Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> సైకియాట్రిస్ట్

psychiatrist

హోటల్ బంజారా..సమయం సాయంత్రం ఆరుగంటలు.

ఆల్ ఇండియా సైకియాట్రిస్ట్ ల కాన్ఫరెన్సునుండి బైటకొస్తున్న”బాలి వెర్నా కార్” కు అడ్డమొచ్చిన వ్యక్తి ని రక్షించాలని సడన్ బ్రేక్..వేశాడు అవినాష్. కార్ ను గమనించకుండా హడావిడిగా వెళ్ళిపోతున్న వ్యక్తిని చూస్తూనే కార్ దిగి .. పరుగెత్తుకెళ్ళి..

“డాక్టర్ రవీ! కాన్ ఫరెన్స్ లో ఉండవలసి నువ్వుయిలా?”

“ఏమిచేయమంటావ్ మిస్టర్ బాలీ?ప్రాణభయం.”

“ఓకే!  తర్వాత మాట్లాడుదాం ..ముందు కారెక్కు ..”

“నా కారు పార్కింగ్ లో వుంది.”

“కార్ నెంబర్ చెప్పి కీస్ అవినాష్ కు యివ్వు.అవినాష్!  టేక్ కేర్ .”

అప్పటికే స్టెల్లా డ్రైవింగ్ సీటులో..శిరీష ఫ్రంట్ సీటులో సెటిలై పోయారు. కార్ ఆఫీసు ముందు ఆగింది  .అందరూ లోపలికి వచ్చేసారు.
‘”రవీ!మా జానీ గెస్ట్ రూం చూపిస్తాడు..ముందు రిలాక్ష్ అయిపో.తర్వాత ప్రాణభయం ఎపిసోడ్..

జానీ! అల్మైరాలో న్యూ నైట్ డ్రెస్ లున్నాయి.సార్ క్రిందకి రాగానే అందరికీ స్ట్రాంగ్ కాఫీలు.”

ఓకే బాస్ !

జానీ డాక్టర్ ని పైకి తీసుకెళ్ళి పోయాడు.అవినాష్ వచ్చి..

“బాస్ నేను కార్ తీస్తుంటే పార్కింగ్ ప్లేస్ లో ఆ కారునే గమనిస్తున్నఓ వ్యక్తి అనుమానాస్పదం గా కనిపించాడు  నన్నుచూస్తునే తప్పుకున్నాడు. ఫోటో తీసే చాన్సు దొరకలేదు.”

“ఫర్గెట్ ఇట్..మన రవికిరణ్ ..సైకియాట్రిస్ట్..గుర్తున్నాడా?వెరీ ఫేమస్..డాక్టర్..మన సిటీలో. తనని ఈ స్టేజ్ లో చూడ్డం చాలా వింతగా గా వుంది.మనిషి చాలా భయపడి పోయాడు.నాకు క్లోజ్ ఫ్రెండ్.మంచి మనసున్న మనిషి.”

“ఓకే బాస్ ..డాక్టర్ గారు వస్తున్నారు..స్టెల్లాని..”

“స్టెల్లా..శిరీషలు కూడా వస్తున్నారు.జాకీని కూడా ..రమ్మను.”

“ ఓకే బాస్ ! హిఈజ్ ఆల్రెడీ ఇన్ అవర్ లైబ్రరీ.

జానీ కాఫీ ట్రే తో ఎంటరై పోయాడు.

“రవీ! హౌఅర్యూ? నౌ ఓకేనా ?”

“ఎస్..నేనే..కాన్ ఫరెన్స్ అయ్యాక నిన్ను మీట్ అవుదామనుకున్నా..సాయంత్రం టీ బ్రేక్ లో వాడిని గమనించాను.. వాడు నన్నే షాడో లా ఫాలో అవుతున్నాడని.భయమేసింది. తప్పించు కోవాలని బయటికొచ్చా.వాడూ నాతోనే బయటి కొచ్చాడు.కార్ వదిలిపెట్టి..పారిపోవాలనుకుని ఆ టెన్షన్లో నీ కారుకి అడ్డం వచ్చాను.”

