Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> కనువిప్పు - సరసమైన కథ

kanuvippu

శైలూ.. ప్రమోద్ క్యాబిన్ దగ్గరకొచ్చి కొత్తగా కొన్న స్మార్ట్ ఫోన్ చూపిస్తోంది. ఫోన్ సంగతేమోగానీ.. ఆడతనపు సింగారాన్ని అంత దగ్గరగా చూసేసరికి ప్రమోద్ కి గుండెలయ తప్పినట్టయ్యింది. ఆఫీసులో రోజూ కలిసి మాట్లాడే అమ్మాయే శైలూ. కానీ, ఇంతలా తనను దగ్గరగా చూసింది ఎప్పుడూ లేదు. రెండు శరీరాల మధ్య కెమిస్ట్రీ అంటుంటారు.. వినడమేగానీ, అనుభవించింది లేదు. అదేంటో తొలిసారిగా అర్ధమవుతోంది ప్రమోద్ కి. అనుకోని అతిథిలా తనువంతా ఆక్రమించుకున్న రసానుభూతిని నిశ్శబ్దంగా ఆహ్వానిస్తూనే..

‘‘ ఓహ్.. కంగ్రాట్స్.. చాలా బావుంది శైలూ.. ఏంటీ స్పెషల్? గిఫ్టా?‘‘ శైలు చేతిలోని ఫోన్ ని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు ప్రమోద్.

‘‘యస్.. స్పెషల్ గిఫ్టే. ఇది రాజేష్ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్. కొత్తమోడల్. మార్కెట్లోకి రాలేదట. ఆన్ లైన్లో బుక్ చేసి తీసుకున్నాడు. బావుంది కదూ?‘‘ ప్రమోద్ కూర్చున్న కుర్చీ హ్యాండిల్ కి జారబడి ఎంతో ఆనందంగా చెప్తోంది శైలు.

ప్రమోద్ కుడిచేతి మోచేతికి.. ఏదో మొత్తగా తాకిన అనుభవం. ఒకపక్క ఫోన్ డిస్ ప్లే చెక్ చేస్తూనే.. అదే ఓరకంటతో.. తన మోచేతిని తాకుతున్న శైలు నడుము.. ఆ నడుము ఒంపుల్లో దాగిన నాభి సౌందర్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శరీరం మరింతగా బరువెక్కుతోంది. కానీ శైలూ మాత్రం అప్రయత్నంగానే దగ్గరైంది. అందులో ఏమర్మం లేదని ప్రమోద్ కి తెలుసు.

‘‘ఫోన్ స్టయిలిష్ గా.. స్లిమ్ గా.. చాలా బావుంది. మెడలో నాలుగు ముళ్ళు పడకుండానే రాజేష్ తో.. షాపింగ్ చేయించేస్తున్నావన్నమాట‘‘ లోపల రగులుతున్న వేడిని కంట్రోల్ చేసుకుంటూ.. అది పైకి ఏమాత్రం కనపడకుండా నవ్వుతూ అడిగాడు ప్రమోద్.

‘‘ అంతేగా మరి. పెళ్ళయితే.. అడగ్గానే ఇంత ప్రేమగా కొనిస్తాడా? ఇప్పుడైతే అడక్కుండానే ఇచ్చాడు’’ ఫకాలున నవ్వేస్తూ.. ప్రమోద్ చేతిలో ఫోన్ తీసుకుని.. ఇంకాస్త దగ్గరగా జరిగి నాలుగైదు సెల్ఫీలు దిగింది శైలు. సెల్ఫీలు పుణ్యమా.. అని.. శైలూ శరీరపు పలకరింత ప్రమోద్ లో మరింత వేడి పుట్టించింది.

‘‘ ఏమాత్రం అరమరికలు లేకుండా.. అబ్బాయిల మీదపడే ఈ శైలూని ఇన్నాళ్ళూ ఎందుకు పట్టించుకోకుండా వదిలేశానబ్బా.. ప్చె.. ఇప్పుడు బాదపడి ఏంలాభం.. రాజేష్ తన్నుకుపోతున్నాడుగా..’’ లోలోనే తెగ బాధపడిపోయాడు.

‘‘సరే.. బై ప్రమోద్! మన బాస్ వచ్చే టైమైంది. ఈ సెల్ఫీలు గట్రా చూశాడో.. ఏడుస్తాడు..‘‘ నవ్వేస్తూ తన సీట్లోకి వెళ్ళిపోయింది శైలు. ప్రమోద్ కి.. మామూలు స్థితికి రావడానికి చాలాసేపు పట్టింది. ‘‘పెళ్లి చేసుకుంటే.. శైలూలాంటి ఫిజిక్, మోడ్రన్ గా ఉన్న అమ్మాయినే చేసుకోవాలి’’ అని మనసులోనే అనుకుంటూ ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు ప్రమోద్..

****

ఉదయం.. ఆరుగంటలు.

