ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు యంగ్ హీరో శర్వానంద్. అందులో తొలి సినిమా 'శతమానం భవతి' మంచి విజయాన్ని అందించింది. బాక్సాఫీస్‌కి కాసుల వర్షం కురిపించింది. రెండో సినిమా 'రాధ' నిరాశపరిచింది. కానీ మళ్లీ మూడో సినిమా 'మహానుభావుడు'తో రేస్‌లోకి దూసుకొచ్చేశాడు శర్వానంద్. ఇవన్నీ ఈ ఏడాది విడుదలైన సినిమాల చిట్టా అనుకుంటే, వచ్చే ఏడాదికి కూడా మూడు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు ఆల్రెడీ మనోడు. హను రాఘవపూడితో ఓ సినిమా ఆల్రెడీ సెట్స్‌పై ఉంది. ఇది కాక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్. శర్వాతో పాటు ఈ సినిమాలో మరో యంగ్ హీరో నాని నటిస్తున్నాడనీ సమాచారమ్. దిల్ రాజు బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది.
కాగా ముచ్చటగా మూడో సినిమా ఇటీవలే స్టార్ట్ అయ్యింది. అదేంటంటే సుధీర్ వర్మ దర్శకత్వంలో. 'సామిరారా', 'దోచెయ్', 'కేశవ' చిత్రాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ, శర్వానంద్ కోసం అదిరిపోయే స్క్రిప్ట్‌ని రెడీ చేసి పెట్టాడట. ఇంతవరకూ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్‌తో కామెడీ హీరోగా వరస విజయాలను అందుకుంటోన్న శర్వానంద్ ఈ సినిమాతో మళ్లీ ఓ ప్రయోగం చేయబోతున్నాడట. గతంలో విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. సీరియస్ క్యారెక్టర్లు చాలానే చేశాడు. ఇప్పుడు మళ్లీ గత రోజుల్లోకి తనని తీసుకెళ్లే స్టోరీ ఇదని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడట. అయితే తనకి సక్సెస్ తెచ్చిన కామెడీని కూడా వదిలి పెట్టనంటున్నాడు. అంటే రెండు వేరియేషన్స్‌లో శర్వా కనిపించబోతున్నాడట ఈ సినిమాలో. శర్వా సరసన కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శర్వానంద్‌తో కాజల్ జత కడుతుండడం విశేషం.
|