“నీడ్ నాట్ వర్రీ.విఆర్ ఆల్ హియర్.నౌ టెల్ మీ ద ఫాక్ట్స్.’

స్టెల్లా తన నోట్ పాడ్ తో రెడీ గా వుంది.

“పోయినవారం..సండే..ఆరోజు అనుకోకుండా వాన పడింది..అప్పుడు నాతో బాటు విలియమ్స్ అనే పేషెంట్ కౌన్సిలింగ్ లోవున్నాడు. అప్పుడు నా రిసెప్షన్ గర్ల్ రమ్య వచ్చి..”

“సర్ !విలియమ్స్ ఇంటినుంచి ఫోన్ వచ్చింది..వాళ్ళ పాపకు ప్రమాదం జరిగిందని వాళ్ళ వైఫ్ గాబరా పడుతోంది.”

“నేను విలియమ్స్ తో విషయం చెప్పాను.వెంటనే బయలు దేరాలంటే పెద్ద వర్షం.బైక్ వుంది. నా రైన్ కోట్ యిచ్చి పంపించాను.గంట తర్వాత ఎస్ఐ , పోలీస్ లతో వచ్చాడు.నన్ను పోలీస్ స్టేషన్ కు రమ్మంటే షాక్ అయి పోయాను.”

“యస్ఐ..కారణం చెప్పాడా?”

“కారణం విలియమ్స్ ను ఎవరో మర్డర్ చేసారని అతని రైన్ కోట్ పోకెట్లో నా విజిటింగ్ కార్డ్ దొరికిందని.

నేను నిజం  చెప్పాను.ఆ కోటూ విజిటింగ్ కార్డ్ నావే నని. అందరినీ సాక్ష్య మడిగి ..వార్నింగ్ యిచ్చి..వెళ్ళారు మూడోరోజు నేను విలియమ్స్ ఫ్యామిలీ ని పరామర్సించాలని వాళ్ళ ఇంటి కెళ్ళి వచ్చే సరికి మళ్ళి అదే ఎస్ఐ..విత్ పోలీస్.ఈ సారి నా క్లయింట్..మధులిక ను ఎవరో మర్డర్ చేసారని..ఆమె చేతిలో నా క్లినిక్ విజిటింగ్ కార్డ్ దొరికిందని..ఆమె నా క్లినిక్ ..నుంచే వెళ్తూ మర్డర్ అయ్యిందని అభియోగం..నేను క్లినిక్ లో లేని టైము అదే విలియమ్స్ ఇంటికి వెళ్ళిన టైం లో మర్డర్ చేసానని.. ఒక ప్రక్క పోలీస్ ..మరో ప్రక్క ఈ షాడో.. నన్ను చంపాలని .
బాలీ! జీవితమంటేనే విసుగ్గా వుంది .”

“ఒక్కనిమిషం రవీ!  విలియమ్స్ మర్డర్  మధులిక ..నీ క్లినిక్ కు వచ్చే ముందు జరిగిందా ? తర్వాతా?”

“ విలియమ్స్ ది అదే ఫస్ట్ సిట్టింగ్. మధులికది మూడో సిట్టింగ్ .దాదాపు నెలనుండి ..వస్తోంది.మొదటి రెండు సిట్టింగ్స్ లో యేమీ మాట్లాడలేదు. మొదటి సారి మొన్ననే నోరిప్పింది..”

“ఓకే ..తను యేమి చెప్పిందో గుర్తుందా?”

“సారీ బాలీ ..క్లైంట్ చెప్తున్నప్పుడు నేను..వినను .రికార్డు చేసుకుని ఖాళీ సమయాలలో విని అనాలసిస్ చేసుకుంటాను..నోట్స్ రాసుకుంటాను.ఆరోజే మధులిక మర్డర్ జరగడము..నిన్నంతా సెమినార్ గొడవ మూలంగా మధులిక స్టేట్ మెంట్ వినలేకపోయాను.” 
“ఇట్స్ ఆల్ రైట్..ఆ  సిడి?”

