది. ఎలాగూ హీరోయిన్‌గానే కాకుండా ఐటెం గాళ్‌ అవతారంలో కూడా తళుక్కుమంది ముద్దుగుమ్మ తమన్నా. ఇక తాజాగా 'అభినేత్రి' సినిమాతో డిఫరెంట్‌ రోల్‌ని టచ్‌ చేసింది. మరో పక్క 'బాహుబలి ది కన్‌క్లూజన్‌'లో కూడా కీలకపాత్రలో నటిస్తోంది. 'అభినేత్రి' సినిమాతో సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటబోతోంది. ఎలాగూ బాలీవుడ్‌లో ఆమెకు మంచి పేరే ఉంది. ప్రభుదేవా నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాపై అక్కడా భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే ఇదే కరెక్ట్‌ టైం అనుకుంటోంది మిల్కీ బ్యూటీ తన ప్రయోగాలకి. సో విలక్షణ దర్శక, నిర్మాతలు ఈ విషయాన్ని గమనించి తమన్నా కోసం డిఫరెంట్‌ రోల్స్‌ని నిస్సందేహంగా క్రియేట్‌ చేసెయ్యొచ్చన్న మాట. కీప్‌ ఇట్‌ అప్‌ తమ్మూ బ్యూటీ అండ్‌ ఆల్‌ ది బెస్ట్‌ . 

మరిన్ని సినిమా కబుర్లు
allu aravind support to mega movie