Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prize-for-best-comment

ఈ సంచికలో >> శీర్షికలు >>

03-11-2017 నుండి 09-11-2017 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద నచ్చిన పనులను మొదలు పెట్టుటకు ఆసక్తిని చూపిస్తారు. మీ ఆలోచనలను పెద్దలతో పంచుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడంలో కొంత సందిగ్దత ఉంటుంది , కావున అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్లడం మేలు. వ్యాపారపరమైన విషయాల్లో చిన్న చిన్న పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడం మేలు. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి కీలకమైన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. జీవితభాగస్వామి తో కలిసి విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. బాగాఆలోచించి ధనం వెచ్చించుట మంచిది. కుటుంబపరమైన విషయాల్లో అకారణంగా కోపాన్ని పొందే ఆస్కారం ఉంది , జాగ్రత్త.  

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద ఆరంభంలో కొద్దిగా ఒత్తిడిని కలిగి ఉన్న చివరకు వాటిని అధిగమించే అవకాశం కలదు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. దూరప్రదేశంలో ఉన్న బంధువులు లేదా మిత్రులు విలువైన సమాచారం అందిస్తారు. నూతన అవకాశాలను అందిపుచ్చుకొనే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. అనుకోని ఖర్చులకు అవకాశం కలదు, సాధ్యమైనంత మేర వాటిని తగ్గించుకొనే ప్రయత్నం మంచిది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. 


మిథున రాశి : ఈవారం మొత్తం మీద మొదట్లో ఉత్సాహాంగా కనిపిస్తారు, మధ్యలో ఉత్సాహం కొంతమేర తగ్గుటకు అవకాశం కలదు. చేపట్టిన పనులను సరైన ప్రణాళిక లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి. సమయానుకూలంగా ప్రవర్తించుట ద్వారా లబ్దిని పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దలతో కలిసి నూతన నిర్ణయాలను తీసుకొంటారు. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట సూచన. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. తల్లితరుపు బంధువుల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళలకు గురిచేసే అవకాశం ఉంది. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగాల్లో నూతన అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది, అధికారులతో కలిసి తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. ముఖ్యమైన విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. స్పష్టమైన ప్రణాలిక కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత వరకు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. కుటుంబపరమైన విషయాల్లో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన పరిచయాలకు అవకాశం కలదు.  

 

 


 సింహ రాశి : ఈవారం మొత్తం మీద చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన సంభందాలు ఏర్పడే ఆస్కారం ఉంది. మీ మాటతీరు మూలాన కొంతమంది ఇబ్బందికి గురయ్యే ఆస్కారం కలదు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే ఆస్కారం కలదు, జాగ్రత్త. సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న ఆత్మేయుల నుండి ఆశించిన మేర సహకారం రావడం వలన,నూతన ఆలోచనలకు శ్రీకారం చుడుతారు.  

 

 


కన్యా రాశి : ఈవారం మొత్తం మీద చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. అనుకోకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సోదరులనుండి వచ్చిన సూచనలు మిమ్మల్ని ఆలోచనలో పడవేసే ఆస్కారం ఉంది. మిత్రులతో కలిసి చేసే పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట వలన లబ్దినిపొందుతారు. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మీ కోపం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం కలదు, జాగ్రత్త అవసరం. 

 

 


తులా రాశి : ఈవారం మొత్తం మీద చేపట్టిన పనుల మీద అలాగే ఆలోచనల విషయంలో స్పష్టత లేకపోతే నూతన సమస్యలు పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో ఊహించని ఇబ్బందులు రావడానికి ఆస్కారం కలదు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి రావడానికి చేసే ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును. కుటుంబపరమైన విషయాల్లో మనస్పర్థలు మరింతగా పెరిగే అవకాశం కలదు. 

 

 

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద నూతన నిర్ణయాల విషయంలో ఏమాత్రం తొందరపాటు పనికిరాదు. పెద్దలతో కలిసి పనిచేసే సమయంలో వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది. గతంలో మీకురావాల్సిన ధనం పూర్తిస్థాయిలో చేతికి రాకపోవచ్చును. సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండుట సూచన. అనుకోకుండా చేసే దూరప్రదేశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది , కాకపోతే చిన్న పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడం మేలు. ఆరోగ్యపరమైన విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. 

 

 

ధనస్సు రాశి :ఈవారం మొత్తం మీద అధికారులతో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. గతంలో చేసిన పనుల మూలాన నలుగురిలో మంచి పేరును పొందుటకు ఆస్కారం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు పనికిరాదు. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబపరమైన విషయాల్లో మీ సంతానం పట్ల నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. జీవితభాగస్వామితో ఉన్న స్వల్ప మనస్పర్థలు తగ్గుటకు అవకాశం ఉంది, ససర్దుబాటు విధానం మంచిది. 

 

 



మకర రాశి : ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విషయాలకే హైరానా పొందుతారు. దూరద్రుష్టి లేకపోవడం వలన నూతన సమస్యలు పొందుతారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేక్ సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. సమయానికి భోజనం చేయుట,తగినంత విశ్రాంతి మంచిది. ఉద్యోగంలో నూతన అవకాశాల కన్నా ఇప్పటికే ఉన్నచోట నిలదొక్కుకునే ప్రయత్నం మేలుచేస్తుంది. సాధ్యమైనంత మేర అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. జీవితభాగస్వమి తీసుకొనే నిర్ణయాలు మీకు పెద్దగా నచ్చకపోవచ్చును , కాకపోతే వేచిచూసే ధోరణి వలన మేలుజరుగుతుంది. పెద్దలను కలుస్తారు. 


కుంభ రాశి : ఈవారం మొత్తం మీద చేసిన పనులను మల్లి మల్లి చేయవలసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో భాద్యతలు పెరుగుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు పెరుగుటకు ఆస్కారం కలదు. నూతన ప్రయత్నాల కన్నా గతంలో మొదలుపెట్టిన పనులను పూర్తిచేయుట ఉత్తమం. శ్రమకు తగిన ఫలితం రాకపోవచ్చును, నిరాశ వద్దు. ఆరోగ్యపరమైన సమస్యలు తప్పక పోవచ్చును. చిన్న చిన్న విషయాలకే ఇబ్బంది పడుతారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు వాయిదాపడే అవకాశం ఉంది. ఉన్నతవిద్య కోసం చేసే ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. 

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొంటారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆత్మీయులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిననాటి మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. జీవితభాగస్వమై నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నం మంచిది. సమయానికి భోజనం చేయుట సూచన. వాహనాల వలన అనుకోని ఇబ్బందులు తప్పకపోవచ్చును. 

 

మరిన్ని శీర్షికలు
kothimeera chicken