Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
beauty of himalayas

ఈ సంచికలో >> శీర్షికలు >>

19-08-2016 నుండి 25-08-2016 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద మొదట్లో కొంత పనుల విషయంలో నిదానంగా వ్యవహరించి పెద్దల సూచనలతో ముందుకు వెళ్ళుట ద్వార విజయంను పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటలో ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కూడా అశ్రద్దచేయక పోవడం మంచిది. విద్యాపరమైన విషయాల్లో నూతన ఆలోచనలను  ఉంటారు. ఉన్నతవిద్యా అవకాశాలు కలవు. ఉద్యోగంలో సమయస్ఫూర్తిని కలిగి ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు.    
 

 

వృషభ రాశి : ఈవారం మొత్తంమీద కొంత ప్రతికూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులకు దూరంగా ఉండుట మంచిది, రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు  అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలలో వైవిధ్యం చూపించే ప్రయత్నం చేస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులను చేపట్టుట వలన ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. కుటుంభసభ్యులతో కలిసి తీసుకొనే నిర్ణయాలలో తొందరపాటు కూడదు. విద్యాపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. విదేశీ ప్రయత్నాలు చేయాలనే తలంపును కలిగి ఉంటారు, నూతన ప్రయత్నం అనుకూలం ముందుకు వెళ్ళండి.  

 

 

 

                       

మిథున రాశి :  ఈవారం మొత్తంమీద నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. సంస్కృతి,సంప్రదాయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. బంధుమిత్రులతో కలిసి చేసిన ఆలోచనలు అనుకున్న ఫలితాలను ఇవ్వలేక పోవచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో అనవసరమైన ఖర్చులు కలుగుటకు ఆస్కారం ఉంది వాటిని తగించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. అనుకోని ప్రయాణాలు చేయుట మూలాన ఇబ్బందులు తప్పవు. వ్యాపారపరమైన విషయాల్లో మాకంటూ ఒక విధానం కలిగి ఉండుట సూచన. గతంలో చేసిన సహాయంనకు గాను మిత్రులనుండి అభినందన అందుతుంది. విద్యాపరమైన విషయాల్లో నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద ఇష్టమొచ్చిన నిర్ణయాలు తీసుకోవాలని, అలాగే సమయాన్ని మీకు అనుకూలంగా గడపాలనే కోరికలను కలిగి ఉంటరు. తలపెట్టిన పనులను మధ్యలో ఆపివేసే అవకాశం ఉంది. ధనమునకు సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయకండి నిదానం అసవరం. ప్రయాణాల మూలాన సమయం వృధాఅయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు ఖర్చులుపెరుగుతాయి, సమయానికి ధనం చేతికి అందకపోవడం చేత ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూరప్రదేశప్రయాణాలు వాయిదా వేయుట సూచన. ముందుగా అనుకున్న ప్రకారం తోటివారినుండి సహాయం అందకపోవచ్చును. విద్యాపరమైన విషయాల్లో కనుక శ్రద్ద లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. 
 

           
సింహ రాశి : ఈవారం మొత్తంమీద మిత్రులను కలుస్తారు వారితో సమయం గడుపుతారు. సమయాన్ని అధికంగా వినోదాలకు లేక విందులకు కేటయించే అవకాశం కలదు. ప్రయాణాలు అంతంగా ఉపయోగపడక పోవచ్చును వీలైతే వాయిదా వేయుట మంచిది. ప్రయత్నాలు మొదలు పెట్టునపుడు మీబలాన్ని అంచనా వేసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. నూతన మిత్రులతో కలిసి ప్రయత్నాలు ఆరంభించక పోవడం ఉత్తమం. ఆర్థికపరమైన విషయాల్లో మీదైన ముద్రను వేయాలనే చేసే ప్రయత్నం ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు బాగుంటుంది చేపట్టిన పనులలో ఆశించిన లాభాలు పొందుతారు. విద్యార్థులకు పరీక్షాకాలం , శ్రద్ద అలాగే బాధ్యత కలిగి ఉండుట సూచన. 

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద ఇష్టమైన పనులకు సమయాన్ని ఇస్తారు, నచ్చిన వారినుండి కొత్త వార్తలను తెలుసుకొనే అవకాశం ఉంది. విద్యాపరమైన విషయాల్లో పెద్దలనుండి రావాల్సిన సహకారం లభిస్తుంది, అలాగే ఆశించిన మేర గుర్తింపు రావడం చెప్పుకోదగిన విషయం. మార్పులను స్వాగతించుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు పొందుటకు ఆస్కారం కలదు . ప్రయాణాలు కలిసి వస్తాయి వాటికి సమయాన్ని ఇచ్చుటకు అవకాశం కలదు. బంధువులతో సమాలోచనలు చేయుటకు అవకాశం కలదు. దూరప్రదేశం నుండి నూతన వార్తలు తెలుసుకొనే ఆస్కారం కలదు. వ్యాపారస్థులకు పెద్దల సూచనలు పాటించుట చేత లబ్దిని పొందుటకు అవకాశం ఉంది.

