Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గతసంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.  http://www.gotelugu.com/issue205/585/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

( గతసంచిక తరువాయి ).... అందుకే పరిపూర్ణమైన క్రీడాకారిణిగా ఆమె మార గలిగింది.

చిట్టీ! నువ్వు కూడా టిఫిన్‌ చేసెయ్‌. కాలేజీ దగ్గర దింపుతాను’’ అశోక్‌ చెప్పాడు.

సరేనంటూ లేచి స్నానం చేసి, కాలేజీ యూనిఫాం వేసుకుని వచ్చింది.

ఇద్దరూ టిఫిన్‌ చేసి, తండ్రిని జాగ్రత్తగా చూడమని నాయనమ్మకు వంద జాగ్రత్తలు చెప్పి యిల్లు కదిలారు.

ఇద్దరూ కలిసి బైక్‌ మీద బయల్దేరారు.

అశోక్‌ ఎం.బి.ఎ అయ్యాక తను సొంతంగా ఏదోక ఫర్మ్‌ పెట్టుకోవడం కోసం కృషి చేస్తున్నాడు.

గత రెండు మూడేళ్ళ నుంచీ పిత్రార్జితమైన ఆస్థి గురించి అన్ని వివరాలూ తెలుసుకుంటున్నాడు.

సిటీలో మంచి ఏరియాలో తాముంటున్న ఆ ఎకరం స్థలం లోని ఇల్లు తమకున్న పెద్ద ఆస్థి అని అతను గ్రహించాడు.

ఇల్లంటే ఆ జమీందారీ బంగ్లా వున్న స్థలమే రెండు కోట్లు ఖరీదు చేస్తుంది. అంత మంచి సెంటర్‌లో ఎకరం ఖాళీ వుండటమే వింత...
బిజినెస్‌ మేగ్నెట్స్‌ కన్ను దీని మీదే వుంది. ఇల్లు కూడా చాలా పెద్దది. ముప్పై బెడ్‌ రూమ్స్‌, ఇరవై హాళ్ళు, పాతిక వరకు బాత్‌ రూమ్స్‌, ముప్పై వరకు వరండాలు, మూడంతస్థులున్న ఆ బంగ్లా వయసు సుమారు వంద సంవత్సరాలు.... దాని మెయిన్‌టెనెన్స్‌ భరించ లేక, పై భాగానికంతటికీ తాళాలు వేయించేశారు.


కింద కూడా చాలా పెద్దది....ఎప్పటి కప్పుడు రిపేర్లు చేయించు కుంటూ వుంటే ఇంకో వందేళ్ళయినా దృఢంగా వుండే రాతి కట్టడమది. ఎక్కడ చూసినా రోజ్‌ ఉడ్‌...

అది కేవలం తనకీ, తన పుట్టింటి వాళ్ళకి చెందేలా పథకాలు వేస్తోంది మృదులా దేవి.

ఆ మధ్య వరకూ ఈ విషయం అశోక్‌ కి తెలియదు. తెలిసిన తరువాత సంతకాలు పెట్టాల్సి వచ్చినపుడు కాస్తంత జాగ్రత్తగా వుంటున్నాడు.
ఇవి కాక లాండ్‌ ఫీలింగ్‌లో వే ఎకరాలు పోగా మిగిలిన మూడు వంద ఎకరాల భూమీ, రెండు మూడు కంపెనీలలో షేర్లు, ఒక ఫార్మాస్యూటికల్‌ కంపెనీ వున్నాయ్‌.

ఎం.బి.ఎ అయ్యాక అశోక్‌ ఫార్మాస్యూటికల్స్‌లో ప్రవేశించాడు. ఆ రోజు ఇంట్లో యుద్ధమే జరిగింది.

అప్పటి వరకూ ఆ కంపెనీని మృదులా దేవి తమ్ముడు మెయిన్‌టైన్‌ చేసే వాడు.

