Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

.

dipression

నేటి యువత అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటుంది. కానీ చిన్న విషయానికే విచక్షణ కోల్పోతూ జీవితాన్నే కోల్పోయే సందర్భాల్ని కొని తెచ్చుకుంటోంది. వీటన్నింటికీ కారణం అన్నీ మాకే తెలుసు, అంతా మాకే తెలుసుననే నిర్లక్ష్య ధోరణి. ఇంట్లో పెద్దవాళ్లు ఎప్పుడూ తమ బాగు కోరేవాళ్లే అనే విషయాన్ని మర్చిపోతున్నారు. అందుకే యువతా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తల్లితండ్రులతో ప్రతీ విషయాన్ని చర్చించే ప్రయత్నం చేయండి. యువత అంటే ఉడుకు రక్తం. ఆ ఉడుకు రక్తం ఏ పనికైనా ఇట్టే మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది మంచి, ఇది చెడు అని ఆలోచించే అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. అందుకే కాస్త ఆగి ఆలోచించి చూడండి.

మీ జీవితం ఎంత అందంగా మలచుకోవచ్చునో తెలుస్తుంది. నేటి యువతరం నిర్ణయాల్ని తీసుకోవడంలో చాలా దూకుడు స్వభావం ప్రదర్శిస్తోంది. ఈ దూకుడు చాలా ప్రమాదకరం. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి మీ తల్లి తండ్రులతో చర్చించండి. తల్లి తండ్రుల దగ్గర దాచే విషయాలంటూ ఏమీ ఉండవు. ఒకవేళ అలా దాచడం మొదలుపెడితే అదే మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. తద్వారా ఆ ఒత్తిడి ఆత్మహత్యలకు ప్రేరణ అవుతుంది. ఈ రకంగానే యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఎంతో ప్రేమగా పెంచుకున్న తల్లితండ్రులకు విషాదాన్ని మిగులుస్తున్నారు. 

అందుకే తల్లి తండ్రులను స్నేహితులుగా భావించండి. అప్పుడు వారే తమ వయసును తగ్గించుకుని మీ నిర్ణయాలను, ఆలోచనలను గౌరవిస్తారు. చదువు, ప్రేమ, ఉద్యోగం ఇలా ఒక్కటేమిటి ఏ విషయంలోనైనా, ఒక్క విషయం దాచాల్సి వస్తే దాన్ని కప్పిపుచ్చడానికి మరిన్ని విషయాల్ని దాచాల్సి వస్తుంది. దాంతో మానసికంగా కుంగుబాటుకు గురి కావాల్సి వస్తుంది. అందుకే తల్లితండ్రుల్ని తొలి స్నేహితుల్లా భావించండి. వారితో చిన్న నాటి నుండే ప్రతీ విషయాన్ని షేర్‌ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అప్పుడే మీరు అనుకున్నవన్నీ సాధించగల్గుతారు. స్వార్థం లేకుండా ఆలోచించేది కేవలం తల్లి తండ్రులే. తల్లితండ్రుల వద్ద సమస్యను దాచి పెట్టడం దగ్గరే అసలు సమస్య మొదలవుతోంది. అదే కుంగుబాటుకి దారి తీస్తోంది. అందుకే ప్రపంచాన్ని వేధించే అతి పెద్ద సమస్యగా తయారయ్యింది 'కుంగుబాటు'. దీనికి పరిష్కారం ఎక్కడో లేదు. మన ఇంట్లోనే ఉంది. తల్లి తండ్రుల సూచనలు, సలహాల్లోనే దాగి ఉంది. దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సింది యువతే. ఈ విషయాల్ని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ప్రయోగాత్మకంగా విశ్లేషించి, చెబుతున్నారు. ఈ కుంగుబాటుకు అమ్మాయిలు, అబ్బాయిలు ఎవ్వరూ అతీతులు కారు. దీనికి 'మందు' మీ ఇంట్లోనే ఉంది. 

 నేటి యువతే రేపటి భవిత అంటారు. అందుకే యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన బాధ్యత తల్లితండ్రులదే. అలాగే యువత కూడా మార్కెట్లో దొరికే గాడ్జెట్స్‌కిచ్చే వేల్యూని తల్లితండ్రులకిస్తే వారి భవిష్యత్తు పూల బాటే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. 

మరిన్ని యువతరం
carefull with technology