చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెం 150' చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. విదేశాల్లో హీరోయిన్ కాజల్, చిరంజీవిపై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో పాటలకు మొదట్లో కొరియోగ్రాఫరు,్ల చిరంజీవి ఏజ్‌ను దృష్టిలో పెట్టుకుని లైట్ స్టెప్పులు కంపోజ్ చేశారట. కానీ మాస్ ప్రేక్షకులను ఆ స్టెప్పులు అంతగా సంతృప్తినియ్యవనీ, చిరంజీవి టఫ్ స్టెప్పులను కంపోజ్ చేయమని కొరియోగ్రాఫర్లకు సూచించాడట. ఈ వయసులో కూడా చిరంజీవి డెడికేషన్‌కు చిత్ర యూనిట్ అవాక్కవుతోంది. అంతేకాదు కొరియోగ్రాఫర్లు కూడా చిరంజీవి జోష్ చూసి షాక్ అవ్వకుండా ఉండలేకపోతున్నారు. యంగ్ కొరియోగ్రాఫర్స్‌తో చిరంజీవి పోటీ పడి డాన్సులేస్తున్నాడట. అందుకే ఈ సినిమాకి చిరంజీవి డాన్సులు హైలైట్ కానున్నాయని అంటున్నారు. పాటల కోసం విజువల్‌గా చాలా ఎఫెక్టివ్‌గా ఉండే లొకేషన్స్‌ని సెలెక్ట్ చేస్తున్నాడట డైరెక్టర్ వినాయక్.
రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన చిరంజీవి ఫస్ట్‌లుక్, స్టిల్స్‌తో ఫ్యాన్స్‌కి కిర్రాక్ పుట్టిస్తున్నాడు. కాజల్ ఈ సినిమాలో చాలా అందంగా హుందాగా కనిపిస్తుందట. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్‌లో రూపొందిన బాణీలు అదరహో అన్పించేలా ఉండబోతున్నాయట. ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్ ఈ సినిమాలో ప్రత్యేక గీతంలో నటించింది.
|