ఏ రోజూ ఆ కంపెనీ మీద వచ్చిన ఆదాయ వ్యయాలు లెక్కలు అశోక్‌ చూడ లేదు. చూసిన తర్వాత కళ్ళు తిరిగాయి. గత ఏడేళ్ళ నుంచీ లాస్‌ లోనే నడుస్తోంది. అంత లాస్‌లో ఉన్నప్పుడు మూసెయ్య కుండా ఎందుకు రన్‌ చెయ్యాలన్న వాదన అశోక్‌ది.

యిద్దరి మధ్యా వాదం జరిగాక విషయం మంచంలో వున్న భూపతి దగ్గరికి వెళ్ళింది.

ఆ కంపెనీని ముందు నుంచీ నడుపుతున్నాడు కాబట్టి అది అతని అండర్ లోనే వుండాని మృదులా దేవి...

తనకి ఇరవై మూడేళ్ళు వచ్చాయి ఎం.బి.ఎ పూర్తి చేశాడు కాబట్టి తన ఆస్తిని తనే మెయిన్‌టైన్‌ చేసుకో గలనని అశోక్‌.....
భూపతి ఏదో చెప్ప బోయాడు. నోటి నుంచి వికృతమైన శబ్దాలు ఏవో వచ్చాయి.

మృదులా దేవి మొహం చిట్లించుకుంది.

కళ్ళ ద్వారా అతను చెబుతున్నది కీర్తనకి అర్ధమయింది....కానీ ఆ విషయం ఆమె ఎదురుగా చెప్పేంత ధైర్యం లేదు.
చివరికి బాగా వున్న ఎడం చేత్తో అతను పేపర్‌ మీద...

‘‘అశోక్‌ ఈ ఆస్థికి వారసుడు. ఎవరూ అడ్డు చెప్పొద్దు.’’ అని రాశాడు.

అలా రాసిన ఆ చేతి వంక మృదులా దేవి కక్షగా చూడటం చూసి జడుసుకుంది కీర్తన. మింగ లేకా కక్క లేకా సవతి కొడుకు ఆధిపత్యానికి ఆ విషయంలో మాత్రం తల వంచింది. అలాగని అశోక్‌ ఎప్పుడూ ఆమెని అవమానించాలనీ, బాధ పెట్టాలనీ అనుకోలేదు. ఆమెతో ముభావంగా వుండే వాడు...తన తల్లి స్థానంలో ఆమెను వూహించుకోవడమంటే ఏంటోగా వుండేది....కానీ ఆమెకి యివ్వాల్సిన గౌరవం విషయంలో తేడా చేయ లేదు.

తల్లిగా ఆమెని ప్రేమించ లేక పోయారు గానీ గౌరవించారు.

ప్రేమకీ, గౌరవానికి మధ్య వున్న తేడా మూలం గానే వాళ్ళు ఎప్పటికీ సమాంతర రేఖలు గానే వుండి పోయారు. అందులో సందేహం లేదు.
జగపతి ఫార్మాస్యూటికల్స్‌లో అతను ప్రవేశించాక మొట్ట మొదట అతను చేసిన పని రఫెష్‌ స్టాఫ్‌ని తీసుకోవటం.... ష్రన్స్‌ రెండూ కండిషన్‌లో వున్నాయి.

ఒక్కొక్క మిషన్‌ ఖరీదు ముప్పై లక్షల పై మాటే...కాక పోతే లోటల్లా ఆర్డర్స్‌ దగ్గరే. అతను టేకప్‌ చేసే నాటికి ఒక్క ఆర్డర్‌ కూడా చేతిలో లేదు.
అప్పుడు అతనికి ఉపయోగ పడింది. ఎం.బి.ఎ డిగ్రీ. తొంభై లక్షల ఆర్డర్‌ ఒకటి, నలభై లక్షల ఆర్డర్‌ ఒకటీ సంపాదించ గలిగాడు.

అయిదేళ్ళ పాటు ఒప్పందం....

అన్ని ఖర్చులూపోను వాటి మీద అతని కొచ్చే ఆదాయం నెలకి ఇరవై వేలు.