“జనరల్ గా నా సెక్రటరీ డాక్టర్ ప్రియ అన్ని  సిడీ లకూ లేబుల్స్ వేసి నా డెస్క్ మీద పెడుతుంది.ఆ రోజు ...ప్రియ యా..గుర్తుకొచ్చింది..వాళ్ళ మమ్మీ కీ డాక్టర్ తో అపాయింట్మెంట్  వుందని మధ్యాహ్నమే  వెళ్ళిపోయింది.”

సో ఆ రికార్డెడ్ సిడి ..నా రూం లో నా డెస్క్ మీద రమ్య పెట్టి వుంటుంది.’

“గెట్ హర్ ఇన్ ఫోన్ ..”

“వన్ సెకండ్..”

ట్రై చేసి  నిస్సహాయంగా చూసి

“సారీ మిస్టర్ బాలీ!స్విచ్ డాఫ్..వస్తోంది..ఐ విల్ ట్రై ప్రియ..యా.. వన్ మూమెంట్.. షి సెడ్ ..తనకి ఐడియా లేదట.”

“అవినాష్ ! గోటు ..క్లినిక్ .. అండ్ గెట్ ఇట్ ..రవీ..టెల్ అడ్రస్ అండ్ గివ్ హిమ్ కీస్..” అరగంట తర్వాత అవినాష్ ఫోన్  

“బాస్ !ఆ పేరుతో సిడి..లేదు..డాక్టర్ గారి రూం అంతా చిందరవందరగా వుంది..విండో బ్రేక్ చేసి వుంది.”

“రవీ ! విన్నావుగా..వాట్ టు డు? డేంజర్ నిన్ను షాడో లా ఫాలో..అవుతోంది..నీ రైన్ కోట్ లో వున్న విలియమ్స్ ను నువ్వనుకొని మర్డర్ చేసుంటాడు.ఈ సారి నువ్వే టార్గెట్.ఓకే ..నేను ప్లాన్ చేస్తాను..అవినాష్ నీకు రమ్య అడ్రస్ ఫోన్ నెంబరు వాట్స్ యాప్ లో పంపిస్తా.తనని కలిసి ..”

“ఓకే బాస్..ప్లీజ్..”

****** 

“డాక్టర్! మీ దగ్గకొచ్చిన యస్ఐ..ది యే స్టేషన్?

“జూబిలీ హిల్స్..బాలీ..”

“జాకీ..ఆ స్టేషన్ సిఐ..రమణ కు నేను తెలుసు.నువ్వెళ్ళి రేపు హత్యజరిగిన ప్రదేశం చూస్తామని..ఎస్ఐ ని పంపించమని ..డాక్టర్ మన క్లైంట్ అని చెప్పు. కమీషనర్ తో మాట్లాడాలంటే..నాకు ఫోన్ చెయ్.

రవీ!టేక్ రెస్ట్.హంతకుడు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు..వాడికి కావలసిన సిడి దొరికుండదు.అదే వాడికి బెట్.” 

**** 

డాక్టర్ క్లినిక్ దగ్గరలోనే..వుంది..హత్యా స్తలం.యస్ ఐ నాయక్ బాలిని చూస్తూనే గుర్తు పట్టివిష్ చేసాడు .

“మీరంతా క్లూస్ కోసం వెదకండి. అనుమానం వుంటే ఫోటోలు తీయండి.మొన్న వాన పడింది. ఎలాంటి ప్రింట్స్ కనిపించినా..మనకు ఉపయోగ పడతాయి.”

అవినాష్ జాకీలతో బాటు స్టెల్లా కూడా ..జూమ్ కెమెరాతో..ప్రతి అంగుళాన్ని సెర్చ్ చేయడం లో నిమగ్నమై పోయింది.అరగంట తర్వాత స్టెల్లా ఆనందంతో అరిచేసింది..

“బాస్ ! ఐ గాట్ ఇట్.”

అందరూ..స్టెల్లాని ..చుట్టేసారు.

