Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
uttarakhand tourism

ఈ సంచికలో >> శీర్షికలు >>

16-06-2017 నుండి 22-06-2017 వరకు వారఫలాలు I - - శ్రీకాంత్

మేష రాశి :  ఈవారం మొత్తంమీద కొంత అనుకోని సమస్యలు పొందుటకు అవకాశం కలదు. అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోవడం అలాగే నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు బాగా ఆలోచించి ముందుకు వెళ్ళడం వలన మేలుజరుగుతుంది. స్వల్పఅనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందిపెట్టుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యుల యొక్క ఆలోచనలు మిమ్మల్ని కొంతమేర ఇరకాటంలో వేసే అవకాశం కలదు. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. దైవసంభందమైన పూజల విషయంలో అశ్రద్ధ చేయకండి కాస్త సమయం ఇవ్వడం మంచిది. పంచుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఒకింత మంచిమార్పులు రావడం అనుకూలమైన విషయం.

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు ఆస్కారం కలదు. దూరప్రదేశం నుండి విలువైన సమాచరం పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన పనులను మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. సమాజంలో మీయొక్క ఆలోచనలు నలుగురికి ఉపయోగపడేవిగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారులతో గల సంభందాలు మీకు ఉపయోగపడుతాయి. మీయొక్క మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. విదేశీప్రయత్నాలు గత కొంతకాలంగా చేస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి.
 

.
మిథున రాశి : ఈవారం మొత్తంమీద నూతన ప్రయత్నాల విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. తలపెట్టిన పనుల విషయంలో స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. ప్రయాణాల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. అధికారులతో స్వలప్ మనస్పర్థలు ఏర్పడే ఆస్కారం కలదు కావున నిదానంగా వ్యవహరించుట సూచన. స్త్రీ / పరుష సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఇతరులకు సమాధనం చెప్పవలసి రావోచ్చును. సంతానం మూలాన ఇబ్బందులు కలుగుతాయి.  

 


కర్కాటక రాశి :  ఈవారం మొత్తంమీద మాటపట్టింపులకు పోకండి. వివాదాలకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ఇష్టమైన వ్యక్తుల నుండి నూతన విషయాలు విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. నచ్చిన పనులకు సమయాన్ని ఇస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో నిదానంగా వ్యవహరించుట సూచన. ఉద్యోగంలో కష్టంమీద పనులను పూర్తిచేస్తారు. నూతన ప్రయత్నాలు మొదలుపెట్టునపుడు అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. మిత్రుల నుండి సూచనలు వస్తాయి.        

 



 సింహ రాశి :  ఈవారం మొత్తంమీద బంధువులతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వారితో కలిసి నూతన పనులను చేపడుతారు. జీవితభాగస్వామితో స్వల్ప మనస్పర్థలు కలిగే ఆస్కారం కలదు కావున వారి సూచనలు పరిగణలోకి తీసుకోండి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి స్వల్ప ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఉద్యోగంలో మొండినిర్ణయాలు తీసుకోవడం వలన మార్పులు కలిగే సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల మూలాన శ్రమకలుగుతుంది. పెద్దలతో చేపట్టిన పనులు కాస్త మిమ్మల్ని కలవరపెట్టుటకు ఆస్కారం కలదు. చిననాటి మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. వారినుండి సహకారం లభించుట కాస్త ఊరట.

 

కన్యా రాశి :  ఈవారం మొత్తంమీద పెద్దలతో కలిసి  చర్చలలో పాల్గొనే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది,జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. స్వల్పఅనారోగ్య సమస్యలు ఏర్పడే ఆస్కారం కలదు జాగ్రత్త వహించుట మంచిది. సమయానికి భోజనం . ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అధికారులకు అనుగుణంగా నడుచుకోనుట వలన మేలుజరుగుతుంది. కుటుంభంలో  సభ్యులతో కలిసి విలువైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. స్త్రీ / పురుష సంభందమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు.

 

తులా రాశి : ఈవారం మొత్తంమీద కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది వారితో సమయాన్నిగడుపుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వివాదాస్పదనిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది జాగ్రత్త. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. నచ్చిన వ్యక్తులను కలుస్తారు. నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు, అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోవడం మంచిది. దైవసంభందమైన విషయాల్లో సమయాన్ని గడుపుతారు. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు సమాధానం చెప్పవలసి వస్తుంది. వాహనముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన.

 

   

వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అనుకూలమైన మార్పులకు అవకాశం ఉంది. అధికారులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలమైన మార్పులు కలుగుతాయి కాకపోతే అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగంలో అభివృద్దిని కలిగి ఉంటారు అలాగే తోటివారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రాజకీయపరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట సూచన. మిత్రులతో కలిసి విందులలో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన సహకారం లభించుట వలన సంతోషాన్ని పొందుతారు.     

 

ధనస్సు రాశి :   ఈవారం మొత్తంమీద ప్రయాణాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. వాహనముల వలన కొంత ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం కలదు. తలపెట్టిన పనులను పూర్తిచేయుటలో నూతన సమస్యలు పొందుతారు. అధికారులతో కలిసి చేసిన చర్చలు పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవచ్చును. రాజకీయపరమైన రంగాల్లో ఉన్నవారికి మాత్రం కాస్త నిదానంగా ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం కలదు. సోదరులతో కలిసి చేపట్టే చర్చలు మిశ్రమఫలితాలను కలుగజేస్తాయి. సంతానపరమైన విషయాల్లో మాత్రం కొంత ఒత్తిడిని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఖర్చులకు తగిన ఆదాయం ఉంటుంది.    

 

మకర రాశి :  ఈవారం మొత్తంమీద కుటుంభంలో నూతన మార్పులకు అవకాశం ఉంది. పెద్దలతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదావేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగరిత్యా దూరప్రాంతాల్లో పనిచేసే విషయంలో నూతన ఒప్పందాలు జరుగుటకు అవకాశం కలదు. బంధువులతో కలిసి వ్యాపారపరమైన విషయాలను చర్చకు తీసుకోవచ్చే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్పఅనారోగ్యసమస్యలు ఏర్పడే అవకాశం కలదు తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీయొక్క మాటతీరును ఒకసారి సరిచుసుకోవడం వలన మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు.

 

   కుంభ రాశి :  ఈవారం మొత్తంమీద మానసికంగా నూతన సమస్యలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులను పొందుతారు. కుటుంభంలో మీరుతీసుకొనే నిర్ణయాలు వివాదాస్పదం అయ్యేఅవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. చిననాటి మిత్రులను కలుస్తారు వారితో కలిసి సమయాన్ని గడుపుతారు. అగ్నిసంభందమైన పనులను చేయునపుడు జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త. విలువైనవస్తువులను కొనుగోలు చేయకండి ఆ నిర్ణయాన్ని వాయిదావేయుట మంచిది. ప్రయాణాలు వాయిదావేయుట మంచిది.

 

 

మీన రాశి : ఈవారం మొత్తంమీద కోపాన్ని అకారణంగా పొందుటకు అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన. అధికారులతో లేదా పెద్దలతో మాటపట్టింపులకు వెళ్ళకండి, వారిసూచనలకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. సోదరులతో కలిసి విలువైన వస్తువులను కొనుగోలు చేసుకొనే అవకాశం ఉంది. కుటుంభంలో మీరు తీసుకొనే నిర్ణయాలు కొంతమందికి నచ్చకపోవచ్చును. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. తల్లితరుపు బంధువుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం కలదు. స్వల్పఅనారోగ్యసమస్యలు మిమ్మల్ని భాదించే అవకాశం కలదు. నచ్చిన వ్యక్తుల నుండి సంతోషించే వార్తను వింటారు.

మరిన్ని శీర్షికలు
Aritikaya Vepudu