Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

19-05-2017 నుండి 25-05-2017 వరకు వారఫలాలు - - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద నూతన ఆలోచనలు కలిగిఉంటారు. ఉద్యోగంలో మంచి గుర్తింపును పొందుతారు అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. సొంతఇంటి కోసం చేయు ప్రయత్నాలు ముందుకువెళ్ళుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది స్త్రీ / పురుష సంభందమైన విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు పాటించక పోతే స్వల్ప సమస్యలు పొందుతారు. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి సర్దుబాటు విధానం అవసరం. తల్లితరుపు బంధువుల నుండి సమయానికి సహకారం అందుట ఊరట. రాజకీయపరమైన విషయాల్లో మీ శ్రేయోభిలాషుల నుండి సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలుచేసే అవకాశం కలదు. 

 

 

 వృషభ రాశి :  ఈవారం మొత్తంమీద వినోదాలు,విందులపట్ల మక్కువను చూపిస్తారు. కుటుంబసభ్యులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మిత్రులతో చర్చలకు వచ్చే విషయాల్లో మీ భవాలను తెలియజేయడం అలాగే వారి ఆలోచనలను గౌరవించుట వలన మేలుజరుగుతుంది. కుటుంబసభ్యుల నుండి వచ్చు సూచనల విషయంలో బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం మూలాన నూతన అవకశాలు లభిస్తాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించకపొతే అనారోగ్యసమస్యలు పొందుతారు. దూరప్రదేశం నుండి నూతన విషయలను తెలుసుకొనే అవకాశం ఉంది. వాహనముల విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన. అగ్నిసంభందవస్తువులతో పనిచేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం వీలయితే వాటికీ దూరంగా ఉండుట మంచిది.   

 

.
మిథున రాశి : ఈవారం మొత్తంమీద ఇష్టమైన పనులకు సమయం ఇవ్వడం జరుగుతుంది. నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. దూరప్రదేశప్రయాణాలు కలిసి వస్తాయి కాకపోతే అధికంగా కష్టపడవలసి వస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది కావున వాటికి అవకాశం ఇవ్వకండి. తలపెట్టిన పనులపైన ప్రత్యేకమైన శ్రద్ధను చూపుట వలన నెరవేరుతాయి. ప్రయాణాలు చేయకపోవడం మేలు వాటిమూలన సమయం వృధాఅవుతుంది. సంతానపరమైన విషయాల మూలాన కొంత ఆందోళన తప్పక పోవచ్చును. ఉద్యోగంలో లేదా పనిలో భాద్యతలు పెంచుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. మొండినిర్ణయాలు తీసుకోవడం వలన కావు అనుకున్న పనులు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట అనేది సూచన.    

 


కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో బాగుంటుంది అధికరౌఅల్తొ మీకున్న సంభందాలు మెరుగుపడుతాయి. నలుగురికి మీయొక్క ఆలోచనలు నచ్చుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. అనుకోని ఖర్చులను పొందుతారు మీరు అనుకున్న విషయలకు ఖర్చుకు వెనకఆడకపోవచ్చును. కుటుంబంలో చర్చావిషయాలకు సమయం ఇవ్వకపోవడం సమస్యలు తగ్గించే ప్రయత్నం చేయుట అనేది మంచి మార్పు. వ్యాపారసంభందమైన విషయాలలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది లేక అక్కడి నుండి విలువైన సమాచరం అందుతుంది. మిత్రులతో చేయుచర్చలు వివాదాలకు దారితీసే అవకాశం ఉంది కావున ఈ విషయంలో నిదానంగా వ్యవహరించుట సూచన. వాహనముల విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన.               



 సింహ రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో నలుగురిలో గుర్తింపు పొందు పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. సామాజికకార్యక్రమాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. ఉయ్దోగంలో బాగానే ఉంటుంది అధికారులతో చక్కటి అనుభందాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది వారికి అనుగుణంగా నడుచుకుంటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద చేయకండి తగిన జాగ్రతలు తీసుకోవడం మంచిది సూచన. చర్చాసంభందమైన విషయాలకు దూరంగా ఉండుట మంచిది నలుగురిని కలుపుకొని వెళ్ళుట చేత మేలుజరుగుతుంది. విలువైనవస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన లేదా కొనుగోలుచేసే విషయంలో జాగ్రత్తగా ఉండుట మంచిది. దైవసంభందపనులకు సమయం ఇస్తారు తీర్థయాత్రలకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మిత్రుల నుండి నూతన విషయాలను సేకరించే అవకాశం ఉంది.   

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద బాగుంటుంది మీ ఆలోచనలకు అనుగుణమైన ఫలితాలు పొందుతారు. నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో బాగుంటుంది కాకపోతే శ్రమకు మించిన పనులను ఆరంభించుట చేత ఇబ్బందులను పొందుతారు. ప్రయాణాలకు సమయం ఇస్తారు చిననాటి మిత్రులను కలుస్తారు వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దల నుండి సహకారం లభిస్తుంది నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యులకు మీ ఆలోచనలు తెలుపుట ఉత్తమం. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు కలుగుతాయి,సమయపాలన పాటించుట మంచిది నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మరింత సంతోషకరమైన వార్తలను వినే అవకాశం కలదు.     

 


తులా రాశి :ఈవారం మొత్తంమీద కొత్త కొత్త పనులను చేపట్టుటకు ఆసక్తిని చూపిస్తారు ఉత్సాహంను కలిగి ఉంటారు. నలుగురిలో మంచి పేరు కోసం చేయు ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యుల సహకారం వలన పనులను కాస్త ఆలస్యం అయినను విజయవంతంగా పూర్తిచేస్తారు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడిపే అవకాశం కలదు. మీయొక్క ఆలోచనలు తగించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. తలపెట్టిన పనుల విషయంలో సరైన అవగాహన కనుక లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును కనుక సమయం ఇవ్వడం ఉత్తమం. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటిమూలన నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాలలో నూతన పెట్టబడులు పెట్టకండి జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది.
   

 


వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద చేసే ప్రథిఆలొచన స్పష్టంగా ఉండేలా చుసుకోండి. తలపెట్టిన పనులను కాస్త నిదానంగా పూర్తిచేస్తారు కాస్త అధిఅకమ్గ శ్రమను పొందుతారు. కుటుంబసభ్యులతో చేసే చర్చలలో మీయొక్క ఆలోచనలను తెలియజేస్తారు. బంధువులతో సమయాన్ని గడిపే అవకాశం ఉంది వారితో కలిసి చర్చాసంభందమైన విషయలకు సమయం ఇస్తారు. ధనమునకు చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇచ్చే అవకాశం కలదు. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది కాస్త ప్రయత్నం చేయుట వలన మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగంలో అధికారులతో చేయుచర్చలు మాత్రం పూర్తిస్తాయి ఫలితాలను ఇవ్వకపోవచ్చును సర్దుబాటు విధానం మేలుచేస్తుంది. మీయొక్క మాటతీరును మార్చుకోకపోతే నూతన సమస్యలు పొందుతారు. స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త.  


ధనస్సు రాశి ఈ వారం మొత్తంమీద ఉద్యోగంలో చేసేఆలోచనల విషయంలో మిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారులతో కలిసి తీసుకొనే నిర్ణయాలు కీలకమైనవిగా ఉండే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన విషయాలలో మే ఆలోచనలను అమలుచేసే అవకాశం ఉంది. సోదరసంభందమైన విషయాలలో మీయొక్క ప్రమేయం ఉండే అవాకాశం కలదు. జీవితభాగస్వామితో కలిసి నూతన నిర్ణయాలను తీసుకుంటారు. సంతానం విషయంలో కొంత ఆందోళన పొందుతారు. దైవసంభందమైన పూజలకు సమయం ఇస్తారు. విందులలో పాల్గొంటారు వాటికి సమయం ఇస్తారు. వాహనముల మూలాన ఇబ్బందులు కలుగుతాయి. స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన.              

 

 

మకర రాశి : ఈవారం మొత్తంమీద సంతానపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి పెద్దల అనుభవాలు మీకు ఉపయోగపడుతాయి. అధికారుల నుండి పనిఒత్తిడి ఉంటుంది ప్రణాలిక లేకపోతె ఉద్యోగంలో నూతన సమస్యలు పొందుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయునపుడు ముందుచూపు అవసరం లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి. క్రీడాకారులకు నూతన అవకశాలు లభించే అవకాశం ఉంది కావున మీయొక్క ప్రయత్నం అవసరం. బందువుల నుండి వచ్చిన సూచనలు మీలో కొత్త కొత్త సందేహాలను రేకెత్తించే అవకాశం ఉంది ఓపికతో వేచిచుడటం వలన మేలుజరుగుతుంది. ధనమునకు సంభందించిన విషయాలలో చివరి నిమిషంలో సర్దుబాటు అవడం అనేది ఊరట నిచ్చే విషయం. జీవితభాగస్వామితో కలిసి దైవసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు.      

   

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద గతకొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తున్న సమస్య ఒక కొలిక్కి వస్తుంది. దూరప్రదేశం నుండి ఒక సంతోషకరమైన వార్తను వింటారు. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట చేత మేలుజరుగుతుంది నిదానం అవసరం. అధికారులతో చేయుచర్చలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యక్రమాలు చేయుటకు అవకాశం ఉంది లేదా వాటి విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. మీయొక్క ఆలోచనలను చాలావరకు తోటివారు వ్యతిరేకించే అవకాశం ఉంది ఈ విషయంలో మాత్రం అసంతృప్తి ఉంటుంది. ఇష్టమైన వ్యక్తులను వారం చివరలో కలుస్తారు వారినుండి వచ్చు సమాచరం మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. మీయొక ఆప్తుల ఆరోగ్యం మిమ్మల్ని భాధకు గురిచేసే అవకాశం ఉంది మానసికంగా దృడంగా ఉండుట సూచన.       
 


మీన రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారులతో చర్చా సంభందమైన విషయాలకు సమయం ఇస్తారు, వారినుండి పనిభారం తప్పక పోవచ్చును నిదానంగా వాటిని పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. స్వల్పఅనారోగ్య సమస్యలు కలుగుతాయి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అలాగే సమయానికి భోజనం చేయుట మంచిది. బంధువర్గం నుండి వచ్చు సూచనల విషయంలో స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట మేలుచేస్తుంది. ప్రయాణాలు వాయిదావేయుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో స్పష్టమైన ఆలోచన లేకపోతే ఖర్చులను అదుపులో ఉంచుకోలేరు. పెద్దలతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది ఈ విషయంలో మిత్రుల సహకారం అందుతుంది. కుటుంబంలో చిన్న చిన్న మార్పులు కలిగే అవకాశం ఉంది వాటిని స్వాగతించుట వలన మెలుజరుగుతుంది.

మరిన్ని శీర్షికలు
sarasadarahaasam