Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sirasri question

ఈ సంచికలో >> శీర్షికలు >>

10-03-2017 నుండి 16-03-2017 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈ వారం మొత్తంమీద మాటతీరు విషయంలో సరిచుసుకొనే విషయంలో మరొకసారి తరచిచూసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో ఉన్నతమైన ఫలితాలు పొందుటకు శ్రమించాల్సి రావోచ్చును. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. సాధ్యమైనంత వరకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది, ఆ ప్రయత్నాలు కలిసి వస్తాయి. జీవితభాగస్వామితో వివేదాలు వచ్చుటకు ఆస్కారం కలదు, కావున సర్దుబాటువిధానం మంచిది. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. మధ్యవర్తిత్వం వలన అనుకోని సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది.

 

 

 వృషభ రాశి : ఈ వారం మొత్తంమీద పనిఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు కాస్త శ్రమించాల్సి రావోచ్చును. మిత్రులనుండి లేక తోటివారినుండి సహకారం అందేలా ప్రయత్నం చేయుటయే మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. మీ ఆలోచన ధోరణిని పెద్దలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. మధ్యవర్తిత్వం పనికిరాదు, కావున సాధ్యమైనంత వరకు దూరంగా ఉండుట సూచన. ఎటువంటి మాటపట్టింపులకు వెళ్ళకండి. కుటుంబంలో శుభకార్యక్రమం జరిగే ఆస్కారం కలదు.

 



మిథున రాశి : ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. కొంత నూతన పనుల వలన ఒత్తిడి ఉన్నను వాటిని పూర్తిచేస్తారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడే ఆస్కారం ఉంది , ఆదిశగా మీ ఆలోచనలు ఉండుట సూచన. కుటుంబపరమైన విషయాల్లో మాత్రం ఒత్తిడి ఉంటుంది , కాస్త ఓపికగా వేచిచూసే ధోరణి వలన లబ్దిని పొందుతారు. ఆరోగ్యం విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి, మీ ఆత్మీయుల అనారోగ్యం కూడా మిమ్మల్ని భాదకు గురిచేసే అవకాశం ఉంది.

 


కర్కాటక రాశి : ఈ వారం మొత్తంమీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. పెద్దలసూచనల మేర ముందుకు వెళ్ళుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. మీ మాటల్లో పూర్తిస్థాయి పాజిటివ్ దృక్పథం లేకపోవచ్చును, మానసికపరమైన ఇబ్బందులు రాకూండా జాగ్రత్త పడటం సూచన. బంగారుఆభరణాల విషయంలో ఒకింత జాగ్రత్త తీసుకోవడం సూచన. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. స్త్రీ పరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన.

 



 సింహ రాశి : ఈ వారం మొత్తంమీద ఆరంభంలో ఉన్న ఉత్సాహం చివరి వరకు ఉండకపోవచ్చును. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. నలుగురిలో ఆశించిన మేర ఫలితాలు ఉండకపోవచ్చును. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, విదేశాలలో ఉన్న మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవచ్చును. సంతానం విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మానసికపరమైన ఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం కలదు.

 

 

కన్యా రాశి :   ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులను పూర్తిచేసే విషయంలో స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో ఒకింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మానసికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. నూతన వ్యాపారపరమైన విషయాల్లో సోదరులతో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి, ప్రయత్నాలు చేయుట వలన మంచి ఫలితాలు ఇస్తాయి.



తులా రాశి : ఈ వారం మొత్తంమీద తీసుకొనే నిర్ణయాల విషయంలో బాగాఆలోచించి ముందుకు వెళ్ళండి. సాధ్యమైనంత వరకు చర్చలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. అధికారుల నుండి ఆశించిన మేర సహాకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలకు అవకాశం ఉంది. మిత్రులనుండి వచ్చిన సూచనలు, సలహాలు మీలో నూతన మార్పులకు అవకాశం ఉంది. రావల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పెద్దలను కలుస్తారు,వారితో ఆలోచనలు పంచుకుంటారు.
 

 



వృశ్చిక రాశి : ఈ వారం మొత్తంమీద ఇష్టమైన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలను మొదలుపెట్టుట యందు ఆసక్తిని కలిగి ఉంటారు. ప్రయాణాలు వాయిదాపడే అవకాశం ఉంది. కుటుంబంలో పెద్దలతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వారిసూచనలకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులు తప్పకపోవచ్చును. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి, నూతన ప్రయత్నాలు చేయుట మంచిది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన, అశ్రద్ధ వద్దు. ఉన్నతవిద్యాఅవకాశాలు మెరుగుపడుటకు ఆస్కారం కలదు.

 


ధనస్సు రాశి ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో రావాల్సిన సహాకారం లభిస్తుంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. మీ ఆలోచన తీరు అలాగే మొండినిర్ణయాలు కొంతమందికి నచ్చకపోవచ్చును. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుటకు ఆస్కారం ఉంది. సోదరులతో సమయాన్ని గడుపుతారు, చర్చలకు అవకాశం ఉంది. పెద్దలతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. జీవితభాగస్వామితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది.
 

 

మకర రాశి : ఈ వారం మొత్తంమీద చేపట్టు పనుల విషయంలో స్పష్టత అవసరం. పెద్దలతో పనిచేసే విషయంలో వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మొదట్లో కొంత ఇబ్బందిని ఎదుర్కొన్న , వాటిని విజయవంతంగా అధిగమిస్తారు. మిత్రులతో కలిసి ఆలోచనలను పంచుకుంటారు, ప్రయాణాలు వారితో కలిసి చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. చర్చాపరమైన విషయాల్లో ఒకింత ఒత్తడికి గురయ్యే అవకాశం ఉంది. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చును.

 


కుంభ రాశి :   ఈ వారం మొత్తంమీద కుటుంబపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. మీ మాటతీరు కొంత మందిని ఇబ్బందికిగురిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. స్వల్పఆరోగ్యపరమైన విషయాలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సోదరులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. సంతానం విషయంలో ఒత్తిడికి గురయ్యే ఆస్కారం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది,తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది.

 


మీన రాశి : ఈ వారం మొత్తంమీద నిర్ణయాలు తీసుకోవడంలో ఆరంభములో తడబాటు ఉంటుంది. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళుట సూచన. ఆత్మీయుల నుండి కీలకమైన సహాయం అందుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు మెరుగుపడతాయి. పెట్టుబడులను సరిగా ఉపయోగించుకొనే ప్రయత్నం చేయుట సూచన. నూతన పరిచయాలకు అవకాశం ఉంది , వారితో సమయం గడుపుతారు. మీ పూర్వీకుల నిర్ణయాలను ముందుకు తీసికువెళ్ళు ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. విదేశాలలో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి.

..

మరిన్ని శీర్షికలు
Yummy Egg Curry - Village Style