బాదామ్ తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది, బాదాం తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇలా ఎన్నెన్నో మంచి విషయాలు బాదాం గురించి పోషకాహార నిపుణులు చెబుతుంటారు. దాంతో ఖరీదు ఎక్కువైనా బాదాం పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే బాదాం తినేందుకూ ఓ పద్ధతి ఉంది. మార్కెట్‌లో బాదాం బాగా ఎండిన సీడ్ రూపంలో దొరుకుతుంది. దాన్ని అలాగే తీసుకోవడం కంటే కూడా, 8 గంటల పాటు నానబెట్టిన తర్వాత తీసుకోవడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అలా నానబటెట్టడం వల్ల బాదాం కలిగించే అదనపు ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
నవ యవ్వన సౌందర్యం కోసం
8 గంటలపాటు బాదాంని నానబెట్టడం వల్ల, దానిపైనుండే తొక్క తేలిగ్గా ఊడిపోతుంది. తర్వాత మిగిలే బాదాం, తేలిగ్గా జీర్ణమవుతుంది. బాదాం తీసుకోవడం వల్ల వయసు మీద పడ్డ ఛాయలు మీ చర్మం మీద కన్పించకుండా ఉంటాయి. ముడుతలు పడకుండా నివారించే గుణం బాదాంలో ఉంటుంది. విటమిన్-ఇ బాదాంలో ఉండటమే దీనికి కారణం. బాదాంని ఫేస్ మాస్క్‌గా కూడా వినియోగించొచ్చు. బాదాంని తేనెతో కలిసి ముద్దగా గ్రైండ్ చేసుకుని, దాన్ని ఫేస్‌కి పట్టిస్తే కొన్ని రకాలైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల కారణంగా మొహంపై పడే మచ్చలు తొలగిపోతాయి.
కొవ్వు తగ్గించే దివ్యౌషధం
బాదాంలలో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొవ్వుని తగ్గించి, గుండెకు మేలు చేస్తుంది. బరువు తగ్గించడంలోనూ బాదాం పాత్ర కీలకం. బాదాం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందడంతోపాటుగా, 'అతి ఆకలి' తగ్గుతుంది. తద్వారా మితమైన ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఇంకేముంది, అధిక బరువు తగ్గి, ఫిట్‌నెస్ మీ సొంతమైనట్లే.
రక్తపోటుని అదుపులో ఉంచడం, డయాబెటిస్ సమస్యలు తగ్గించడమే కాకుండా, మెదడు పనితీరుని వేగవంతం చేయడంలో బాదాం పాత్ర చాలా కీలకం. శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్‌ని మరింత మెరుగుపరిచే గుణం నానబెట్టిన బాదాంలో కనుగొన్నారు. మంచి బ్యాక్టీరియాకి బాదాంతో ఎంతో ఉపయోగం. అన్నిటికన్నా ముఖ్యమైనది, క్యాన్సర్ కణుతుల్ని బాదాం వృద్ది చెందనివ్వదు. రోజువారీ ఆహారంలో బాదాంని తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ముప్పుని కొంతవరకు తగ్గించుకున్నట్లేనట. జీవన క్రియను మెరుగుపర్చడం ద్వారా బాదాం శరీరానికి పూర్తి ఆరోగ్యాన్నిచ్చే దివ్యౌషధం అనిపించుకుంటుంది. బాదాంలో ఉన్న పీచు పదార్థాలే దానికి కారణం. బాదాంతో ఇన్ని ప్రయోజనాలున్నప్పుడు, అది కూడా ఆ ప్రయోజనాలు బాదాం నానబెట్టినప్పుడు డబుల్ అవుతాయని తెలిసినప్పుడు ఇంకెందుకు ఆలస్యం, బాదాం వినియోగాన్ని అలవాటు చేసుకోండి, సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం చేసుకోండి.
|