   

తులా రాశి : ఈవారం మొత్తంమీద మొదట్లో కొంత నిరాశను పొందినను చివరకు దానిని అధిగమిస్తారు. మిత్రులను కలువాలనే మీ ఆలోచన పోస్టుపోన్ అవుతుంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం అనేది సూచన. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. కుటుంభంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకిస్తారు లేదా వాటిమూలాన భాధకు గురయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో వెసులుబాటు రావడం వలన చాలావరకు మానసికప్రశాంతతను కలిగి ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు అబివృద్ది ఉంటుంది. కాకపోతే అనుభవజ్ఞుల సూచనలను పరిగణలోకి తీసుకోండి మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం అశ్రద్ధ వద్దు, సమయానికి భోజనం చేయుట సూచన.  

 

    

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద గతంలోని ఆలోచనలను అమలు చేయాలనే ఆలోచన కలిగిఉంటారు. నూతన ప్రయత్నాలు ఆరంభించడానికి అమితమైన ఉత్సాహామ్ను చూపిస్తారు. ప్రయాణాలు కొంత కలిసి వచ్చినప్పటికిని శ్రమతప్పదు. ఆరోగ్యపరమైన విషయాల్లో మొండిగావెళ్ళకండి తగిన జాగ్రత్తలు అవసరం. కుటుంభసభ్యుల ఆలోచనలను కొట్టిపారేయకండి వాటిని కూడా పరిగణలోకి తీసుకోండి ఆలోచించుట ఉత్తమం. మానసికంగా గతంకన్నా దైర్యంగా ఉంటారు. వ్యాపారపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయకండి, బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. రావల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. 

 

 

ధనస్సు రాశి  :  ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు గాను నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యాపరమైన విషయాల్లో కొంత ఆసక్తి తగ్గుటకు అవకాశం కలదు. విందులలో పాల్గొంటారు, మిత్రులతో సమయాన్ని సరదగా గడుపుతారు,భోజనసౌఖ్యంను పొందుటకు అవకాశం ఉంది. ఆరంభంలో అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు మనస్సును స్థిమితంగా ఉంచుకొని ప్రణాళికతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యతిరేక వర్గం నుండి పోటీని ఎదుర్కొంటారు నిదానంగా వ్యవహరించి తెలివితో సమస్యను దాటండి. 

 

 

మకర రాశి  :  ఈవారం మొత్తంమీద ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండి వాటితో ముందుకు వెళ్ళుట అనేది సూచన తప్పక అనుకున్న ఫలితాలు పొందుతారు.బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు వారితో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో లబ్దిని పొందుతారు. కుటుంభంలో గతంలో తీసుకున్న నిర్ణయాల వలన మార్పులు కలుగుటకు అవకాశం ఉంది. చిన్న చిన్న వివాదములు కలుగుటకు అవకాశం ఉంది వాటికి దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. మధ్యవర్తిత్వం వలన చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చును. విద్యాపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి, విదేశీప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. 

 

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. రావాల్సిన ధనం సమయానికి అందుతుంది. కుటుంభంలో మార్పులు జరుగుతాయి, వాటిని గమనిస్తూ ఉండుట మంచిది. తలపెట్టిన పనులపైన అవగాహన అవసరం అలాగే ప్రణాలికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం ఉంది వారితో సమయాన్ని సరదగా గడుపుతారు. అనుకూలమైన ఫలితాలు పొందుటకు శ్రమతో పాటు తోటివారి సహాకారం అవసరం. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. సమయానికి భోజనం చేయుట అలాగే విశ్రాంతి అవసరం. లేకపోతే స్వల్ప ఇబ్బందులు తప్పక పోవచ్చును.   

 

 

మీన రాశి :  ఈవారం మొత్తంమీద పెద్దలతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. రాజకీయపరమైన విషయాల్లో మీ ఆలోచనలు అనుకున్న ఫలితాలు ఇచ్చుటకు అవకాశం ఉంది. కుటుంభసభ్యులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన సంఘంలో ఆశించిన స్థాయిలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు పొందుతారు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చేయుట వలన కూడా ఇబ్బందులు తప్పక పోవచ్చును. దూరప్రదేశప్రయాణాలు వాయిదావేయుట సూచన. మిత్రులతో లేక ఆత్మీయులతో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. కొంత సర్దుబాటు విధానం మంచిది.    

మరిన్ని శీర్షికలు
sahiteevanam