******

జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్.సిఐ రమణ ..యస్ఐ నాయక్ లను చూస్తూ  మధులిక కు సంబంధించి వస్తువులు ..చూపిస్తారా? “షూర్ మిస్టర్ బాలీ. “ అంటూ యస్ఐ స్వయంగా స్పెషల్ బాక్స్ లో భద్ర పరిచిన బేగ్..విజిటింగ్ కార్డ్..బాలి ముందుంచాడు.

“బాలీ సాబ్ !..బాగ్ లో మధులిక పర్సనల్ సామానుతో బాటు సెల్ ఫోన్ మాత్రమే వుంది.పదివేలు కరేన్సీ వుంది.సెల్ లో తను చనిపోడానికి ముందు రికార్డు చేసిన ఆడియో క్లిప్పింగ్ వుంది.వినండి.”

“డాక్టర్ క్లినిక్ నుండి బయటికొచ్చాను.నేను కార్ డ్రైవ్ చేస్తూ రియర్ మిర్రర్ లోంచి గమనించాను.నన్ను మరో కారు ఫాలో అవుతోంది. పేస్ మాస్క్ వేసుకున్న మనిషి డ్రైవ్ చేస్తున్నాడు. భయం వేసింది.హటాత్తుగా నాకార్ ఆగిపోయింది.” “అంతే వుంది సాబ్. “  

“భయంతో కారు దిగి పరుగులు తీస్తుంటే హంతకుడు వేటాడి..చంపేసుంటాడు..అప్పటికే హంతకుడు కారులో వెయిట్ చేస్తున్నాడంటే ..డాక్టర్ నిర్దోషే కదా?”

“బాలీ సర్! అందుకే ఆయన్ని అరెస్ట్ చేయలేదు.ఈ కేస్ మీరు ఇన్వెస్ గేట్  చేస్తున్నారంటే హంతకుడు త్వరలోనే..”

“వియ్ విల్ ట్రై అవర్ బెస్ట్ ..ఏ క్లూ  దొరికినా మీకు ఇన్ ఫాం చేస్తాను.థాంక్స్ ఒన్స్ అగైన్.”

****

“డాక్టర్ రవీ ! నువ్వూ అవినాష్ మీ హాస్పిటల్ కి వెళ్తున్నారు.ముందు నువ్వు నీ కార్లో వెళ్ళిపో.అవినాష్ నిన్ను ఫాలో..అవుతాడు.కానీ నువ్వు ఒక్కడివే క్లినిక్ లో రాత్రి ఉంటున్న ఫీల్ క్రి యేట్ చేయాలి .అవినాష్ బ్యాక్ డోర్ నుండి ఎంటర్ అవుతాడు. చీకటి పడే దాకా వాచ్ మేన్ తో మాట్లాడుతూ బయటే వుండు. అక్కడ ఏం చేయాలో అవినాష్ చెపుతాడు.మా జాకీ  నైట్ విజన్ బైనాక్యులర్స్ తో క్లినిక్ బయటే వుండి గమనిస్తుంటాడు.వీడియో రికార్డు చేస్తాడు. మనకు కావలసింది హంతకుడు కాదు..ఎవిడెన్స్. నువ్వేమి భయపడకు.అవినాష్ విల్ ప్రొటేక్ట్ యు.”

అర్ధ రాత్రి  ఫోన్ రింగ్ అయింది. అవినాష్ వాయిస్.

“బాస్ మీ ప్లాన్ ప్రకారమే..ఫుట్ ప్రిన్ట్..పడేలా మీరిచ్చిన ..పౌడర్ లిక్విడ్ డాక్టర్ రూంలో స్ప్రే చేసి..డాక్టర్ బెడ్ రూం లో పిల్లోస్ పెట్టి దుప్పి కప్పి డాక్టర్ నిద్ర పోతున్నాడన్న ఇమేజ్ క్రియేట్ చేసి మేం బాత్ రూంలో కాపు కాశాము.హంతకుడు వచ్చి డాక్టర్ అనుకుని పిల్లోస్ ను షూట్ చేసి..మునుపే విరగ్గొట్టిన కిటికిలోంచి పారిపోయాడు.

