Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> సాబ్ అందర్..అమ్మా బాహర్..దర్వాజా బంద్

sab andar,, amma bahar.. darvaja band

 

 

ధడ్ . . . ధఢ్ . . . ధఢ్ . . . ధడాల్ . . . . .


పెద్ద చప్పుడు తో తలుపు తెరుచుకోగానే ఆజ్ హవా బహుత్ హైనా అమ్మా , నిచే కాభీ కొండీ లగాలో తబ్ నై ఖులేగా అని చెప్పి జహీరా వెళ్ళి పోయింది. ఓరినీ గాలికి తెరుచుకుందా ఈ తలుపు ! ఏ దొంగోడు వచ్చాడో, ఏ దయ్యమో వచ్చిందోనని ఎంత హడలి చచ్చాను. ఈ తలుపులు మరీ ఇంత వీకేమిటి బాబూ... ఇంత దడిపిస్తున్నాయి !

మేము ఈ ఇంట్లోకి వచ్చిన నాలుగైదు రోజులకేననుకుంటా, నేను వంట ఇంట్లో పని చేసుకుంటూ వుండగా,  మా ఏమండీ పిలుపులు వినిపించాయి. ఏముంది, ఇందాక పేపర్ చదువుతూ కనిపించారు , పేపర్ ఏమైనా కింద పడి వుంటుంది. తీసి ఈయమనో, లేదా సెల్ తెచ్చియమనో పిలుస్తున్నారులే అనుకొని చిన్నగా చేతిలో పని పూర్తి చేసుకొని వెళ్ళాను. ఏరీ ? ఈ మనిషెక్కడా కనిపించటము లేదే అనుకుంటూ ఇల్లంతా కలియ జూస్తూ,,, ఎక్కడండీ అని అడిగానా, ఈ గదిలో, బయట నుండి తలుపు తీయి అని ఓ గది లోనుండి వినిపించింది. ఇదేమిటి, గది తలుపు వేసుకొని నన్ను తీయమంటున్నారూ... అని ధీర్గం తీస్తూ బయట నుండి హాండిల్ తిప్పాను. రెండు సారులు తిప్పీతేనే కాని రాలేదు. చెమటలు కక్కుతూ బయటకొచ్చారు. ఇంత సేపు ఏం చేస్తున్నావు? ఈ డొర్ రాలేదు, పిలవగానే రావద్దూ అని కోపం చేసారు. డోర్ రాక పోవటమేమిటి???

లోపల హాండిల్ విరిగి పోయింది అందుకని డోర్ వేస్తే లోపల నుండి తీయటానికి రాదు. నేను ముందు చూడ లేదు. జాగ్రత్త నువ్వు లోపలి కెళ్ళి తలుపేసుకోకు అన్నారు .
ఒక్క క్షణం భయం వేసింది. ఆ( ఈ సంగతి తెలిసాక నేను లోపలి కెళ్ళి తలుపేసుకోవటమా..నెవర్. ఐనా ఏమండీ లోపల ఉండగానో, పొరపాటున నేను లోపలికి వెళ్ళినప్పుడో పడి పోతే ఎలా? అందుకని, ఎలాగూ మావారికి తలుపు చెక్క మీద టవల్ ఆరేయటము అలవాటు కాబట్టి, ఏదో ఒక తలుపు మీద ఎందుకు, ఈ తలుపు మీదే వేస్తే పోలే అనుకొని, ఏమండి టవల్ ఏ తలుపు మీద వేసినా తీసుకొచ్చి ఈ గది తలుపు మీద వేయ సాగాను. ఐతే ఈయన గారు ఎప్పుడు ఆ టవల్ గుంజేస్తారో తెలీదు. అందుకని, స్ట్టాపర్ పెట్టి, తలుపుకడ్డం గా ఓ కుర్చీ కూడా పెట్టాను. ఒకటి కాక పోతే ఒకటైనా తలుపు పడకుండా కాపాడుతాయి కదా అని.  హాండిల్ లాక్ దగ్గర హోల్ లో బాగా కాగితాలు కూడా గుచ్చి   అలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని అమ్మయ్య అని ఊపిరి తీసుకున్నాను. అ గదికి స్కేరీ రూం అని ఓపేరు కూడా తగిలించాము.
హుం నన్ను అలా నిశ్చింత గా ఏమండి ఉండనిస్తే ఇహ లేనిదేముంది ? మొన్నటికి మొన్న ఏం జరిగిందో తెలుసా ? ఆ రోజు ఆదివారం అమ్మ లంచ్ కు రమ్మన్నది. తయారైనాము. ఇంతలో ధోభీ కిషోర్ వచ్చాడు. అతనికి బట్టలేసి, డబ్బులిచ్చి పంపేసరికి పేపర్ బాయ్ దృవ కుమార్ వచ్చాడు . అతని కి డబ్బులిద్దామని లోపలికి వచ్చాను. బాత్ రూం తలుపు, స్కేరీ రూం తలుపు వేసి వున్నాయి. చిన్నగా బాత్రూం తలుపు తోసాను. తెరుచుకుంది. స్కేరీ రూం తలుపు...తో..సాను.తెరుచుకోలే. గుండె జల్లు మంది. అనుమానంగా  చిన్నగా హేమండీ అని పిలిచాను. .."ఊ.." లోపలి నుండి సమాధానం వచ్చింది. ఐనా లోపల వున్నారా గుస గుస గా, భయం భయంగా అడిగాను. ఏమిటా పిచ్చి ప్రశ్న? తీయ్ హాండిల్ అని అరిచారు. హాండిల్ తిప్పాను. రాలేదు. గట్టిగా తిప్పు లోపలి నుండి హుకుం. అబ్బే రాలే. రాలేదండి, గొంతులో ఏడుపు, వణుకు!! యేహే గట్టిగా గుంజు లోపలి నుండి అరుపు. ఘట్టిగా గుంజాను. పుటుక్ హాండిల్ పుటుక్ అయ్యో హాండిల్ విరిగి పోయిందండి వా 

బయట నుండి దృవ కుమార్ అమ్మా నా పైసలిస్తే నే పోతా అని ఒకటే పిలుపు. లోపలి నుండి ఏమండి ముందు వాడిని పంపించిరా అన్నారు. మూడొందలే ఇచ్చానో, నాలుగొందలే ఇచ్చానో ఇచ్చి పంపి, స్కేరీ రూం ముందుకొచ్చాను. మళ్ళీ తలుపు ఎలా తీయను? లోపలి నుండి ఏమండి హాండిల్ గట్టిగా తిప్పు అన్నారు. ఎక్కడండీ హాండిల్ పుటుక్ మందిగా. ఐతే కీస్ పెట్టి తీయి అదీ నేనే చెప్పాలా బుర్ర లేదు అని వెటకారాలు."

నా బుర్ర సరే, కొంపలో వుండి చచ్చింది ఇద్దరమే, నేను బయటెక్కడో వున్నాను, తమరు తలుపు ఎందుకు వేసున్నట్లు ? 

"పిచ్చిగా అరవకు నేనెక్కడ వేసాను? అదే పడింది. హాండిల్ తిప్పు"

"హాండిల్ విరిగి చచ్చిందని చెప్పానా ? కీస్ తో రావటము లేదు. ఇప్పుడెలా? పక్కింటి వాళ్ళను పిలవనా"

"పక్కింటి వాళ్ళను పిలుస్తావా? ఏమక్కర లేదు. కీస్ తో తీయ్"
కీస్ ఎంత తిప్పినా రాదే! భగవంతుడా ఏం చేయను? ఏడుపు, కోపం, భయంతో కాసేపు అటూ ఇటూ చూసి ఎందుకో వంటింట్లోకి వెళ్ళాను. అక్కడ జహీరా తోమటానికి గిన్నెలు తీస్తోంది. జహీరా సాబ్ అందర్ బంద్ హోగయే థోడా తుం దర్వాజా కోల్ సక్తే క్యా ట్రై కరో. మేరేసే నైహోరా. మేరా హాత్ పావ్ కాంప్రై అని కీస్ జహీరా కిచ్చాను. తను కీస్ పెట్టి తిప్పుతూ సాబ్ అందర్...అమ్మా బహార్ బంద్ హోగయే అని పాట మొదలు పెట్టింది. క్యా జహీరా క్యా బోల్ రహేహో. కుచ్ నై అమ్మా మేరోకో బాబీ కా గానా యాద్ ఆయా అంది. అప్పటి దాకా వున్న టెన్షన్ ఏమైందో నేనూ నవ్వుతూ పాట ఎత్తుకున్నాను .

సాబ్ అందర్ . . . అమ్మా బాహర్
దర్వాజా బంద్ హోగయా . . .
కొండీ తూడ్ గయా . . .
అందర్సే కోయి బాహర్ ,
బాహర్ సే కొయి అందర్ నా జాసకే
సోచో అబ్ క్యా హోగా . . . . .

