మెగాస్టార్ చిరంజీవితో దేవిశ్రీ ప్రసాద్ చేసిన ఐటెం సాంగ్స్ అన్నీ సూపర్ హిట్సే. దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ వస్తోన్న 'ఖైదీ నెం 150' సినిమా కోసం అదిరిపోయే మ్యూజిక్ రెడీ చేస్తున్నాడు దేవిశ్రీ. అందులో ఐటెం సాంగ్ మరీ స్పెషల్ అట. అందుకే ఆ సాంగ్‌లో చిందేయడానికి హాటెస్ట్ భామ కేథరీన్‌ని ఎంపిక చేశారు మొదట్లో. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ లక్ష్మీ రాయ్‌కి దక్కింది. ఈ ఛాన్స్ ఆమెకి లారెన్స్ ఇప్పించాడనే సమాచారం. లారెన్స్‌కి లక్ష్మీరాయ్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్. తమిళంలో 'కాంచన' సినిమాలో లారెన్స్‌తో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
తెలుగులో చాలా కాలం తర్వాత చిరంజీవి కోసం లారెన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఇటీవల 'సర్దార్ గబ్బర్ సింగ్'తో తమ్ముడు పవన్‌కళ్యాణ్ సరసన చిందేసింది. ఆ పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు 'ఖైదీ నెం 150'లో అన్నయ్య కోసం చిందేయబోతోంది ఈ ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్. అందుకే ఈ పాట కూడా చాలా స్పెషల్ లక్ష్మీరాయ్‌కి. వరుసగా మెగా ఫ్యామిలీతో టచ్‌లో ఉండే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. రామ్ చరణ్ నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాకి వినాయక్ దర్శకత్శం వహిస్తున్నారు. చందమామ కాజల్ అగర్వాల్ చిరంజీవికి జోడీగా నటిస్తోంది.
|