Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sirasri question

ఈ సంచికలో >> శీర్షికలు >>

20-01-2017 నుండి 26-01-2017 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు శక్తికి మించిన పనులకు దూరంగా ఉండుట సూచన. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో అందుబాటు లో ఉన్న వ్యవస్థను ఉపయోగించుకోవడం మంచిది. సంతానపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే ముందు కుటుంబసభ్యుల నుండి సూచనలను తీసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండుట మేలుచేస్తుంది. అనవసరమైన విషయాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండుట ఉత్తమం. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు.

 

 



 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. వారితో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబంలో కొన్ని కొన్ని అంశాల్లో మొండిగా ప్రవర్తించుట ద్వారా మేలుజరుగుతుంది. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి, ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించుట సూచన. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయకండి.


మిథున రాశి :   ఈవారం మొత్తంమీద వారం చివరలో రావాల్సిన ధనం చేతికి అందుతుంది. విదేశీప్రయాణాల కోసం చేయు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టత అవసరం. సోదరులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. కుటుంబంలో పెద్దలనుండి నూతన విషయాలు తెలుస్తాయి, వారితో చర్చల్లో పాల్గొంటారు. వ్యాపారపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించుట, అలాగే చిన్న చిన్న పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. సంతానం కోసం గతంలో తీసుకున్న నిర్ణయాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం కలదు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన.  

 


కర్కాటక రాశి :    ఈవారం మొత్తంమీద ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం సూచన. కుటుంబపరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాల దిశగా అడుగులు పడుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. మీ నిర్ణయాలు కొంతమందికి నచ్చక పోవచ్చును, సర్దుబాటు విధానం మంచిది. సంతానం వలన నలుగురిలో మంచిగుర్తింపును పొందుతారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదావేయుట సూచన. ఆరోగ్య పరమైన విషయాల్లో ఇబ్బందులు తగ్గుతాయి. వాహనముల వలన ఇబ్బందులు తప్పవు, అనుకోని ఖర్చులకు ఆస్కారం కలదు.

 



 సింహ రాశి : ఈవారం మొత్తంమీద చిన్న చిన్న పనులకు సమయం కేటయించుట సూచన. ఉద్యోగంలో అధికారులకు మీ అభిప్రాయాలను తెలియజేస్తారు. విదేశాల ప్రయాణాల కోసం చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. నూతన పెట్టుబడులకు ఆస్కారం కలదు. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆత్మీయుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి, వాటికీ అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబంలో మనస్పర్థలు లేక వివాదాలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సంతానం ఆరోగ్యం విషయంలో ఆందోళనకు గురయ్యే ఆస్కారం ఉంది. దూరద్రుష్టిని కలిగి ఉండుట వలన నష్టం తగ్గేఆస్కారం ఉంది.

 


కన్యా రాశి : ఈవారం మొత్తంమీద తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టత ఉండుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంతానం గురుంచి పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం కలదు.

 



తులా రాశి : ఈవారం మొత్తంమీద మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలను పెద్దలతో పంచుకుంటారు. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. ఉద్యోగంలో అధికారులతో కలిసి దూరప్రదేశప్రయాణాలు చేయవల్సి వస్తుంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. పెద్దలతో ఎటువంటి మనస్పర్థలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సంతానం గురుంచి నూతన ఆలోచనలకు శ్రీకారం చుడుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నూతన వాహనములను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయుట మంచిది

 



వృశ్చిక రాశి :  ఈవారం మొత్తంమీద ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ముందు పెద్దలను సంప్రదిస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయంలో మిశ్రమఫలితాలు పొందుతారు అలాగే పెట్టుబడుల కోసం నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులు పొందుటకు ఆస్కారం ఉంది. మీ మాటతీరు మూలాన ఇతరులు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో శుభకార్యాల విషయంలో నిర్ణయం తీసుకుంటారు. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి, వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు.

 


ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది. పెద్దలతో కలిసి దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. చిననాటి మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. పూర్వీకుల నుండి మీకు సంక్రమించవల్సినవి ఏమాత్రం నష్టపోకుండా మీకు అందుతాయి. అధికారుల నుండి రావాల్సిన సహకారం అందుతుంది. వారం మధ్యలో ముఖ్యంగా స్త్రీ పరమైన విషయాలకు దూరంగా ఉండుట అలాగే మహద్యవర్తిత్వం చేయడం లాంటి వాటికీ దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. గతంలో చేపట్టిన చర్చలను కాస్త ఆలస్యంగానైనా పూర్తిచేసే అవకాశం ఉంది.

 

 

 


మకర రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు,చర్చలకు అవకాశం ఉంది. అధికారులతో లేదా పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడే అవకాశం కలదు. అనుకోకుండా చేసే ప్రయత్నాలు ఆశించిన మేర ఫలితాలను ఇస్తాయి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. ఆత్మీయులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. సమయానికి భోజనం చేయుట అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలావరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చును. దూరప్రదేశంలో ఉన్న బంధువుల నుండి కీలకమైన విషయాల్లో సహాయం పొందుతారు.



కుంభ రాశి :  ఈవారం మొత్తంమీద ఆరంభంలో సాధ్యమైనంత వరకు చర్చలకు దూరంగా ఉండుట సూచన. చేపట్టిన పనులను మిత్రులు లేదా తోటివారి సహకారంతో విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం కలదు. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న విషయాలను అశ్రద్ధ చేయకండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. అనుకోకుండా మీరు తీసుకొనే నిర్ణయాలు కీలకమైన మార్పులకు అవకాశం ఇస్తాయి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆర్థికపరమైన విషయంలో ఖర్చులను తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. వ్యాపారపరమైన విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాల వలన నలుగురిలో గుర్తింపును అలాగే లబ్దిని పొందుతారు.

 


మీన రాశి : ఈవారం మొత్తంమీద చాలావరకు అన్నివిషయాల్లో వేచిచూసే ధోరణి మంచిది. పెద్దలతో ఎటువంటి మనస్పర్థలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ప్రయాణాలు అనుకోకుండా వాయిదాపడుతాయి. ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అలాగే వాస్తవానికి దూరంగా వెళ్ళుట వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. చర్చల్లో వ్యతిరేకమైన ఫలితాలు పొందుటకు ఆస్కారం కలదు. మిత్రులతో లేదా ఆత్మీయులతో మీ ఆలోచనలను పంచుకోవడం ద్వారా అలాగే వారై సూచనలను పాటించుట ద్వారా మేలుజరుగుతుంది. అగ్నిసంభందమైన వస్తువులతో పనిచేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. కుటుంబంలో చిన్న చిన్న సర్దుబాట్లు అవసరం.

మరిన్ని శీర్షికలు
cartoon competetion