Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Anubandhaalu thirteenth part

ఈ సంచికలో >> సీరియల్స్

ఏడవ భాగం

nadiche nakshatram seventh part

అతడలా వెళ్ళగానే గాయత్రీపాటిల్ నే తదేకంగా... తన్మయంగా చూస్తూ ఉండిపోయాడు ప్రదీప్.

క్యూట్ లుక్స్ తో ఆమె యమసెక్సీగా ఉంది. ఓసారి చెక్కిలి నొక్కి... ఓసారి పెదాలు ముట్టి... ఓసారి కౌగిలి బిగిని ఆస్వాదించాలని... ఓసారి ఆమె నడుం ముడత ముద్దుగా తడమాలని... ప్రదీప్ ఆలోచనలు కళ్ళెం లేని గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి.

ఆ పత్రికలో లేటెస్ట్ మూవీ కోసం గాయత్రీ చేసిన ఫోటో షూట్ నుంచి ఓ ఫోటో తీసి పబ్లిష్ చేసారు. ఆ ఫోటో ఎంత ప్రోవోకింగ్ లా ఉందో... అంతే ప్రోవోకింగ్ లా ఆ ఆర్టికల్ ఉంది. చివరాఖర్న 'కొత్త సినిమాలో గాయత్రీ ముద్దు రుచి చూసిన అదృష్టవంతుడైన హీరో ప్రదీప్... కంగ్రాట్స్' అని కూడా ఉంది.

అంటే... ఆ జర్నలిస్ట్ దృష్టిలో గాయత్రి ముద్దు పొందిన తనెంతో అదృష్టవంతుడన్నమాట. ఆమెకి ఆ ఆర్టికల్ చూపించడం కూడా తన మనసులో సుడులు తిరుగుతున్న భావాల్ని మెసేజ్ రూపంలో పంపించడమే... అనుకుంటుండగా 'నవతార' పత్రికని అసిస్టెంట్ తెచ్చి ఇచ్చాడు.

"చూడండి... పేజ్ నంబర్ సిక్స్ లో యమసెక్సీగా ప్రెజంట్ చేసారు" అన్నాడు ప్రదీప్.

ఆ పత్రికని గాయత్రి తీసుకుని గబగబా పేజీలు  తిప్పి ఆరోపేజీలోకొచ్చి నిలిచింది. అందమైన ఇంద్రధనసుని నిలబెట్టినట్లు కలర్ ఫుల్ గా తన ఫోటో కనిపించింది. ఆ పక్కన కనిపించిన అక్షరాల గుంపే అయోమయంగా ఉందామెకి. అపుడపుడే నేర్చుకుంటున్న కారణంగా తెలుగులో కొన్ని అక్షరాల్ని గుర్తుపట్టగలిగినా... వరుసగా వేగంగా చదవడం మాత్రం ఆమెకి రాదు. ఆమె పరిస్థితిని అర్ధం చేసుకున్న ప్రదీప్ అడిగాడు - "నే చదివి వినిపించనా?" అడిగాడు.

"ఇపుడే ఈ పత్రిక కావాలా?"

"మీ దగ్గరే ఉంచండి"

"సరే... షూటింగ్ తర్వాత ఆ ఆర్టికల్ ని చూస్తా" అంది గాయత్రీపాటిల్.

అంటే... ఆ 'నవతార' పత్రిక హీరో కార్లోంచి ఇపుడు హీరోయిన్ కార్లోకి మకాం మార్చింది... తననుంచి వేరయిన చిన్ని గుండె ఆమెని చేరుకున్నట్లు... అనుకున్నాడు ప్రదీప్.

"ఏంటీ... ప్రదీప్ ఆ ఆర్టికల్ పై అంత ప్రేమ పెంచుకున్నాడు? ఆ ముద్దు... ఆ కౌగిలి కొంపతీసి గురుడికి గుర్తొస్తున్నాయా? తనా రోజు అజ్ఞాత అభిమాని గుర్తుకురాగా క్షణకాలం కలిగిన మైకంలో అలా బిహేవ్ చేసి ఎంత పొరపాటు చేసింది?" ఆమె అనుకుంటుండగా ఇన్ బాక్స్ లో ఓ మెసేజ్ - "మేడం! మీ ఆర్టికల్ చదివాను. హీరో ప్రదీప్ అంటే అసూయగా ఉంది"

"ఒరేయ్... ఎక్కడున్నావ్ రా నువ్వు. ఏ క్షణంలో నిన్ను తలచుకుంటున్నానో ఆక్షణంలోనే ఓ ఎస్ఎంఎస్ వై పలకరిస్తావు" అనుకుంది గాయత్రి పిచ్చిగా.

"ఆర్టికల్ చదివారా?" సెల్ ఫోన్ చేసి మరీ అడిగాడు ప్రదీప్. గతంలో ఎన్నోసార్లు అతడు కాల్ చేసినా కాల్ షీట్ల గురించో, తమ కాంబినేషన్ లో తీయబోయే సీన్ల గురించో, చూసొచ్చిన షూటింగ్ స్పాట్ ల గురించో మాట్లాడేవాడు. కానీ... ఇంత ప్రత్యేకంగా ఓ ఆర్టికల్ గురించి ఇపుడు అడుగుతున్నాడో అర్ధం చేసుకోలేనంత అమాయకురాలేం కాదు గాయత్రీపాటిల్.

"చదివాను..."

"ఎలా ఉంది?"

"మాగజైన్ సర్క్యులేషన్ పెంచుకునేలా ఉంది..."

"అంటే... అర్ధం కాలేదు"

"మాస్ మసాలా... మామూలుగా ఉంది" అంది గాయత్రి.

తర్వాత - "అంతకుమించి ఆ ఆర్టికల్ లో ఏమైనా ఉందా?" అడిగింది అమాయకంగా.

"అర్ధం చేసుకుంటే ఎంతో ఉంది..." అన్నాడు ప్రదీప్.

"ఏముంది? మీరు చెప్పొచ్చు కదా... అసలే నేను నాన్ తెలుగు"

"అన్నిటికీ భాష అవసరం లేదు... అమ్మాయి నవ్వులకి, మాటలకీ, ఇచ్చిపుచ్చుకునే ముద్దులకీ ప్రత్యేకించి భాషంటూ లేదు. భావోద్వేగమే భాష..." అతడు చెప్తున్నాడు. ఆమె వింటోంది.

"ఎందుకో... ఇవాళ్టి ఈవెనింగ్ రొమాంటిక్ గా కనిపిస్తోంది. ఆరోజు నీ చెక్కిలిపై నే పెట్టిన ముద్దుతాలూకు గోరువెచ్చని తడి మాటిమాటికీ నాకు గుర్తొస్తోంది. అపుడు నువ్వు వదిలిన వేడి ఊపిరి నా గుండెల్లో వేయి వేణువుల్ని మోగిస్తోంది. ప్లీజ్... నువ్వు నాక్కావాలి" అభ్యర్ధిస్తున్నాడు ప్రదీప్.

"ఫీల్ అర్ధం అయింది. నేనెలా కావాలి మీకు?" అడిగింది గాయత్రీపాటిల్.

"ఎలా..." చెప్పడానికి ఆలోచిస్తున్నాడు ప్రదీప్.