అతను సాధించిన తొలి విజయమది.

ఆ విషయం అతను గర్వంగా పిన్నికి చెప్ప లేదు. ఆనందం గానే చెప్పాడు.

కానీ ఆమె ఆ విజయాన్ని కుటుంబ విజయంగా భావించ లేదు. ఆమెలో ఈర్ష్యా ద్వేషాలు పడగ విప్పాయి.

దీనిని జీర్ణించుకో లేక ఏం చెయ్యాలో తెలీక తన తమ్ముడిని సంప్రదించ డానికి పుట్టింటికి వెళ్ళిందామె.

ఆమెకి పుట్టింటి బలగం ఎక్కువే. ఇద్దరు తమ్ముళ్ళు, వారి భార్యలు, ఓ చెల్లి, ఇల్లరికపు మరిది ముసలి తల్లిదండ్రులు అందరూ ఒకింట్లోనే.
వీళ్ళ కుటుంబ అవసరాలలో సగం మృదులా దేవి తీరుస్తుందనేది బహిరంగ రహస్యం.

కానీ ఆమె ఒప్పకోదు.

ఒక సారి విజయం మరిగాక అంత తొందరగా వదిలి పెట్టాలనిపించదు.

ఆ రెండు ఆర్డర్లు వున్నా, యింకా మిషన్‌ కెపాసిటీ వుంది. అందుకని యింకా ఆర్డర్లు సంపాదించే బిజీలో వున్నాడు.
కీర్తనకి యింకా ఎనిమిది నెలల్లో జరిగే నేషనల్‌ గేమ్స్‌ మీదా, అంత కన్నా ముందు జరిగే స్టేట్‌ గేమ్స్‌. నేషనల్‌ సెక్షన్స్‌.... వీటి మీదే దృష్టి వుంది.

యిద్దరూ ఎవరి బిజీలో వాళ్ళున్నారు. తండ్రి విషయంలో మాత్రం చాలా కేర్‌ పుల్‌ గా వుంటారు. అందు కోసం తమ కెరీర్‌లో కొన్ని ఎడ్జట్ మెంట్స్ చేసుకోవాల్సి వచ్చినా ఏ మాత్రం బాధ పడరు.

అశోక్‌ కీర్తనని కాలేజి దగ్గర దింపేసి, తను కంపెనీకి వెళ్ళాడు.

హైద్రాబాద్‌ లాంటి హైటెక్‌ సిటీలో క్రీడలకి ప్రత్యేక సదుపాయాు కల్పించడం యిప్పుడు తప్పని సరి అయింది. ఏ ఆట కోసం దానికి స్టేడియాల నిర్మాణం శర వేగంగా జరిగి పోయింది.

అందులో భాగంగా వాలీ బాల్‌ కోసం ప్రత్యేకంగా ఓ స్టేడియం నిర్మించ బడింది.

అందులో ఆరు కోర్టులుంటాయి. అయిదు వేల మంది కూర్చుని తిలకించ గల వసతి వుంది.

నిరంతరం అందులో ఎన్నో టీములు ప్రాక్టీస్‌ చేస్తూనే వుంటాయి.

ఆ స్టేడియంని అప్పుడప్పుడూ ప్రైవేట్‌ ఫంక్షన్స్‌కి కూడా అద్దెకిస్తూంటారు. అదీ క్రీడాకారులకి అడ్డు రాని రాత్రి సమయాలలో మాత్రమే.
ఆ రోజు సాయంత్రం అయిదు గంటలు.

స్టేడియంలో అమ్మాయిలు ఇరవై మంది వరకూ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అబ్బాయిలు కూడా వున్నారు. కానీ ఎక్కడా క్రమ శిక్షణ తప్పిన దాఖలాలు వుండవు.

ఎందు కంటే అమ్మాయిులు స్టేడియంకి కోచ్‌లతో మాత్రమే వస్తూ వుంటారు.

