Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
what can we do?

ఈ సంచికలో >> యువతరం >>

స్మార్ట్‌ బిజినెస్‌.. కొత్త కాన్సెప్ట్‌ గురూ!

smart bussiness

స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు ప్రపంచం మొత్తం అరచేతిలో ఉన్నట్లే ఇప్పుడు. ఎక్కడ విన్నా స్మార్ట్‌ అన్న మాటే. స్మార్ట్‌ ఫోన్‌ రాకతో ప్రపంచం చాలా చిన్నదైపోయింది. చాలా దగ్గరైపోయింది. ప్రపంచం రూపు రేఖలే మారిపోయాయి. స్మార్ట్‌ టెక్నాలజీకి పెద్ద పెద్ద సంస్థలు, చిరు వ్యాపారులు అనే తేడా లేకుండా పోయింది. బడా బడా సంస్థలే కాదు, చిరు వ్యాపారాలు కూడా స్మార్ట్‌ టెక్నాలజీ సాయంతో కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నాయి. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌, లేదా కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు. ఎలాంటి వారైనా బిజినెస్‌ చేసేయొచ్చు అనేంతలా మారిపోయింది. ఈ మార్పు మంచిదే. ఆర్థికంగా చాలా మంది బాగుపడేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి.

అనేక రకాలుగా ఉపాధి లభిస్తోంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసమే ఎదురు చూడకుండా, తమ బుర్రకి కాస్తంత పదును పెడితే, వారి ఆలోచనల నుండి, టెక్నాలజీ సాయంతో పుట్టే కొత్త కొత్త ఐడియాలు ఎన్నెన్నో. తద్వారా తమతో పాటు, మరో నలుగురు నిరుద్యోగులకూ ఉపాధినిచ్చేందుకు సదరు మహిళలు ఇంట్లో నుండే బిజినెస్‌ ఉమెన్‌గా ఎదిగేందుకు ఈ స్మార్ట్‌ టెక్నాలజీ సాయపడుతోంది. సరదాగా ఇంట్లో చేసే వంటకాల దగ్గర నుండి, ఇతరత్రా వ్యాపకాలను ఆన్‌లైన్‌ ద్వారా వ్యాప్తి చేసి, విక్రయిస్తున్నారు. తద్వారా వారు ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుంది. దీనికంతటికీ కారణం స్మార్ట్‌ ఫోనే. అది ఫోన్‌ అయినా కావచ్చు. కంప్యూటర్‌ అయినా కావచ్చు. జస్ట్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు. స్మార్ట్‌ టెక్నాలజీ పెరిగిపోవడంతో ఆన్‌లైన్‌ విక్రయాలకు ఆదరణ బాగా లభిస్తోంది. ఆ కారణంగా బోలెడంత టైమ్‌ కలిసి వస్తోంది. ఆ టైంలో మరో ఆలోచన చేసేందుకు, మరో ముఖ్యమైన పనిని పూర్తి చేసేందుకు తోడ్పడుతోంది.స్మార్ట్‌ టెక్నాలజీతో ఇదొక్కటే కాదు పలు రకాల సంస్థలు కొత్త కొత్త ప్రోడక్ట్స్‌తో మీడియేటర్స్‌ని ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. మీడియేటర్స్‌ ద్వారా స్మార్ట్‌ టెక్నాలజీతో తమ తమ ప్రోడక్ట్స్‌ అమ్మకాలను పెంచుకోవాలని ఆశిస్తున్నాయి సదరు సంస్థలు. వీటి పట్ల ఎక్కువగా ఎట్రాక్ట్‌ అయ్యేది నిరుద్యోగులు, గృహిణులే. తద్వారా ఉపాధి అవకాశం, అదనపు ఆదాయానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. 

అయితే అన్నింట్లోనూ మంచి - చెడూ ఉంటాయి. ఈ స్మార్ట్‌ టెక్నాలజీ ఎంత మంచి చేస్తుందో అంతా చెడును కూడా కలిగిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌ వచ్చాక ప్రతీ ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ ఫోనే. దాన్ని మంచి కోసం వినియోగించే వారి కన్నా చెడు పనుల కోసం ఉపయోగించేవారే ఎక్కువయ్యారిప్పుడు. అందుకు అవగాహనా లోపం కావచ్చు. మరే ఇతర కారణాలైనా కావచ్చు. పసి పిల్లవాడి దగ్గర నుండి ముసలి వాళ్ల వరకూ ఈ స్మార్ట్‌ ఫోన్‌కి అడిక్ట్‌ అయిపోతున్నారు. దాంతో ప్రపంచం దగ్గరయ్యింది సరే, దగ్గరే ఉన్న బంధాలు మాత్రం దూరమైపోతున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌కిచ్చే విలువ, మానవ సంబంధాలకి లేకుండా పోతోంది. ఇకపోతే ఆర్ధిక పరంగా చూస్తే, ఓ కంపెనీ నుండి సమ్‌థింగ్‌ బిజినెస్‌ ఆఫర్‌ రావచ్చు. దానిలో అడుగు పెట్టేముందు ఒక్క క్షణం ఆలోచించాలి. ఆ కంపెనీ ప్రొఫైల్‌ ముందుగా తెలుసుకోవడం ముఖ్యం. ఆ ప్రొఫైల్‌ మంచిదా కాదా అని బేరీజు వేసుకోవాలి. ముందస్తు పెట్టుబడులు కోరేవారిని నమ్మరాదు. కొన్ని సంస్థలు సెక్యూరిటీ డిపోజిట్స్‌ని అడుగుతుంటాయి. అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రొడక్ట్‌ మీ ద్వారా మీ సన్నిహితులకు చేరుతుంది. సో అందులో ఫేక్‌ ఏమైనా ఉంటే, ముందుగా మీకూ, మీ సన్నిహితులకూ మధ్య విబేధాలు రావచ్చు.సో ఇలాంటి వాటి పట్ల టెర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌ తప్పనిసరి. స్మార్ట్‌ ఫోన్‌ని స్మార్ట్‌గా వాడండి. స్మార్ట్‌గా ఉండండి. అంతే కానీ షార్ట్‌ కట్‌లో అడ్డదార్లు తొక్కకండి! 

మరిన్ని యువతరం