Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

premam movie review

movie review

చిత్రం: ప్రేమమ్‌ 
తారాగణం: నాగచైతన్య, శృతిహాసన్‌, అనుపమా పరమేశ్వరన్‌, మడోనా సెబాస్టియన్‌, ప్రవీణ్‌, కృష్ణ చైతన్య, శ్రీనివాస్‌రెడ్డి, పృధ్వీ, నోయల్‌ తదితరులు. 
సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని 
నిర్మాణం : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
నిర్మాతలు: ఎస్‌ రాధాకృష్ణ, పిడివి ప్రసాద్‌, ఎస్‌ నాగవంశీ 
దర్శకత్వం: చందు మొండేటి 
సంగీతం: గోపి సుందర్‌ 
విడుదల తేదీ: 7 అక్టోబర్‌ 2016

క్లుప్తంగా చెప్పాలంటే 
15 ఏళ్ళ వయసులో విక్రమ్‌, సుమ (అనుపమ పరమేశ్వరన్‌)తో ప్రేమలో పడతాడు, అంతా ఓకే అనుకున్న టైమ్‌లో ఆ ప్రేమ బ్రేకప్‌కి దారి తీస్తుంది. ఇంకో ఐదేళ్ళ తర్వాత విక్రమ్‌ మళ్ళీ ప్రేమలో పడతాడు తను చదువుతున్న కాలేజీలో పనిచేస్తున్న సితార (శృతిహాసన్‌)తో. ఈ ప్రేమ కూడా పెటాకులే అవుతుంది. చదువు పూర్తి చేసుకుని, లైఫ్‌లో సెటిల్‌ అయినా విక్రమ్‌ని, సితార జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. ఈ టైమ్‌లో విక్రమ్‌కి సింధు (మడోనా సెబాస్టియన్‌)తో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. మరి, మూడో ప్రేమ కథ అయినా సుఖాంతమయ్యిందా? అంతకు ముందు రెండు ప్రేమకథలు ఎందుకు విఫలమయ్యాయి? అనేది తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే 
నటుడిగా సినిమా సినిమాకీ మంచి పేరు తెచ్చుకుంటున్న నాగచైతన్య, ఈ సినిమాలో అద్భుతమైన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నాడు. కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ని నాగచైతన్య ఈ చిత్రంతో ఇచ్చాడనడం అతిశయోక్తి కాదు. 15 ఏళ్ళ వయసులో స్కూల్‌కి వెళ్ళే కుర్రాడి పాత్ర దగ్గర్నుంచి, కాలేజీ కుర్రాడిలా, లైఫ్‌లో సెటిల్‌ అయిన యువకుడిలా అద్భుతమైన నటనా ప్రతిభను ప్రదర్శించాడు. ఏ వయసులో ఏ పాత్రకి ఎలాంటి నటన అవసరం? అనేది ఇంకోసారి బాగా రీసెర్చ్‌ చేసి మరీ ఈ సినిమాలో నటించాడేమో అన్పిస్తుంది. హీరోయిన్లుగా అనుపమ, మడోనా, శృతిహాసన్‌ ఎవరికి వారే అన్నట్లుగా నటించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. 
మలయాళ ప్రేమమ్‌కి ఇది తెలుగు రీమేక్‌. కథ పరంగా చిన్న చిన్న మార్పులే చేశారు తెలుగు వెర్షన్‌ కోసం. డైలాగ్స్‌ బాగున్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని సీన్స్‌ని తీర్చిదిద్దారు. ఎక్కడా మలయాళ ఫ్లేవర్‌ కనిపించదు. సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. ఎడిటింగ్‌ ఓకే. సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌. 'ఎవరే..' పాట విజువల్‌గానూ చాలా చాలా చాలా బాగుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ మంచి పనితీరుని చాటుకున్నాయి. సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కింది. అది నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకపోవడం వల్లే జరిగింది.

రీమేక్‌ చిత్రాలకీ అప్పుడప్పుడూ ఇబ్బందులు తప్పవు. ఒరిజినల్‌లోని ఫీల్‌ని అలాగే ఉంచి, మన నేటివిటీకి తగ్గట్లుగా మార్చడం అన్ని సందర్భాల్లోనూ వీలు కాదు. కానీ యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న కథల్ని జాగ్రత్తగా రీమేక్‌ చేస్తే, సినిమా అత్యద్భుతంగా వస్తుంది. 'ప్రేమమ్‌'ని కూడా అలాగే జాగ్రత్తగా తెరకెక్కించారు. హీరోయిన్లు సినిమాకి మేజర్‌ ప్లస్‌ పాయింట్స్‌. శృతిహాసన్‌ తప్ప, మిగతా అందరూ ఫ్రెష్‌ ఫేస్‌లే తెలుగు సినిమాకి. అనుపమ ఆల్రెడీ 'అఆ'లో నటించినా, ఆమె ఈ సినిమాలో ఇంకా ఫ్రెష్‌గా కనిపించింది. నాగచైతన్య పెర్ఫామెన్స్‌ ఈ సినిమాకి హైలైట్‌. ఓవరాల్‌గా నటీ నటుల నుంచి మంచి ప్రతిభను రాబట్టుకున్నాడు దర్శకుడు. ఒరిజినల్‌లోని ఫ్లేవర్‌ని జాగ్రత్తగా కాపాడాడు. సెకెండాఫ్‌ కొంచెం లెంగ్తీగా అనిపిస్తుందిగానీ, అది అర్థం చేసుకోదగ్గదే. ఓవరాల్‌గా సినిమా టార్గెట్‌ ఆడియన్స్‌ అయిన యూత్‌ని బాగా ఆకట్టుకుంటుందనడం నిస్సందేహం.

ఒక్క మాటలో చెప్పాలంటే
ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with nagachaitanya