Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pata alochanala kotta manishi

ఈ సంచికలో >> కథలు >> క్రైం నెవర్ పేస్

crime never pace

డిటెక్టివ్ అసిస్టెంట్ అవినాష్ వెర్నా కారును ఆపుతుండగానే హడావిడిగా డోర్ తెరుకొని దిగి పోయాడు డిటెక్టివ్ బాలి.
కారులోంచి దిగిన ఆరడుగుల అందమైన ఆ పర్సనాలిటీని “వెర్నా విండ్ షీల్డు” మీదున్న” తర్డ్ ఐ డిటెక్టివ్ ఏజన్సీ “ అక్షరాలను చూస్తూనే అలర్టయి పోయారు పోలీస్ స్టేషన్ ముందు డ్యూటీలో వున్న సెక్యూరిటీ గార్డ్స్.

కడక్ సెల్యూట్ చేసి..

“మీ కోసం ఏసిపీ సార్ వెయిటింగ్ సర్.” ఉత్సాహంగా చెప్పాడొక గార్డ్.   వెర్నా  దిగుతూనే ..చుట్టూ పరిశీలించి చూశాడు..డిటెక్టివ్ బాలి.
అప్పటికే ప్రెస్..మీడియా జనాలతో స్టేషన్ కిటకిటలాడి పోతోంది.

కార్ పార్క్ చేసి వచ్చిన అవినాష్ దారి తీస్తుంటే..

“అవినాష్ బీ అలర్ట్!  మనం పోలీస్ రిపోర్టు మీద డిపెండైతే కేసు క్రాషై పోతుంది. మైన్యూట్ ఎవిడెన్స్ కూడా మిస్సవ కూడదు.. ఎవ్విరి కాయిన్..హేజ్ టూ సైడ్స్ ..మనకు ఎవిడెన్స్ దొరికేది  కానిస్టేబుల్ అండ్ రైటర్ ల వంటి లో కేడర్ దగ్గరే. ఇది డిపార్ట్ మెంట్ కేసు. ఎవిడెన్స్.. దొరకదు.దొరకనివ్వరు. బీ కూల్ అండ్ కాషియస్. స్టెల్లాను  కాంటాక్ట్ చేసి టీవీ  లో ఈ కేస్ టెలీకాస్ట్  అయితే క్లిప్పింగ్స్ రికార్డ్ చేయమని చెప్పు.”

“ ఐయాం రెడీ విత్ ఎవ్విరి తింగ్ బాస్! ఆల్ర్రెడీ  స్టెల్లా ఆ ప్రయత్నాల్లోనే వుంది.”

సమాధానం చెపుతూనే తన స్పై కెమారా యాక్టవేట్ చేసి ఎదురుగా వస్తున్న ఏసీపీ శాండిల్యను చూస్తూనే..నవ్వుతూ విష్ చేస్తూ సైడై పోయాడు అవినాష్  .

ఎన్నో కేసుల్లో కలిసి పని చేశాడు బాలి శాండిల్యతో.

“మిస్టర్ బాలీ!ఇన్సిడెంట్ జరిగిన ప్లేసు ను క్లోజ్ చేసి పెట్టాం.పోలీస్ స్టేషన్ లో జరిగిన ఇన్సిడెంటిది. మేం ఏంచేప్పినా ప్రెస్ గానీ మీడియా కానీ నమ్మదు. అందుకే కేసు నీకు హేండోవర్ చేయాలని నేనే స్వయంగా డీల్ చేస్తున్నాను.”

ఇన్సిడెంట్ జరిగిన ఇంటరాగేషన్ రూం కు దారి తీస్తూ  బ్రీఫ్ చేశాడు..ఏసీపీ శాండిల్య.

ఏసీపీ ఆర్డరు తీసుకొని రూం ఓపెన్ చేశాడు ఓ కానిస్టేబుల్. తోసుకొస్తున్న ప్రెస్ మీడియా జనాల్నిఎస్సై అదుపు చేస్తుంటే మౌనంగా లోపలికి ఎంటరయ్యాడు బాలి. రూం మధ్యలో పడి వుందో యువకుడి బాడీ. ఎడమ చేతి మీద కోసుకున్న గుర్తు..కారిన రక్తంతో తడిసిన షర్ట్..తప్ప గమనించే క్లూస్ ఏమీ కనిపించలేదు బాలి కళ్లకి. యువకుడి వయసు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల వరకు వుండొచ్చనే నిర్ణయాని కొచ్చాడు బాలి. మౌనంగా బయటికొచ్చి ఎసీపీ ఎదురుగా సెటిలై పోయాడు. 

“మిష్టర్ బాలీ! ఆ యువకుడి పేరు..కిషన్ మల్హోత్రా..బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్. ర్యాగింగ్ కేసుక్రింద బుక్ చేసి నిన్న సాయంత్రం స్టేషన్ కు తీసుకొచ్చారు. రాత్రి ట్వెల్వో క్లాక్  వరకు ఎస్సై..ఇంటరాగేట్ చేశాడట. తను ర్యాగింగ్ చేయలేదని..తన ఫ్రండ్స్ చేశారనీ..రేపు కాలేజీ కొచ్చి ఎంక్వైరీ చేస్తే నిజం తెలుస్తుందని ఇంటరాగేషన్ లో చెప్పాడనీ..రేపు కిషన్ తో కాలేజీకెళ్లి మరో సారి ఎంక్వైరీ చేస్తానని రాత్రి రిపోర్టుచేశాడు ఎస్సై.కానీ మార్నింగే ఈ షాక్.   ఈ సంగతి తెలిస్తే స్టూడెంట్స్ స్ట్రైకులు చేసి స్టేషన్ కొచ్చి ధర్నాలు చేస్తే నానా రప్చరై పోతుంది.అందుకే నీకు ఫోన్ చేసి..కేసు నేను టేకప్ చేశాను.ట్రైటు సాల్విట్ యాజెర్లీ యాజ్ పాజిబుల్”.

ఏసీపీ శాండిల్య రిక్వెస్ట్ వింటూనే చిన్నగా నవ్వి

“మా రిపోర్టెందుకు.? ఆత్మహత్యనే కలరింగిచ్చి కేసు క్లోజ్ చేయొచ్చుగా?ఇది మీరు ఆనవాయితీగా అవలంభిస్తున్న ఈజీ మెథడేగా?”
బాలి సెటైర్ అర్దమైనా బ్లాంక్ పేసుతో చూశాడు శాండిల్య.

సిఐ వచ్చి కాన్ ఫరెన్స్ హాల్లో ప్రెస్ మీడియా సమావేశముందని చెప్పడంతో..

“కమ్ బాలీ ..డిపార్ట్ మెంటులో వున్నందుకు మాకు ఈ యుధ్దాలు తప్పవు.” హడావిడి నటించి..బయలుదేరి పోయాడు.

*****

కాన్పరెన్స్ హాల్ .. ప్రెస్ మీడియా జనాలతో నిండి పోయింది. ఛానెళ్ల కెమారాలన్నీ డయాస్ మీదున్న ఏసీపీ..సిఐ..ఎస్సై..బాలీల ముఖాలమీద జూమై పోయాయి.

సోది ఛానెల్ న్యూస్ రిపోర్టర్ యాదక్క లేచింది.

“ఏసీపీ సర్ !నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటన గురించి మీ  అభిప్రాయం ఏమిటి ? ఇంతకు ముందు జరిగిన సంఘటనలకు లాకప్ డెత్ లని పేరు పెట్టి చేతులు దులిపేసు కున్నారు.ఆ రేండు కేసుల్లో వున్న ముద్దాయిలు రౌడీ షీటర్సు రేపిస్టులు కాబట్టి మీడియా కూడా పట్టించుకో లేదు. కిషన్ ఒక రెప్యూటెడ్ ఇంజినీరింగ్ కాలేజీ స్టూడెంటు పైగా మన కాలేజీలను నమ్మి నార్తిండియా నుంచి వచ్చాడు. మేం ఈ సారి చాలా సీరియస్ గా తీసుకుంటాం.మీరేమంటారు.?

నస చానెల్ నారాయణమ్మ గొంతెత్తింది.                                                                                                             “చట్టం

తన పని తాను చేసుకు పోతుంది..చట్టం ఎవరికీ చుట్టం కాదు.. నేరస్తులు దొరికితే వారెంతటి వారైన శిక్షిస్తాం..లాంటి స్టాకు డైలాగులు అప్ప చెపుతారా.?

స్కాముల ఛానెల్ స్వామి తనమాటలు గన్ లోంచి రాలే  బుల్లెట్లని మురిసి పోతూ..నోరిప్పాడు.

“సర్! ఆ ఇంజినీరింగ్ కాలేజీ ర్యాగింగ్ ఫ్రీ కాలేజని మొన్నీమద్యే ఆ కాలేజీ డే లో తమరే..దండలేయించుకుని మరీ కెమారాలకి ఫోజిస్తూ హీరో లెవెల్లో..చె ప్పారు..యిప్పుడు ప్లేటు మారుస్తున్నారు..ఎవరిని రక్షించాలని..?

అయోమయంగా చూస్తున్నట్లు కెమారాలకు పోజిస్తూ..లేచి నిల బడ్డాడు ఏసీపీ.

“జరిగిన సంఘటనకు మేం చాలా చింతిస్తున్నాం.మీరు డిపార్టుమెంటును నమ్మరనే ఈ కేసు “తర్డ్ ఐ డిటెక్టివ్ ఏజన్సీకి” అప్పగిస్తున్నాం. మిస్టర్ బాలి గురించి మీ మీడియాకు బాగా తెలుసు.రిపోర్టు రాగానే యాక్షన్ తీసుకుంటాం.”

అకస్మాత్తుగా న్యూస్ తప్పించి సినిమా చెత్త, బూతుల కామెడీ ప్రసారం చేసే ..ఛీ ఛానెల్ రిపోర్టర్  పూతరేకుల పుణ్యవతి అడిగింది.

“సర్ ! మాకు” తర్డ్ ఐ ఏజన్సీ” మీద పూర్తి నమ్మకముంది. అప్పుడు స్టేట్ విభజన టైంలో శ్రీకృష్ణ కమిటీ వేసి వన్నియర్ లాగించి..చెత్త బుట్టలో పారేశారు..తర్డ్  ఐ రిపోర్టుకు కూడా అదే గతి పట్టదని నమ్మమంటారు. మా చెవుల్లో మీకేమైనా కాలీ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా?.
ఏసీపీ కి దిగి రాక తప్పలేదు.

“బాలి గారి అనుమతి తో టైం సెట్ చేసుకుందాం.వారిచ్చే రిపోర్టు మీ అందరి ముందే రివీల్ చేస్తాం.”

పాత్రికేయులంతా “నో “అంటూ తమ అసమ్మతి తెలిపారు.

“మీ డిపార్ట్ మెంటు జిమ్మిక్స్ మాకు తెలుసు. తర్డ్ ఐ రిపోర్టు కాదు రివీల్ చేసేది. మీ డిపార్ట్ మెంటు దొంగ రిపోర్టుల సంగతి దునియ మొత్తం ఎరికే.

శాండిల్య రిక్వెస్ట్ మీద బాలి నోరిప్పాడు.

“డియర్ ఫ్రెండ్స్ ! మా డిటెక్టివ్ ఏజన్సీ రెప్యుటేషన్ మీకు తెలుసు. మల్లీ ఇదే ప్లేసులో  వితన్ ఏ వీక్ డేస్ లో మా రిపోర్ట్ మీ ముందే నేనే రివీల్ చేస్తాను. “

*****

“తర్డ్ ఐ ఆఫీస్ “ బాలి తన ఎగ్జిక్యూటివ్ టేబుల్ ముందు రిలాక్స్ డ్ గా కూర్చొని “మైకేల్ క్రిస్టన్ డిస్ క్లోజర్ “  చదువుతున్నాడు.గుడ్ మార్నింగ్ చెపుతూ వచ్చిన అవినాష్..ఔట్ సోర్సింగ్ డిటెక్టివ్ అసిస్టెంట్..జాకీ..సెక్రెటరీ స్టెల్లాతో బాటు రిసెప్షనిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్ శిరీష కూడా వచ్చి బాలి ఎదురుగా కూర్చుండి పోయారు.

బాలి కనుసైగతో అవినాష్ తన ఇన్వెస్టిగేషన్ రిపోర్టు వివరణ యిస్తుంటే శిరీష తన నోట్ బుక్ లో నోట్ చేయడం మొదలు పెట్టింది.

“బాస్ !  మొన్నటి మీటింగ్ విడియోని “మన ఫేస్ స్కానింగ్ అండ్ బాడీ లేంగ్వేజ్ ఎక్స్ పర్ట్” డేనియల్ తో టెస్ట్ చేయించాను. యువర్ గెస్ ఈజ్ సెంట్ పర్సెంట్ కరెక్ట్. పోస్ట్ మార్టమ్ రిపోర్టు ప్రకారం ఆరాత్రి “ట్వల్వ్ టూ టూ మధ్య మర్డర్ జరిగింది. కిషన్ మరణానికి కారణం చేతి మీదున్న కత్తి గాటు కాదు.ఊపిరాడకుండా చేసి చంపేసి ఆత్మహత్యగా  చిత్రించడం కోసం కత్తితో గాటు క్రియేట్ చేశారు.అతని చేతినుండి కారిన బ్లడ్ వెరీ లిటిల్.దాని మూలంగా వయసులో వున్న వ్యక్తి చనిపోయే అవకాశం లేదని రిపోర్ట్ నివేదిక. మన జాకీ రిపోర్టు ప్రకారం ఆల్రెడీ  ఆ  స్టేషన్ పోలీసులు కిషన్ తో బాటు కాలేజీ ప్రిన్సిపల్ క్కూడా మూడు సార్లు వార్నింగ్స్ యిచ్చారని స్టూడెంట్స్ చెప్పారట.అమ్మాయిని ట్రేసవుట్ చేస్తే కిషన్ తో లవ్ లో వున్న ద్దరమ్మాయిల పేర్లు తెలిశాయి. యిద్దరి  పేర్లూ  లాలసే. ఫ్యాషన్ టెక్నాలజీ ఫైనలియర్ స్టూడెంట్స్ .కిషన్ కాలేజీలో లాలసలు ఫ్యాషన్ వీక్ కండక్ట్ చేసినప్పటి పరిచయం ప్రేమగా మారిందట. తన కూతురు ఓ అనామకుడిని ప్రేమించిందన్న కోపం ..హత్యకు కారణమని భావించొచ్చు. ఆ రోజు సీఐ హెడ్ కానిస్టేబుల్ తో ఔటాఫ్ స్టేషన్.ఆ రాత్రి స్టేషన్ లో వున్నది ఒక స్టేషన్ ఆఫీసర్ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్. ఏసీపీ కి రిపోర్టు చేసి ఎస్సై ట్వెల్లో క్లాక్కే..వెల్లి పోయాడనేది నిజమని తేలింది. ఎంత ట్రై చేసినా ఎవరూ నోరిప్పడం లేదు.”

అవినాష్ ! గుడ్ అండ్ యూజుఫుల్ రిపోర్ట్. ఇది పోలీస్ కేసు. సాక్ష్యాలు ఇంపాజిబుల్ . నీ రిపోర్టు మూలంగా నేనో అండర్ స్టాండింగ్ కొచ్చాను. గిల్టీ ఆర్ ఎఫ్రైడ్ అనే  సైకలాజికల్..బలహీనత ఇన్వెస్టిగేషన్ కు చాలా హెల్పవుతుందనేది నాకు అనుభవంనేర్పిన పాఠం.  నౌ టార్గెట్ ఈజ్ క్లియర్.  బట్ టార్గెట్ ఈజ్ ఇన్ ద డార్క్..బాణం వేద్దాం..హిట్టవుతుంది..అదర్ వైజాల్సో ఐ హేవ్ అనదర్ ప్లాన్ . 

“శిరీషా  ! నీ నోట్ పేడ్ నా టేబుల్ మీదుంచి స్టెల్లాతో..ఓసారి నిఫ్ట్ కెళ్లి లాలసలను టేకిల్ చేసి రండి.

*******

క్రైం బ్రాంచ్ ఆఫీస్.  సౌండ్ ప్రూఫ్ రూం.ఏసీపీ శాండిల్యతో 

బాలి అవినాష్ జాకీలతో బాటు స్టెల్లా శిరీషలు సమావేశ మయ్యారు. డిటెక్టివ్ బాలి మాటలు విన్న ఏసీపీ  బ్లాంక్ ఫేసు పెట్టేశాడు.
మిస్టర్ బాలీ !ఆర్ యూ ష్యూర్ ? ఐ కాంట్ బిలీవిట్.

చిరునవ్వుతో చెప్పాడు బాలి

“ డియర్ సర్  ! అవర్సీజే  రెప్యూటెడ్ డిటెక్టివ్ ఏజన్సీ. వితౌట్ ప్రోపర్ ఎవిడెన్స్..వియ్  విల్ నాట్ ప్రెజెంట్ ద కేస్. దట్స్ వై వియార్ ఇన్యువర్ ప్రజెన్స్. దిసీజె సైకలాజికల్ ట్రీట్మెంటు.   వియ్ హేవ్ టూ టార్గెట్స్..వి విల్ స్టార్ట్ విత్ సీఐ .   మీరే హ్యాండిల్ చేయండి.ఇటీజ్ ట్రూ అని కన్పం చేసుకున్నాకే యాక్షన్ తీసుకోండి. “

కాన్ఫిడెంటుగా బాలి చెప్పిన మాటలు వింటూనే కన్విన్స్ అయ్యాడు..శాండిల్య .

ఇంటర్ కాంలో ..క్రైంబ్రాంచ్ డియస్పి కి ఏం చేయాలో వివరించాడు. యుకెన్ ప్రొసీడ్ అన్నట్లు..బాలికి సిగ్నల్ యిచ్చాడు.బాలి సిగ్నల్ అందుకుంటూనే  “శిరీష “ తన బేగ్ లోంచి సెల్ తీసి ఓ నెంబర్ డైల్ చేసింది.సెల్ రింగవుతున్న శబ్దం స్పీకర్ లోంచి స్షష్టంగా వినిపిస్తుంటే అఁదరూ హార్ట్ బీట్ ను మర్చి పోయినట్లు ఊపిరి బిగపట్టారు.

“యస్ దిసీజ్ సిఐ బాలా గౌడ్ .. హు హీజ్ ఆన్ దలైన్ “ ?

“సర్ ! నాపేరు అనిత..గాంధీ హాస్పిటల్ స్టాఫ్ మెంబర్ని.మీ స్టేషన్ నుంచి మొన్న కిషన్ మల్హోత్రా అనే స్టూడెంట్  డెడ్ బాడీని  పోస్టుమార్టం చేసాం..ఆ స్టూడెంటు షర్ట్ బటన్ లో ఓ  మీనియేచర్ బగ్..కన్పించింది.దాన్ని మా  డాక్టర్ గారు ఎనాలసిస్ చేయించారు .
మాటలు ఆపేసింది

“సో వాట్?”

“ అందులో మీరూ మరో పోలీస్ కలిసి ఆ స్టూడెంట్ ని మర్డర్ చేస్తున్నట్లు..రికార్డయ్యింది సర్.

భయంకరమైన నిశ్శబ్దం..అటు ఫోను ఇటు రూంలో. యస్ ఫిష్ ఇన్ ద నెట్ ..అన్నట్లు బాలి శిరీషకు సిగ్నల్ పాస్ చేశాడు.
“ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నావ్..నీతో యింకెవరున్నారు ?

సీఐ కంఠంలో వైబ్రేషన్స్..స్పష్టం గా విని పిస్తుంటే అయోమయంగా చూశాడు..ఏసీపీ.

“నాతోబాటు మా డాక్టర్ సర్ వున్నారు.మీతో మాట్లాడతారట లైన్లో వుండండి “

అవినాష్ ఫోను తీసుకున్నాడు.

“గుడీవినింగ్ సీఐ సార్. మరీ పోలీసులే హంతకులైతే ..ప్రజల్ని ...

“సోదాపి ఎక్కడున్నావో చెప్పు ..నేను వచ్చి మాట్లాడుతా.”

“చెప్తాను సార్..దానికంటే ముందు మనం బేరం మాట్లాడుకుందాం..”

“నువ్వు చెప్పేది నిజమని  చూసేదాకా నమ్మను”

“అయితే చూసిన తర్వాతే ..కానీ ..మా మినిమం కోట్ టెన్ సి ఆర్..ఓకే అంటేనే అడ్రస్. లేదంటే బొచ్చెడు చానల్స్“ 

“ఓకే కానీ అంత ఎమౌంట్ ఒక్కసారిగా..”

కాన్వర్ సేషన్ వింటూనే..క్రైంబ్రాంచ్ డియస్పీకి ఆర్డర్స్ పాస్ చేశాడు..ఏసీపీ.

“అర గంటలో వస్తే క్లిప్పింగ్సు చూపిస్తాం..చూశాక రేటు మాట్లాడుకుందాం..లేదంటే..’

“డా క్టర్ !తొందర పడొద్దు..ఐ విల్ బి దేర్ వితిన్నేహాఫేనవర్..టెల్ ద అడ్రస్..”

*****

క్రైం బ్రాంచ్ లో జరిగిన సమావేశానికి..అన్నిచానెల్స్ తో బాటు..కమీషనర్ స్ధాయి అధికారులు కూడా హాజరయ్యారు.
ఏసీపీ శాండిల్య  కేసుకు సంబంధించిన వివరాలు  బ్రీఫ్ చేశారు.

డిటెక్టివ్ బాలి లేచాడు.

“ ఖాకీలకు బ్రెయిన్ వున్నా అధికారాన్నే..ఎక్కువ యూజ్ చేస్తారనే నానుడి నిజమయ్యింది ఈ కేసుకు క్లూ అయ్యింది. ఎవిడెన్స్ లేకుండా మర్డర్ చేయాలని ఆన్ డ్యూటీ నాటకమాడిన హంతకుడు..తన స్టేషన్ ఎదురుగా వున్న అపార్ట్ మెంటు సీసీ కెమారాని విస్మరించాడు. ఆ రాత్రి హంతకులిద్దరూ ఔటాఫ్ స్టేషన్ అన్న రిపోర్టు రాగానే నేను ఆసీసీ కెమారా క్లిప్పింగ్స్ చూశాను .రాత్రి ట్వెల్ల్వోక్లాక్ ఎస్సై డిపార్చర్ ట్వెల్వ్ ఫిప్టీన్ కు హంతకుల ఎంట్రీ రికార్డయ్యాయి. యూ పీపుల్ కెన్ హేవ్ ద క్లిప్పింగ్స్..ఫ్రం ద డిపార్ట్ మెంట్.ఎంతటి నేరస్తుడైనా తప్పు తప్పక చేస్తాడనేది..మరోసారి ప్రూవయ్యింది. నిజాయితీ పరుడైన మిస్టర్ శాండిల్య సహకారం అమేజింగ్.”   

ప్రెస్ తో బాటు అన్ని ఛానల్స్  తర్డ్ ఐ డిటెక్టివ్ ఏజన్సీని ఆకాశానికెత్తేశాయి. కమీషనర్ లేచి     
“కులమతాలేకాదు రాష్ట్రాలకూ దేశాలకూ మధ్య హద్దులు చెరిగి పోయాయి.నార్తిండియన్ తన కులం కాదన్న చిన్న కారణంతో మా డిపార్ట్ మెంటు వ్యక్తి అందులోనూ హైకేడర్ వ్యక్తి యింత దారుణానికి తెగించాడంటే వెరీ పిటీ.ఈ కేసును ఐదు రోజుల్లోనే ఛేదించిన తర్డ్ ఐ డిటెక్టివ్ ఏజన్సీ బాలి గారికీ అతని ఎంటైర్ టీం మెంబర్స్ కు మా డిపార్ట్ మెంటు తరఫున ధన్యవాదములు తెలియచేస్తున్నాను. 

“సర్ ! ఇంతవరకూ హంతకుడిని చూపించలేదు..    మరో డిపార్టుమెంటు వ్యక్తి సాయంతో అన్నారు.క్లారిటీ యివ్వలేదు.”  ఈ మధ్య యాంకరవ్వాలనే తపనతో తపించి పోతున్న ఓ క్రైం ఛానల్ రిపోర్టర్ నత్తికొండ నాంచారు సెల్పీపోజులో అడిగింది “ఐ విల్ టెల్.”
ఏసీపీ లేచారు.

“క్రైంజరిగిన రాత్రి ట్వెల్వో క్లాక్కిఎస్సై రిపోర్టు చేసి వెళ్లి పోగానే డ్యూటీ లో వున్న హెడ్ సాయంతో  సీ ఐ మర్డర్ చేశాడు. ఎలిబీ కోసం ఇద్దరూ ఔటాఫ్ స్టేషన్ నాటకమాడారు.ఆ నాటకమే తన పాలిటి శాపమవుతుందని..అదే ఈ కేసులో విట్నెస్ అవుతుందని  ఆ క్రిమినల్ బ్రెయిన్ ఊహించలేక పోయింది .  హెడ్ కానిస్టేబుల్ ఈ కేసును  తర్డ్ ఐ కి అప్ప చెప్పగానే అండర్ గ్రౌండ్ కెళ్లి పోయాడు. ఆల్రెడీ స్పెషల్ టీమ్స్ఆర్ ఆఫ్టర్ హిమ్. స్టిప్యులేటెడ్ టైంలో కేసు సాల్వ్ చేసిన బాలి బృందానికి కృతజ్ఞతలు.కమీషనర్ ఆర్డర్ తో చేతికి బేడీలతో తలవంచుకున్న బాలాగౌడుని..మీడియా ముందు ప్రవేశ పెట్టారు. 

**** 

అందరికీ వీడ్కోలు చెప్పివెర్నా దగ్గరకొస్తున్న అవినాష్ స్టెల్లా కాల్ కు ఆన్సర్ చేసి..బాలితో

బాస్ ! ఎవరో మీ అభిమానట .ఏజ్ దాదపు సెవెంటీ..బట్ వెరీఎనర్జిటిక్ అట.. ఏదో కేసంటూ గంటనుంచి వెయిటింగంట...  

మరిన్ని కథలు