ఓకే అవినాష్ ..మనకు కావలసింది అదే.ఫుట్ ప్రింట్స్ ఫోటోలు తీసుకొని ..వెలుతురు రాకముందే వచ్చేయండి.

***

“బాస్ !జూబిలీహిల్ల్స్ పిస్ నుంచి రమణ ఫోన్ లో వున్నారు.”

అవినాష్ నుంచి ఫోన్ తీసుకున్నాడు బాలి .

“బాలి సర్ ! మీరు వెళ్ళాక మధులిక హస్బెండ్ ప్రముఖ కాంట్రాక్టర్ మనోహర్ వచ్చి చాలా గొడవ చేసాడు .వారం దాటిపోయినా హంతకుడిని పట్టుకోలేకపోయారని ..మమ్మల్ని  మా డిపార్ట్ మెంట్ ని తెగ తిట్టి పోయారు. కమీషనర్ ఆఫీస్  నుంచి కూడా షంటింగ్ మొదలయ్యింది.సిటీ లో మనోహర్ ఓ బిగ్ షాటట. అందుకే మీకు ఫోన్ ..”

“మిస్టర్ రమణా! కేస్ ఫైనల్ స్టేజ్ లో వుంది. వెయిట్ ఫర్ వన్ టూ డేస్..ఐ విల్ టాక్ టు కమీషనర్ .”

*****

ఏసిపీ శాండిల్య ఛాంబర్.ఏసిపీ తో బాటు బాలి అవినాష్ లు వున్నారు .

“సర్ ! ఈ ఫొటోస్ చూడండి ..మధులిక హత్య జరిగిన చోట మా స్టెల్లా తీసిన ఫోటోలు. ఇవి డాక్టర్ క్లినిక్ లో దొరికిన ఫుట్ ప్రింట్స్ ఫోటోలు ’
“మిస్టర్ అవినాష్ ! ఇవి నాకెందుకు చూపిస్తున్నావ్?”

“సర్? ఇవే హంతకుడి ని పట్టించిన సాక్ష్యాలు..కొంచం కీన్ గా అబ్జర్వ్ చేయండి..మీకే..”

“షూ ప్రింట్స్..అంతే “

“యస్..యు అర్ కరెక్ట్ సర్..”

“శాండిల్యా! ఒకటి రైట్ షు..రెండోది లెఫ్ట్ షు..”

“ఎస్ బాలీ..కానీ యిందులో..సాక్ష్యాలు  ?”

“వున్నాయ్..లెఫ్ట్ లెగ్ షు..టెన్ నెంబర్..రైట్ లెగ్ షు లెవెన్ నెంబర్. రెండు ప్రింట్స్ చూడండి.సేం టు సేం. ఈ ఫోటో హత్యా స్థలంలో తీసింది. ఈఫోటో డాక్టర్ ఛాంబర్ లోది. మధులికని హత్య చేసిన హంతకుడే డాక్టర్ ని చంపాలని క్లినిక్ లో మొన్న ప్రవేశించి కాల్పులు జరిపాడు..మీరు మీ ఫోరెన్సిక్ డిపార్టుమెంటు తో చెక్ చేయించండి. రెండు ప్రింట్స్ ఒకరివే.నౌ విహావ్ టు ఫైండ్ అవుట్ ద మర్డరర్..యా మై క్లియర్ మిస్టర్ శాoడిల్యా ?”

“ఎస్ మిస్టర్ బాలీ “

“మొన్న డాక్టర్ ఛాంబర్ లో హత్యా ప్రయత్నం జరిపిన వ్యక్తి ఫోటోలు తీసాం .కాని మాస్క్ ధరించాడు హంతకుడు.అయినా నొ ప్రొబ్లెం.అన్నట్లు రేపు మధులిక..పదోరోజు సెరిమనీ..మీరు వెళుతున్నారా?.

యా.. మనోహర్ వచ్చి ఇన్వైట్ చేసాడు ..సిటీ లో బిగ్ షాట్ మరి ?

అయితే రేపు కలుద్దాం..