ఎవరి ప్రాక్టీస్‌ లో వాళ్ళు మునిగి వుండగా స్టేడియం ముందు నాలుగైదు కార్లు ఆగాయి.

అందులో నుండి పది పదిహేను మంది బిజినెస్‌ పీపుల్‌ దిగారు. బహుశా ఏదో ఫంక్షన్‌ ఎరేంజ్‌ మెంట్‌ కోసం అయి వుంటుంది. అందరూ ఓసారి తలలు తిప్పి చూసి మళ్ళీ ఆటలో పడి పోయారు.

అయితే అమ్మాయిలు కాస్తంత డిస్టర్బ్‌ అయ్యారు. ఆ బిజినెస్‌ పీపుల్‌ మధ్య చుక్కల్లో చంద్రుడిలా వెలిగి పోతున్న ఓ యువకుడు వారిని యిబ్బంది పెడుతున్నాడు.

తన ప్రవర్తనతో కాదు. తన అందంతో, రాజసంతో, దర్జాతో. నేవీ బ్లూకర్‌ ఫుల్‌ సూట్‌ లో తెల్లగా, ఎత్తుగా, ఎత్తుకి తగిన లావుతో అమ్మాయిల కళ్ళని జిగేల్‌ మనిపిస్తున్నాడు.

ఇరవై మూడూ ఇరవై నాలుగేళ్ళ వయసుంటుంది అతనికి. అమ్మాయిులు కళ్ళతో సైగలు చేసుకుంటూ ఓరగా అతని కేసి చూస్తున్నారు.
తన టీమ్‌ మేట్స్‌ ఎందుకు డిస్టర్బ్‌ అవుతున్నారో తెలీక కోపంగా వాళ్ళని హెచ్చరిస్తోంది కీర్తన.

ఊహూ!....వాళ్ళు లొంగనిదే....

వాళ్ళెటు చూస్తున్నారో నని తనూ అటు తల తిప్పి చూసింది.

ఎవరో అబ్బాయి.

అంతే!.....

ఆ క్షణంలో ఆమె వూహ అంతే!....

కానీ అదే క్షణంలో అతను తల తిప్పి కీర్తనని చూశాడు. కళ్ళు మూతలు పడ లేదు. అడుగు ముందుకు పడ లేదు. అయస్కాంతంలా ఆకర్షించేసింది ఆ అమ్మాయి. వైట్‌ కలర్‌ కాటన్‌ ఫ్యాంట్‌, స్పోర్ట్స్‌ టీ షర్ట్‌లో అయిదడుగుల ఎనిమిదంగుళాల పొడవు, సమున్నతమైన శరీరం...ఆమె మొహం చూస్తుంటే చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది.

గుండెకి గేలం వేసే కళ్ళు.....

సవాల్‌ చేసే ముక్కు....

అందంతో పొగరెక్కి బిగుసుకున్న పెదాలు....

ఏదీ అసలు కదలనిస్తేగా....

కీర్తన ఆట ఆపేసి తన టీమ్‌ మేట్స్‌ని కసురుతూ.. ‘‘అబ్బాయిల వంక చూడటం ఆపేసి ఆట మీద దృష్టి పెడతారా’’ గట్టిగా అంది.
అప్పటికే గడుగ్గాయిలయిన వాళ్ళు అతను ఎవరి వంక చూస్తున్నాడో గమనించి...‘‘మేం ఎప్పుడో చూడటం ఆపేశాం. కానీ అతనే చూస్తున్నాడు’’ కొంటెగా నవ్వుతూ అన్నారు.

‘‘ఎవరినీ?’’ తల తిప్పి చూస్తూ అంది కీర్తన.

వాళ్ళు సమాధానం చెప్ప లేదు కానీ అతని చూపు సమాధానం చెప్పాయి. ‘‘ఏంటది చిరాగ్గా!’’ అసహనంగా అనుకుంది. దూరంగా టీ తాగుతున్న  కోచ్‌ వీళ్ళ వంక చూసి ‘ఆడండి’ సైగ చేశాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam