లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ మగాళ్లనుండి ఆడాళ్లకి మాత్రమే ఉన్న సమస్య కాదు. రోజులు మారాయి. ఇలాంటి మానసిక రుగ్మతల్ని అబ్బాయిలు కూడా అనుభవిస్తున్నారు. వెస్ట్రన్ కల్చర్‌కి అలవాటు పడిపోతున్నారు ఇప్పుడు యూత్. దాంతో స్వలింగ సంపర్కులు సమాజంలో పెరిగిపోతున్నారు. ఉద్యోగం చేసే చోట, ఇతరత్రా రంగాల్లో ఈ తరహా మానసిక పరిస్థితి ఉన్న వారు అధిక సంఖ్యలోనే ఉన్నారనడంలో అతిశయోక్తి కాదంటే నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఇది నిజం. మృగాళ్లని అమ్మాయిలు ఎలా గుర్తు పట్టలేకపోతున్నారో. అలాగే అబ్బాయిలు కూడా గుర్తు పట్టలేకపోతున్నారు. అందరు మగవాళ్లు చెడ్డవాళ్లని అనలేం కదా. అందుకే ఆ మగాళ్లలోనూ, కొంతమంది మగాళ్ల చేతనే బాధించబడుతున్నవారున్నారు. ఈ వేధింపులు ఒక రకం అని లేదు. లైంగికంగానూ, మానసికంగానూ, శారీరకంగానూ కూడా వేధింపులకు గురి కావాల్సి వస్తుంది అబ్బాయిలు. మాకేం అబ్బాయిలం సమాజంలో ఎలాగైనా బతికేస్తాం అనుకునే రోజులు మారిపోయాయి. సొసైటీలో అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా సెక్యూరిటీ అవసరం.
కాలేజీ రోజుల నుండే ఈ వేధింపులు అధికమయ్యాయి. కాలేజీ కుర్రాళ్లు రేగింగ్ పేరిట ఈ తరహా వేధింపులకు పాల్పడుతున్నారు. ఇదివరకటి రోజుల్లో ర్యాగింగ్ అంటే ఓ ఫన్. జస్ట్ సరదా కోసం ఆట పట్టించే ఓ క్రీడ. కానీ ఇప్పుడది రాక్షస క్రీడగా తయారయ్యింది. ఈ రాక్షస క్రీడకు అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా పీడించబడుతున్నారు. ఇదివరకట్లో సాహసోపేతమైన చర్యలు, సరదా సరదా ఇష్యూస్ ఉండేవి ఈ ర్యాగింగ్‌లో భాగంగా. కానీ ఇప్పుడది ముదిరి ముదిరి ఎక్కడికో వెళ్లిపోయింది. అదే లైంగిక వేధింపులకు దారి తీస్తోంది. అబ్బాయిలు అమ్మాయిల్ని లైంగికంగా వేధించడం అనేది సర్వ సాధారణ విషయమే. వెస్ట్రన్ కల్చర్ పేరుతో వచ్చిన జాడ్యమే అబ్బాయిల్ని అబ్బాయిలు లైంగికంగా వేధించే రాక్షస క్రీడ. ఈ స్వలింగ సంపర్కుల్ని అబ్బాయిలు గుర్తు పట్టడం చాలా కష్టమైపోతోంది.
చిన్న వయసు అబ్బాయిలు సైతం ఈ వేధింపులకు గురి కాక తప్పడం లేదు. స్కూల్ స్టేజ్ నుంచే సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఈ వయసులో అసలు సమస్య ఏంటో అర్థం కాక, ఎవరితో చెప్పుకోవాలో తెలియక బాధితుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. వ్యవస్థలోని లోటుపాట్లు సమాజానికి చేటు తెస్తున్నాయనే విషయం ఇటువంటి సందర్భాల్లో ఇంకా ఎక్కువ ఫోకస్ అవుతుండడం మామూలే. లైంగిక వేధింపులు అనే మాటకు ఆడ, మగ అన్న తేడాల్లేకపోవడం వ్యవస్థలో కొన్ని మానవ మృగాల కారణంగానే జరుగుతోంది. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం ఎంత ముఖ్యమో సమాజంలోనూ మార్పు రావడం అంతే ముఖ్యం. ఇంటి నుంచే ఇటువంటి విషయాల్లో 'సంస్కరణ' అనేది ప్రారంభం కావాల్సి ఉంటుంది. ఎదిగే కొద్దీ సమస్యలు ఎక్కువవుతున్న దరిమిలా, యువత మరింత బాధ్యతగా వ్యవహరించి, మెరుగైన సమాజానికి మార్గదర్శకులుగా వ్యవహరించాల్సి ఉంటుంది.
|