*** 

“మిస్టర్ రమణా! రేపు మనోహర్ సెరిమనీ కీ..సారీ..మధులిక సెరిమనీ కీ వెళ్తున్నారా?”

“మాకు తప్పదు కదా మిస్టర్ బాలీ..కమీషనర్ సార్ కూడా వస్తారు.మీరు ?”

“సారీ మిస్టర్ రమణా! పదోరోజు సెరిమనీ నాడే హంతకుడిని పట్టుకుంటానని మనోహర్ కి మాటిచ్చాను. మాట నిలబెట్టుకోవాలిగా?”

“అంటే రేపు ?”

“మీరే చూస్తారుగా.. “ 

****

జూబిలీ హిల్స్..మనోహర్ బంగ్లా..సెరిమనీ చాలా గ్రాండ్ గా జరిగిపోయింది.కమీషనర్ తో లాంజ్ లో మాట్లాడుతున్న ఏసిపీ ఫోన్ మోగింది.

“మిస్టర్ మనోహర్ ! మధులికను హత్య చేసిన హంతకుడు దొరికాడట ..జూబిలీ హిల్స్ పియస్ లో మనకోసం డిటేక్టివ్ బాలి బృందం వెయిట్ చేస్తున్నారు. “

చెప్పేసి బయలు దేరుతున్న శాండిల్య ను రిక్వెస్ట్ చేస్తున్నట్లు..

“సర్ !నేను కూడా మీతో వస్తాను . నా భార్యను చంపిన హంతకుడిని నేను చూడాలి.”

“వైనాట్ ..కం..”

*****

జూబిలీ హిల్స్ పోలిస్ స్టేషన్.. నాయక్ రూం. బిగ్ సైజ్ మానిటర్  ముందు స్టేట్ ఫిoగర్ ప్రింట్స్ ఎక్స్ పర్ట్ లతో బాలి బృందం.                           స్టేషన్ లోకి ఎంటర్ అయ్యేకారిడార్ సిసి కెమెరా ల్లో స్పష్టంగా కనిపిస్తోంది.అప్పటికే బాలి సూచనల మేరకు చేయ వలసిన ఏర్పాట్లన్నీ పూర్తీ చేసేసారు ఫింగర్ ప్రింట్స్ టెక్నికల్ స్టాఫ్.

ముందు సిఐ ..ఆయనతో బాటు ఏ సిపీ ..ఆయన ప్రక్కనే మనోహర్.

సిసి కెమెరాని  ఫ్లోర్ మీదికి ఫోకస్ చేశారు.ఫ్లోర్ మీద అందరి షు ప్రింట్స్ క్లియర్గా కనిపిస్తుంటే టెక్నికల్ స్టాఫ్ బాలి యిచ్చిన ప్రింట్స్ తో టేలీ చేసుకుంటున్నారు.

టెక్నికల్ టీం లీడర్ ఓకే అన్నట్లు తమ్స్ అప్ సిగ్నల్ చూపించాడు.

నాయక్ బాలీ సైగతో.. రూం బయటి కెళ్ళి సిఐ తో రహస్యంగా ఏదో చెప్పాడు.

రమణ ఏసిపీ తో విషయం చెప్పాడు.

“వేర్ ఈజ్ ద మర్డరర్?ఐ వాంట్ తో సీ ద బాస్టర్డ్..”

గట్టిగా అరిచేస్తున్న మనోహర్ బుజం చుట్టు చెయ్యేసి..సిఐ  రమణ ..

“బి కూల్ మిస్టర్ మనోహర్ ! హి ఈజ్ ఇన్ ద సెల్..లెట్ అజ్ మూవ్ ..” అంటూ  సెల్ లోకీ నడిపించి 

“హి ఈజ్ దేర్..చూడండి”

అంటూ హటాత్తుగా బయటికోచ్చి..సెల్ డోర్ లాక్ చేసాడు.

“అరే ! సిఐ ! గేమ్స్ ఆడుతున్నావా? నేను ఏవరో తెలుసా..ఐ విల్ సీ యువర్ ఎండ్..”

