ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నంతలోనే ఇంకో సినిమాని బాలయ్య సెట్స్ మీదకు తీసుకెళ్ళారంటే ఆ స్పీడుకి హేట్సాఫ్ చెప్పాల్సిందే. సీనియర్ హీరోల్లో ఇంత వేగంగా సినిమాలు చేస్తున్నది బాలయ్య మాత్రమేనేమో. మొన్న సంక్రాంతికి 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న బాలకృష్ణ, తాజాగా 'పైసావసూల్' సినిమాతో ప్రేక్షుల ముందుకి వచ్చేందుకు రెడీ అయిపోయారు. ఈలోగానే ఇంకో సినిమా సెట్స్ మీదకు వెళ్ళిపోయింది. అదే కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా. కెఎస్ రవికుమార్ సినిమా సంగతి అలా ఉంచితే 'పైసా వసూల్' సినిమాలో బాలయ్య ఎనర్జీ అద్భుతమని దర్శకుడు పూరి జగన్నాథ్ అంటున్నాడు. ఓ దర్శకుడి నుంచి హీరో పట్ల ఈ స్థాయి కామెంట్స్, అది కూడా సీనియర్ హీరో విషయంలో అంటే చాలా చాలా ప్రత్యేకమైన సందర్భం అనుకోవాలి.
పాటల్లో, యాక్షన్‌లో బాలయ్య చూపించిన తెగువకి దర్శకుడు పూరి జగన్నాథ్ ఫిదా అయిపోయాడట. 'పైసా వసూల్' టైటిల్ సాంగ్ ప్రోమో వచ్చిన తర్వాత పూరి జగన్నాథ్ వ్యాఖ్యలతో ప్రతి ఒక్కరూ ఏకీభవిస్తున్నారు. బాలీవుడ్ ఐటమ్ బాంబ్ కైరా దత్, ఈ సినిమా కోసం పనిచేసింది. 'పైసావసూల్' టైటిల్ సాంగ్‌లో బాలయ్య, కైరాదత్ పోటాపోటీగా స్టెప్పులేశారు. బాలయ్య ఎనర్జీని చూసి కైరాదత్ ఆశ్చర్యపోయిందట కూడా. వయసు మీద పడ్తున్నా బాలయ్యలో స్పీడ్ తగ్గలేదు సరికదా, మరింత పెరుగుతోంది. హేట్సాఫ్ టు బాలయ్యా.
|