"అసలేం కావాలి మీకు? నేనా... నా మనసా? ఇండస్ట్రీలో ఇలాటి రిలేషన్స్ మనసుదాకా వెళ్లవు. చాలామటుకు శరీరంతోనే ఆగిపోతాయి. అందుకే, క్లారిటీ కోసం అడుగుతున్నాను. నేనెలా కావాలి మీకు. మనసా... శరీరమా? రెండునా?" మళ్ళీ అడిగిందామె. గతంలో ఇంత డైరక్ట్ గా ప్రపోజ్ చేసిన వ్యక్తి ఆమె జీవితంలో లేరు. స్కూల్లో, కాలేజీలో వెనుకెనుకపడుతూ అందాన్ని పొగిడిన అబ్బాయిలనెంతోమందిని చూసింది. అవన్నీ సరదాజ్ఞాపకాలే. కొత్తగా వొంటిమీదకి వచ్చిన వయసు అల్లరల్లరి చేస్తుంటే ఎదురుగా కనిపించిన ఓ అమ్మాయిని కలలరాణిగా చేసుకుని కవితలు అల్లడం... వాటినే ప్రేమలేఖలుగా ఇవ్వడం... అందులో 'అచ్చుతప్పు'ల్ని వెతుకుతూ అమ్మాయిలు ఆటపట్టించడం... అందమైన అమ్మాయిల్ని ఇంటిదాకా వెంబడించడం... అమ్మాయి అన్నో... నాన్నో కనిపిస్తే దాక్కోవడం... ఇబ్బందిపెట్టనంతవరకూ వీటిని ఎంజాయ్ చేసింది గాయత్రి. అయితే, తన ఫస్ట్ క్రష్ మాత్రం ఇంగ్లీష్ టీచర్ మీద ఉండేది. తనింటి పెరట్లో పూసిన గులాబీని అతడికి ఇస్తూ ఆ మాత్రం దానికే సంబరపడిపోయేది. ఆ తర్వాత సరిగ్గా అలాటి భావనే సిమ్లాలోని ఓ ఫోటోగ్రాఫర్ మీద ఏర్పడింది. అతడి పేరు ధీరజ్. అయితే... ఎపుడూ ఒకరికొకరు ఎదురుపడి తమ మనసులో మాటని సూటిగా వ్యక్త పరుచుకోలేదేనాడు.

ఇపుడు ఇన్నాళ్ళకి ఈరోజు... హీరో ప్రదీప్ డైరక్ట్ గా తనని కోరుతున్నాడు.

"డేటింగ్ చేద్దాం?"

"డేటింగా..."

"ఔను... డేటింగే. ఆన్ స్క్రీన్ కాదు... ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా మనమధ్య చాలా బాగా వర్కవుట్ అవుతుందని నాకు నమ్మకం. అయితే, ఇవన్నీ పై పై వెండితెర ఆకర్షణలుకాకూడదు. అందుకే... మనమిద్దరం 'డేటింగ్' చేద్దాం" అతడు అలా అనేసరికి ఆశ్చర్యపోవడం గాయత్రి వంతయింది. తను అడిగిన ప్రశ్నకి తనదైన సినీస్టయిల్ లో అతడు వెరీ కామన్ గా - "ఐ లవ్ యూ..." చెప్తాడనుకుంది. కానీ, వెరైటీగా - "డేటింగ్ చేద్దామంటూ" ప్రపోజ్ చేసాడు.

ఇపుడు తన ముందున్న ప్రశ్న 'అతడి ప్రపోజల్ డేటింగ్ కి' ఓకే చెప్పాలా... వద్దా?

"ఆలోచించుకుని చెప్తా" ఆన్సరిచ్చింది గాయత్రీపాటిల్. ఏం చేయాలో తోచని పరిస్థితిలో పోస్ట్ పోన్ చేయడం కూడా ఓ విధంగా పరిష్కారమే. ఇపుడు గాయత్రి చేసిందదే.

"ఆలోచించడానికి నీకు ఎన్నాళ్ళు కావాలి?" అడిగాడు ప్రదీప్.

"అదీ ఆలోచించాల్సిందే..."

"ఓకే... నెక్స్ ట్ కాల్ షీట్ లోగా ఆలోచించు. మన కాంబినేషన్ నెక్స్ ట్ టెన్ డేస్ లో మళ్లీ ఉంది" చెప్పాడతడు.

"ఓకే..." చెప్పింది గాయత్రి.

'ఈ సినిమాలో రెయిన్ సాంగ్ తప్పనిసరా?" డైరక్టర్ స్టోరీ చెప్తున్న సందర్భంలోనే అడిగింది గాయత్రి.

"కంపల్సరీ... వాన పాటలే ప్రొడ్యూసర్లకి కాసుల సిరి" అన్నాడు డైరక్టర్ నవ్వుతూ.

తర్వాత - "ఏం... స్టోరీ డిమాండ్ చేసినా రెయిన్ సాంగ్ లో యాక్ట్ చేయవా?" అడిగాడు.

"రెయిన్ సాంగ్ అంటే... తడిసిన బట్టల్తో" నెమ్మదిగా గొణిగింది.

"ఓహో... జలుబు చేస్తుందనే భయమా?" అన్నాడు డైరక్టర్ మళ్ళీ నవ్వుతూ.

"వానంటే నాకెంతో ఇష్టం. వాన పడ్తుంటే చిట్టిపొట్టి చిన్నారి చేతుల్తో కాల్వల్లోకి కాగితం పడవలు వేసిన జ్ఞాపకాలు వెన్నాడుతుంటాయి నాకు. అదేపనిగా గెంతులు వేస్తూ వానలో తడవడం... తల తుడుస్తూ అమ్మ మొట్టికాయలు వేయడం... ఇప్పటికీ గుర్తొస్తున్నాయి"

"అది పసితనపు వాన... సిన్మాలో మాత్రం యవ్వనాల వాన... ఓసారి ఆకాశం మేఘావృతమై ఉరుము ఉరిమి... మెరుపు మెరిస్తే సినీ ప్రేయసి కళ్ళలో వేనవేల తళుకులు... చటుక్కున చినుకురాలి వానై, వరదై, పొంగిపొర్లితే సెల్యూలాయిడ్ అల్లరి ప్రేమికుడి గుండె 'లబ్ డబ్'లో వేటూరి తుంటరిపాట... 'వానవల్లప్పవల్లప్ప వల్లప్పగించేయి సామిరంగా" అంటూ మణిశర్మబాణీలో కదం తొక్కుతుంది" తన క్రియేటివిటీనంత జోడించి మరీ చెప్పాడు డైరక్టర్.

"అంతేనా... తడితడి అందాల సినీస్నిగ్ధ 'సౌందర్యం' 'చిరంజీవి సుఖీభవ' అంటూ శివమెత్తుతుంది. అంతవరకూ మనసిచ్చిపుచ్చుకున్న నాయికానాయకుల మాటలూ... మోమాటాలూ కరువై ఒకర్నొకరు చేతుల్లోకి తీసుకోమంటూ, చేతల్లోకి దిగిపొమ్మంటూ వాన మౌన సందేశమిస్తుంది... ఫెళ ఫెళ ధ్వానాల్తో ఉరుము హడలెత్తేస్తే, మెరుపు కొరడా ఝులిపిస్తే 'గాలివాన గుళ్ళో కౌగిలింత పెళ్లి' అంటూ 'జయప్రదం'గా ఉరికురికి వస్తుంది" చెప్తున్నాడతడు.

"రెయిన్ మీద మీరు మంచి రిసెర్చ్ చేసారే" అడిగింది గాయత్రీపాటిల్.

"ఔను... సిన్మాల్లో తడిసి 'ముద్ద'యిన హీరోయిన్ల మీద రిసెర్చ్ చాలా చేసా. చినుకు చినుకు పడుతుంటే... తడిసితడిసి ముద్దవుతుంటే ఒదిగిఒదిగి ఒకటైపోతూ..." వాన అందాలకు జోహారు చెప్పని సినీ ప్రేమికుడు ఉండనే ఉండడు. 'వానావానా వందనం... వయసా వయసా వందనం" అంటూనే చెలి తడిసొగసుల్లో గోదారి పొంగుల్ని చూస్తాడు సినీ హీరో. మన సినిమాలో వాన పాట పిక్చరైజేషన్ తర్వాత 'వర్షం నిజంగా హర్షం సుమా!' అని నువ్వే అంటావు కదా!" అన్నాడు డైరక్టర్.

"ఒక్కమాట చెప్పనా... సినీ వర్షం నిర్మాతల పాలిట కనకవర్షం. వానలో తడుస్తూ నాయిక తెల్లని, పల్చని చీరలో సొగసులు, సోయగాలు ఆరబోస్తుంటే, ఆ తడి యవ్వన అందాలను చూసేందుకు థియేటర్ల ముందర జాతరే జాతర. బాక్సాఫీస్ హిట్ ఫార్ములాకు వానపాట పెద్దపీట. పద్నాలుగు రీళ్ళ సిన్మాలో ఇంటర్వెల్ ముందూవెనుకా మూడేసి పాటలుంటే అందులో ఖచ్చితంగా ఒక్కపాట వానపాటైపోవడం పరి'పాటై'పోయింది. ఈ ఆనవాయితీ - 'ఉరుములు ఫెళ ఫెళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలికన్నులలో బిత్తరచూపులు కనబడుతుంటే" అంటూ చెట్టు నీడకు పరుగులు తీసే 'అక్కినేని' సాక్షిగా మొదలైంది. అప్పట్లో ఆ వానలో తడిసిన అందాల సరోజాదేవి మొదలు ఈనాటివరకూ అవే కథలు. 'చిటపట చినుకులు పడుతూ ఉంటే..." అన్న ఆత్రేయ పాటతో తెలుగు సినీ అరంగ్రేటం చేసిన వానపాటలో ఎన్నెన్ని హొయలో... ఎన్నెన్ని లయలో? ఎందరు కథానాయకుల అడుగులకు మడుగులెత్తిందో ఈ 'వానజాన'. నువ్వూ తప్పకుండా ఈ వానలో తడిసి 'ముద్ద'వ్వాల్సిందే కన్విన్సింగ్ గా చెప్పాడు డైరక్టర్.

కాదనలేకపోయింది గాయత్రీపాటిల్.

"స్వీటీ... గుడ్ మాణింగ్. ఇవాళే మన కాంబినేషన్ లో రెయిన్ సాంగ్ పిక్చరైజేషన్. దివినుంచి దిగివచ్చిన దేవతలాటి నీకు... వందవందనాల్తో వెల్ కం" ఉదయాన్నే గాయత్రి
సెల్ కి తొలి వేకువ కిరణంలాటి మెసేజ్ ని పంపించాడు ప్రదీప్.

"థాంక్యూ" ప్రతిగా ఏ విశేషణాలు లేని ఓ మెసేజ్ పంపించిందామె.

ఇవాళ ఆ రెయిన్ సాంగ్ పిక్చరైజేషన్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.

తెల్లటి పల్చటి చీరలో సింగారించుకుని ఉంది గాయత్రీపాటిల్. దూరం నుంచీ ఆమె సమ్మోహన రూపాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నాడు హీరో ప్రదీప్. తననే గమనిస్తున్న హీరో ప్రదీప్ వంక చూసిందామె. ఎపుడెపుడు డైరక్టర్ 'స్టార్ట్ కెమెరా యాక్షన్' అని అరుస్తాడా అని ఎదురుచూస్తున్నట్లు శిలాప్రతిమని తలపిస్తూ అలా నిల్చునే ఉన్నాడు.

"ఈ రెయిన్ సాంగ్ తన జీవితాన్ని ఏ మలుపుతిప్పబోతోంది? ఈ పాట తర్వాత డైరక్టర్ అన్నట్లు 'వర్షం హర్షం' అవుతుందా? ఔను... అన్నట్లు... ఇవాళే డేటింగ్ విషయమై ప్రదీప్ కి ఓ ఆన్సర్ ఇవ్వాలి..." అనుకుంటుండగా అసిస్టెంట్ డైరక్టర్ "మేడమ్...?" అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు.

"వళ్ళంతా వయసైతే... వానొస్తే ఏంటటా? తుళ్ళింతపాటల్తో ఎడదంతా నిప్పంటా" బిగ్గరగా పాట వినిపిస్తోంది.

జోరున కురుస్తున్న వాన... వణికిస్తున్న చలి పెదాలపై ప్రకంపనలు పుట్టిస్తుంటే తడిసిముద్దయిన హీరోయిన్ ప్రియసమాగమం కోసం తహతహలాడుతూ... తపనలు పడుతూ విస్కీ తాగినంత హాయిగా హస్కీ హస్కీ వాయిస్ తో పాడుతున్న పాట అది. వింటుంటేనే శరీరంలో ప్రవహిస్తున్న రక్తం ఉడుకులెత్తే ఊష్ణకాసారం మారిపోవడం తధ్యం.

గొంతునిండా ఇన్ని 'హిమక్రీము'ల్ని నింపుకున్న ఓ సింగర్ తెరపై కనిపించే నాయికని తన గొంతులో ఆవాహన చేసుకుని మరీ పాడినట్లుంది.

"ఆ సింగర్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..." పాట విన్న గాయత్రి అనుకుంది.

"మనం ప్రాణప్రతిష్ట చేయాల్సింది ఈ పాటకే..." అన్నాడు ప్రదీప్.

"ఔన'న్నట్లు ఆమె కన్రెప్పలు టపటపలాడించింది.

"మీ లేడీస్ అంతే... మా మగాళ్ళని చంపేస్తారు" చిన్న పాజ్ తర్వాత - "చూపుల్తో" అంటూ సెంటెన్స్ ని కంప్లీట్ చేసాడు.

"మరి, ప్రాణాలు పోగొట్టుకుంటూ మా చుట్టూ తిరగడం ఎందుకు?" అడిగింది గాయత్రీపాటిల్.

"చంపడమే కాదు... మీకు బతికించడం కూడా తెలుసు. మీ పెదాల చివర్నుంచీ మొదలై కళ్ళదాకా పాకిన నవ్వుతోనే మళ్ళీ మమ్మల్ని బతికిస్తారు. చావుబతుకుల అర్ధం పరమార్ధం తెలుసుకోవాలంటే లేడీస్ వెనకాల చచ్చినట్లు పడాల్సిందే"

"ఇంతకీ మీరెక్కడ ఉన్నారు?" అడిగిందామె.

"ఇక్కడే... నీ దగ్గరే ఉన్నా కదా"

"నేనడిగిన క్వశ్చన్ అది కాదు... మీరిపుడు చావుదగ్గర ఉన్నారా... బతుకుదగ్గర ఉన్నారా?" అడిగిందామె.

"మిమ్మల్నిలా చూస్తూ చస్తున్నా. బతికిస్తారేమోననే ఆశతో మీ చుట్టూ తిరుగుతున్నా. మనమిద్దరం డేటింగ్ చేసుకుందామా?" అడిగాడు ప్రదీప్.

ఇంతలో అక్కడికి డాన్స్ మాస్టర్ వచ్చాడు.

"నమస్తే మాస్టర్..." వినయంగా అతడి పాదాల్ని తాకి నమస్కరించింది గాయత్రి. ప్రదీప్ కూడా అతడ్ని విష్ చేశాడు.

"డైరక్టర్ గారు మీకు చెప్పే ఉంటారు. ఈ సాంగ్ సినిమాలో క్లయిమాక్స్ ముందొస్తుంది. హీరో విలన్ మధ్య జరుగుతున్న హోరా హోరీ సమరంలో ఎవరు గెలుస్తారో తెలీనిరీతిలో ఊపిరాడని సస్పెన్స్ కొనసాగుతుండగా... అయిదు నిముషాలు ఆడియన్స్ రిలాక్స్ అవడం కోసం ఫక్తు కమర్షియల్ ఫార్ములాతో ఈ రెయిన్ సాంగ్ ని పెట్టారు. ఈ సాంగ్ ఆడియన్స్ ని కుర్చీలో కూచోనీయకుండా చేయాలి. అంటే... రెచ్చగొట్టాలి. కాబట్టి... మీరు కూడా ఏ మోమాటాలు లేకుండా ఈ పాటలో నర్తించాలి. ఈ సినిమా కోసం మూడు డ్యూయెట్లు పాడిన మీకు... బహుశా అన్ని సంకోచాలు ఇప్పటికే తీరిపోయి ఉండాలి..." అడిగాడు డాన్స్ డైరక్టర్.

"సంకోచాలు అంటే..." అర్ధం కానట్లు ఆయనవేపు చూసింది గాయత్రిపాటిల్.

(... ఇంకా వుంది)

మరిన్ని సీరియల్స్
amulyam story by sabha