నోస్ట్రడామస్ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా నోస్ట్రడామస్ పేరు అందరికీ పరిచయమే. నోస్ట్రడామస్, ఎప్పుడో నాలుగు శతాబ్దాల క్రితమే భవిష్యత్తుని ఊహించారు. జాన్ ఎఫ్ కెన్నడీ హత్య నుంచి, హిట్లర్ హింస దాకా ఎన్నెన్నో విషయాల్ని నోస్ట్రడామస్ ఎప్పుడో చెప్పేశారు. అలా నోస్ట్రడామస్ రాసిన అనేక ముఖ్యమైన అంశాల్లో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి కూడా ప్రస్తావించారు. ఇది ఎవరి ఊహలకీ అందని విషయం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే అల్లకల్లోలమేనని ఎన్నికల సమయంలో చాలామంది అనుకున్నారు. దాన్ని ట్రంప్ నిజం చేసి చూపిస్తున్నారు. అయితే ఏడాది క్రితమో రెండేళ్ళ క్రితమో కాదు, నాలుగు వందల యాభై ఏళ్ళ క్రితమే నోస్ట్రడామస్ ట్రంప్ గురించి రాశారంటే నమ్మగలమా? నమ్మి తీరాలి. 'ద గ్రేట్ షేమ్‌లెస్ ట్రంపెట్' అని ప్రస్తావిస్తూ డోనాల్డ్ ట్రంప్ గురించి ముందే ఊహించడం నోస్ట్రడామస్‌కే చెల్లింది.
ట్రంపెట్ రాకతో ప్రపంచం అల్లకల్లోలమవుతుంది. న్యూక్లియర్ యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుందని కూడా నోస్ట్రడామస్ పేర్కొన్నారు. ట్రంప్ మూర్ఖత్వానికి హద్దూ అదుపూ ఉండదనీ, ఆయనకు వ్యతిరేకంగా ప్రజాందోళన ఉధృతమవుతుందని, ఈ క్రమంలో ట్రంప్ మరింతగా చెలరేగిపోతాడని కూడా స్పష్టం చేశారు నోస్ట్రడామస్.
భవిష్యత్తుని ముందే ఊహించిన నోస్ట్రడామస్ ప్రపంచం గురించి పేర్కొన్న అతిముఖ్యమైన అంశాల్లో మూడో ప్రపంచ యుద్ధం కూడా ఒకటి. రెండు పెద్ద దేశాల మధ్య అణుయుద్ధం జరుగుతుందని ఆయన ప్రస్తావించారు. అయితే అమెరికా, రష్యా ఆ రెండు దేశాలని ఇంతవరకూ భావించారు. కానీ ట్రంప్ రాకతో ఈక్వేషన్స్ మారాయి. ట్రంప్, చైనాకి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. అలాగే ప్రపంచంలోని పలు దేశాలకు ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలు న్యూక్లియర్ ఆయుధాల పరిజ్ఞానాన్ని కలిగి ఉండటంతో ఏ చిన్న అలజడి రేగినా ప్రపంచానికే పెనుముప్పు వాటిల్లుతుంది. ఇప్పుడు ప్రపంచమంతా ఈ అంశం చుట్టూనే ఆందోళన చెందుతుంది. ట్రంప్ లాంటి వ్యక్తి చేతిలో అగ్రరాజ్యం అమెరికా ఉండటంతో ఆ దేశ అణుశక్తిని చాటే అత్యుత్సాహంలో ప్రపంచ వినాశనానికి ఆయన కారకుడవుతాడా? అనే భయం ప్రపంచమంతా కలగడం సహజమే. ప్రపంచం ఇంతకుముందెన్నడూ చూడని తీవ్రతతో భూకంపం సంభవించడమే కాకుండా, భూకంపాలు ప్రపంచ వ్యాప్తంగా సర్వసాధారణమైపోతాయని కూడా నోస్ట్రడామస్ చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రపంచంలో ఏదో ఒక మూల చెప్పుకోదగ్గ తీవ్రతతోనే భూకంపాలు సంభవిస్తున్నాయి. గ్లోబల్ ఎకానమీ కుప్ప కూలిపోవడం, ధనవంతులు పదే పదే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూడటం వంటివన్నీ మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ నోస్ట్రడామస్ అంచనాలు నిజమై ట్రంప్ ప్రపంచ విధ్వంసకారిగా మారడమంటూ జరగకూడదనే ఆశిద్దాం.
|