" ఏమొచ్చిందే పిచ్చి పోరగాళ్ళారా, తలుపు తీయకుండా పాటలు పాడుతున్నారు. జహీరా కొండీ జోర్సే ఖీంచో "

"సాబ్ కొండీ తూడ్ గయా "

"ఇప్పటికెన్నిసార్లు చెప్పాను, హాండిల్ విరిగిందని. తలుపేసుకున్నారు కదా కూర్చోండి ."

"పిచ్చి వాగుడు వాగకు. నేనెక్కడ వేసాను అదే పడిందని చెప్పానా ?"

"టవల్, స్టాపర్, కుర్చీ, ఇనింటిని నెట్టుకుంటూ తలుపదే పడి పోయిందా?"
"ఇపుడవన్ని అవసరమా తలుపు తీయ్ ముందు"

"ఎలా తీయను ? అలాగే వుండండి. నేను అమ్మ దగ్గరికెళ్ళి లంచ్ చేసి మీకు కారియర్ తెస్తాను, ఈ లోపల ఏదో ఉపాయం తోచక పోదు."

"సడ్డు జోకులాపు ముందు"

ఇంతలో నాకో బ్రమ్హాండమైన ఐడియా వచ్చింది. జహీరా కు స్క్రూ డ్రైవర్ ఇచ్చి, హాండిల్ ప్లేట్ వూడదీయమన్నాను. కాస్త అటూ, ఇటూ తిప్పింది. లేచి వంట ఇంట్లో కెళ్ళి కత్తి పట్టుకొని వస్తోంది . . .

ఇదేమిటి? కత్తి తెస్తోంది. ఆయన లోపల బంధీగా వున్నారు. నన్ను పొడిచి, నా మెడలోని గాజులు... చేతి గొలుసు...కాదు కాదు చేతి గొలుసు, అబ్బ ఏదో వొకటి నా వంటి మీది బంగారం తీసుకొని పారి పోదు కదా!! శ్రీ రామచంద్రా నారాయణా ఎన్ని కష్టాలు....ఆ కత్తి తో, స్క్రూ డ్రైవర్ తో కొద్దిగా వచ్చిన ప్లేట్ కు సపోర్ట్ పెట్టి మొత్తం ప్లేట్ వూడ దీస్తోంది. పాపం ఎంత అపార్ధం చేసుకున్నాను.

మొత్తానికి కష్టపడి హాండిల్ ప్లేట్ వూడ దీసింది. అక్కడ ఏర్పడ్డ కంతలో నుండి లోపలికి చూసి, అమ్మా సాబ్ దెకో కైసే భైటే అంది. నేనూ చూసాను. మంచం మీద కూర్చొని పైకి చూస్తున్నారు. ఏమండీ పైకి ధీర్ఘంగా చూస్తున్నారేమిటి ? పై కప్పు వూడ దీస్తే పై ఇంటాయాన తోలు తీస్తాడు అన్నాను నవ్వుతూ. ఉరిమి చూస్తూ వెధవ జోకులాపు అని, జహీరా చాబీసె నికాలో అన్నారు. మద్య లో తలుపు లేక పోతే నేను భస్మం ఐపోయే దానినే!!
అబ్బే ఆ చాబీ వుండటము లేదే! ఇప్పుడు మరీ కష్టమైంది. ఇదేమిటి ఇలా అవుతోంది.

ఇప్పుడెలా? ఇప్పటికే బంధి అయ్యి అరగంట పైన అయ్యింది. ఎలారా దేవుడా!

ఓ పక్క స్క్రూ  డ్రైవర్ తో తిప్పుతూనే, అమ్మా అగర్ సాబ్ బాహర్, అమ్మా అందర్ బంద్ హో గయా తో క్యా హోగా? అని అడిగింది.

"క్యా హోగా కాలియా? అమ్మ ఝాటర్ ఢమాల్ "

"ఏమొచ్చిందే మీకు , మీ పాటలు తగలెయ్య. తలుపు తీసి ఏడవండి ముందు."

"అబ్బ వుండండి. మరీ అంత మమ్మలిని చూసి కుళ్ళు కోకండి సారూ." 


అమ్మయ్య స్క్రూడ్రైవర్ తో అటు తిప్పి, ఇటు తిప్పి ఎలా ఐతేనేం ఏమండి బంధ విముక్తులైనారు.

అందర్ సాబ్ . . . బాహర్ అమ్మా బంద్ హోగయే.

కొండీ తూడ్గయా, సోచో కభీ ఐసా హోతో క్యా హోగా? జహీరా మహా ఉషారుగా పాడేస్తోంది.

అది కాదండి, పైన టవల్..పక్కన కుర్చీ... 

దూరంగా పడి వున్న కుర్చీ . . . . మా వారి నడుముకు టవల్...

మరిన్ని కథలు
kamanuveedhikathalu