అరిచేస్తున్న మనోహర్ మాటల్ని డామినేట్ చేస్తూ.. మధులిక మాటలు

“డాక్టర్! నాపేరు మధులిక.నా భర్త పేరు మనోహర్. ఏవన్ కాంట్రాక్టర్ .పెద్ద బంగ్లా మూడు కార్లు ..ఇంటినిండా నవుకర్లు. బ్యాంకు నిండా డబ్బు. మా పెళ్ళి అయిదు సంవత్సరాల క్రితం జరిగింది. నాకు పిల్లలు లేరు.పుట్టరు కూడా..ఆయన సంసారానికి పనికిరాడు. ఈ విషయం నేను బయటికి చెపుతానేమోనని చచ్చేంత అనుమానం. నన్ను చంపుతారేమోనని భయంగా వుంది.అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఒక వేళ నేను చని పోతే..వీడి విషయం లోకానికి తెలియ చేయండి. హి ఈజ్..ఇంపోటెంట్...”

“సిడి ప్లేయర్ నుండి వస్తున్న సౌండ్ ఆగిపోయింది..”

అప్పటి వరకు అరుపులతో కేకలతో భయంకరంగా అరిచేసిన మనోహర్ సెల్ లో కుప్పకూలిపోయాడు.

**** 

పోలీస్ స్టేషన్ లోనే ప్రెస్ మీట్  యేర్పాటు చేసాడు రమణ.

బాలీ తన పరిశోధన గురించి వివరించాడు.

“మధులిక డాక్టర్ తో కౌన్స్లింగ్ కు వెళ్తుందని గ్రహించాడు మనోహర్. తన రహస్యం బయిటికి పొక్కి పోతుందని భయపడిపోయాడు. ముందు డాక్టర్ ని తర్వాత మధులికని చంపేయాలని..ఆ రోజు క్లినిక్ నుండి డాక్టర్ యిచ్చిన కోట్ ధరించి బయటి కొచ్చిన విలియం ను డాక్టర్ గా పొరపాటుపడి..చంపేసాడు. మూడో సిట్టింగ్ తర్వాత బయటికి రాగానే ముసుగులో వెంబడించి మధులికను చంపేసాడు. ఇక మిగిలింది డాక్టర్

. అతని దగ్గరున్న సిడి.. అందుకే క్లినిక్ లో ప్రవేశించి డాక్టర్ ఛాంబర్ గాలించి సిడి దొరక్క పోవడంతో క్లినిక్ ను నాశనం చేసేసాడు. తర్వాత మరో సారి క్లినిక్ లోకి ప్రవేశించి  ..బెడ్ మీద ఏర్పాటు చేసిన పిల్లో లనే డాక్టర్ అనుకోని ఫైర్ చేసాడు.

హత్యా స్తలంలో దొరికిన ఫుట్ ప్రింట్స్ మీద అనుమానం రావడంతో క్లినిక్ లో అవినాష్ పౌడర్ స్ప్రే చేసి ..ఫుట్ ప్రింట్స్ సంపాదించాడు.
కంపేర్ చేసి చూస్తే..రెండు ఒకరివే అని తేలిపోయింది.మా జాకీ మనోహర్ షు షాప్ ట్రేస్ చేసి ఆ నంబర్ షు మనోహరే కొన్నాడని కన్ ఫం చేసాడు. ఆరోజు మధులిక మాటలు రికార్డు  అయిన సిడి పొరపాటున రమ్య తన బాగ్ లో పెట్టుకోవడం తో  ఆ సాక్ష్యం మాకు లభించింది.మనోహరే హంతకుడని తెలిసినా  ఫింగర్ర్ ప్రింట్స్ నిపుణులతో చెక్ చేయించి మనోహర్ ను అరెస్ట్ చేయించాను.”
హర్ష ధ్వానాల మధ్యబాలీ అందరికీ అభివాదం చేస్తే  ..

ఏసిపీ శాండిల్య షేక్ హ్యాండిచ్చి హగ్ చేసుకున్నాడు *

మరిన్ని కథలు
jeevanasmrutulu