Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలాలు 23-12-2014 నుండి 29-12-2015 వరకు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద సంతానపరమైన విషయాల్లో అనవసరమైన ఆలోచనలకు అవకాశం ఇవ్వకండి. పెద్దల అనుభవాలను పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. చేపట్టిన పనులను కొన్నింటిని విజయవంతంగా పూర్తిచేస్తారు. సాధ్యమైనంత వరకు శక్తికి మించని పనులను చేపట్టుప్రయత్నం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ విషయంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. స్త్రీ పరమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే, నూతన సమస్యలను కొనితెచ్చుకుంటారు. చాలావరకు తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టత అవసరం. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు.

 

 



 వృషభ రాశి :ఈవారం మొత్తం మీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట వలన పెద్దలలో మంచి గుర్తింపును పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు ఆస్కారం కలదు. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో అధికారులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. నూతన పెట్టుబడులు లభించే ఆస్కారం కలదు. బంధువులతో మాత్రం కొన్ని కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుట సూచన. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధచేయకండి. సంతానపరమైన విషయాల్లో కొంతమేర ఒత్తిడి తప్పక పోవచ్చును.



మిథున రాశి :  ఈవారం మొత్తంమీద మీ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేస్తారు. స్వ నిర్ణయాల దిశగా అడుగులు ముందుకు వేస్తారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం కలదు. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. వారి సూచనలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. సోదరులతో చేసిన చర్చలు పెద్దగా ఫలితాలు ఇవ్వకపోవచ్చును. విదేశాల నుండి రావాల్సిన సహకారం అందుతుంది. మిత్రులతో కలిసి దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. కుటుంబంలో శుభకార్యాల గురుంచి నిర్ణయం తీసుకుంటారు. విలువైన వస్తువులను కాస్త జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది, నస్టపోయే ఆస్కారం ఉంది.

 

 



కర్కాటక రాశి :    ఈవారం మొత్తంమీద కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాల దిశగా ముందుకు వెళ్లారు. మీ మాటతీరు మూలన చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. సంతానం మూలన పెద్దలతో మాటపడవల్సి రావోచ్చును. సోదరులతో చేపట్టిన చర్చలు  కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో చేపట్టిన నూతన ప్రయత్నాలు వారం చివరలో ముందుకు వెళ్తాయి. సాధ్యమైనంత వరకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట సూచన. మధ్యవర్తిత్వం పనికిరాదు, ఇతరులకు మాటఇచ్చే విషయాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలన చేయుట మంచిది. మిత్రులతో సమయం గడుపుతారు.


 సింహ రాశి : ఈవారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తులతో సమయం గడుపుతారు , చేపట్టిన పనులను పూర్తిచేసే క్రమంలో స్పష్టమైన ఆలోచన విధానం కలిగి ఉండుట మంచిది. ముఖ్యంగా వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. జీవితభాగస్వామితో అనుకోని విభేదాలు వచ్చే ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. నూతన వాహనములు కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. విదేశాలలో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. రుణసంభందమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. ఉద్యోగంలో నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు.


కన్యా రాశి : ఈవారం మొత్తంమీద బంధువులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటలో చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబంలో వివాదాలు, అలాగే మానస్పర్థలు కలిగే ఆస్కారం ఉంది, జాగ్రత్త. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. అనుకోని ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విదశీ ప్రయత్నాలు చేయాలనే వారి ప్రయత్నాలు సానుకూల ఫలితాలు పొందుతారు. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. మిత్రులతో కలిసి చేసిన ఆలోచనలకు అధికభాగం కేటయించే అవకాశం కలదు, మంచిది కూడా.

 


తులా రాశి : ఈవారం మొత్తంమీద నూతన ఆలోచనలకు అలాగే నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు. తలపెట్టిన పనులను పూర్తిచేసే క్రమంలో స్పష్టమైన అవగాహన ఆవసరం. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల అభిప్రయాలను వారి అనుభవాలను పరిగణలోకి తీసుకోవడం సూచన. ఉద్యోగంలో చేపట్టిన నూతన ప్రయత్నాలను కొనసాగించే క్రమంలో సమస్యలు వస్తాయి. మీ మాటతీరు చాలామందికి నచ్చకపోవచ్చును , దాని వలన నూతన సమస్యలు పొందుతారు. సోదరులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. సంతానం విషయంలో ఉద్వేగానికి లోనయ్యే ఆస్కారం ఉంది, అధికమైన ఆలోచనలకు లోనవుతారు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ కూడదు.

 

 



వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. మీ మాటతీరు కొంతమందికి మద్దతుగా నిలిచే ఆస్కారం కలదు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, అధికభాగం సమయం వీటికి ఇస్తారు. మానసికపరమైన విషయాల్లో ఇబ్బందులు, అలాగే ఒత్తిడి ఎదుర్కొంటారు. స్త్రీ పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. కుటుంబపరమైన విషయాల్లో మీరు తీసుకొనే నిర్ణయాలు కాస్త స్పష్టతకు దూరంగా ఉండే ఆస్కారం ఉంది. నూతన ఉద్యోగప్రయత్నాలకు అవకాశం ఉంది, సానుకూల ఫలితాలు రావడానికి ఆస్కారం కలదు.



ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం కలదు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి పూర్తిస్థాయిలో సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో పెద్దలతో చేసిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. అధికారులకు అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేయుట ఉత్తమం. దైవపరమైన విషయాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు మొదలుపెట్టుటకు ఆస్కారం కలదు. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడేలా ఆలోచనలు చేయుట మంచిది. కుటుంబసభ్యుల ఆరోగ్యం మిమ్మల్ని అఆందోళనకు గురిచేసే ఆస్కారం కలదు.

 



మకర రాశి : ఈవారం మొత్తంమీద నూతన ప్రయత్నాలకు అధికసమయం ఇస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. తండ్రితరుపు బంధువుల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోలనకు గురిచేసే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు, నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళుట సూచన. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడే అవకాశం కలదు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకపోవడం సూచన.

 


కుంభ రాశి : ఈవారం మొత్తంమీద సాధ్యమైనంత వరకు చర్చలు చేయకుండా ఉండుట సూచన. చేపట్టిన పనులను వారం మధ్యలో విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. కుటుంబంలో సభ్యులనుండి ఆశించిన మేర సహకారం రాకపోవచ్చును. అనుకోని ఖర్చులను ఎదుర్కొంటారు, అదుపుచేసే ప్రయత్నం విఫలం అవుతారు. వ్యాపారపరమైన విషయాల్లో తోటివారి సూచనలు, పెద్దల అనుభవాలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులను నస్టపోయే ఆస్కారం కలదు. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి, చేపట్టిన పనులల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. విదేశాలలో ఉన్న మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.

 



మీన రాశి :ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో పనిఒత్తిడి ఎదుర్కొంటారు. అధికారుల సూచనలకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. చర్చలవలన నూతన ఇబ్బందులు కలుగుతాయి, జాగ్రత్త. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటారు. పెద్దలతో కలిసి ఆలోచనలను పంచుకుంటారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదాపడుతాయి. నూతన నిర్ణయాల విషయంలో స్పష్టత అలాగే ప్రణాళిక అవసరం. వాహనముల విషయంలో లేక అగ్నిసంభంద వస్తువులతో జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది.
 

మరిన్ని శీర్షికలు
story reviews