ఇంకా కలత నిద్రలోనే ఉన్నాడు ప్రమోద్. దిండుకింద ఉన్న ఫోన్ మోగుతోంది.

‘‘రేయ్.. ప్రమోద్. వచ్చే ఆదివారం నీ పెళ్లిచూపులు. శనివారం ఉదయానికల్లా నువ్వు ఊర్లో ఉండాలి.. సరేనా‘‘ అవతల స్వరం చెప్పాల్సింది చెప్పేసింది.

‘‘నాన్నా.. ఇంత సడన్ గా పెళ్లిచూపులేంటి. అయినా పెళ్లికి అంత తొందరేమొచ్చింది?’’  కొంచెం ధైర్యం కూడదీసుకునే అడిగాడు.

‘‘ ఇదిగో చిన్నోడా.. ఇప్పటిదాకా నువ్వు.... మంచి ఉద్యోగం రావాలి. ఇంతకంటే బాగా సెటిలవ్వాలి.. అప్పటిదాకా పెళ్ళికాగుతా.. అంటే.... సరేలే నీమాట ఎందుకు కాదనాలని ఓపికపట్టాం. నువ్వు ఎప్పటికప్పుడు ఇలా ఏవో ఒకటి కుంటిసాకులు చెప్తూ.. కూర్చుంటే.. పిల్లదొరక్క.. మీ అమ్మ నేనూ ‘మా అబ్బాయికి.. పిల్లనెతికిపెట్టండి బాబయ్యా!’’ అంటూ ఊరూరా చెప్పులరిగేలా తిరగాలి’’ ఫోన్లో అవతలి స్వరం కాస్తంత కఠువుగానే వినిపించింది. ప్రమోద్ తండ్రి పార్వతీశం పెద్దగా ఎప్పడూ కొడుకుపై కోప్పడింది లేదు. కానీ, ఒక్కసారిగా అలా తండ్రి ఫోన్లోనే విరుచుకుపడే సరికి బిత్తరపోయాడు ప్రమోద్.

‘‘ ఇప్పటిదాకా.. పెళ్లిపెటాకులు లేకుండా గడిపింది చాల్లేగానీ.. ఇప్పుడు బాగానే సంపాదిస్తాన్నావ్ గా. వచ్చిన సంబంధం బావుంది. మనకంటే స్థితిమంతులు. పైగా అమ్మాయి లక్షణంగా ఉందట. నీకూ.. ఈడూ జోడు బావుంటుందనే.. మేం.. ఆ సంబంధం ఖాయం చెయ్యాలనుకుంటున్నాం. ఇంకేం మాట్లాడమాక’’ అల్టిమేటమ్ జారీ చేశాడు ప్రమోద్ తండ్రి. 

నిజానికి పెళ్లిచూపుల విషయంలో అడ్డు చెప్పడానికి ప్రమోద్ దగ్గర ఇప్పడు పెద్దగా  కారణాలు ఏమీ లేవు. వయసు ముప్పయిదాటి రెండు మూడేళ్ళయ్యింది. పెళ్లి చేసుకోవడానికి పిల్లే దొరకలేదా? అంటే అదీకాదు. ఉద్యోగంలో మంచి పొజిషన్ కి రావాలంటూ.. ఇప్పటిదాకా.. పెళ్లి ప్రస్తావన నాన్చుతూ వచ్చిన ప్రమోద్ కి, మరోపక్క ప్రేమలు, దోమలు అన్నా చిరాకే. అలాంటిదేదైనా కమిట్ అయితే, ఎక్కడ తనకు వచ్చే కట్నకానుకలు తగ్గిపోతాయో? అని భయపడే రకం. అందుకే, కంటికి నచ్చిన అమ్మాయిలు కనిపించినా.. ఒకరిద్దరు.. గర్ల్ ఫ్రెండ్స్ లవ్ ప్రపోజల్స్ తో దగ్గరవ్వాలని ప్రయత్నించినాగానీ, ఎక్కడ పెళ్లికి ఒప్పుకోవాల్సి వస్తుందోనని భయపడి అమ్మాయిలకు దూరంగా ఉంటూ వచ్చాడు.

అయితే, పెళ్లి విషయానికొస్తే.. తనకు కాబోయే పెళ్ళాం.. అత్యాధునికమైన అమ్మాయై ఉండాలనేది అతడి మనసులో బలంగా నాటుకుపోయింది. ‘‘ఊరుపట్టున ఉండే ఆడపిల్లల్లో.. సెక్స్ అప్పీల్ తక్కువుగా ఉంటుంది. పట్నం అమ్మాయిల్లా.. తీరైన అవయువ సౌష్టంపై శ్రద్ధపెట్టాలనే ద్యాసే వాళ్ళకు ఉండదు’’ అనుకునే పూలిష్ మెంటాల్టీ ప్రమోద్ ది. పుట్టిపెరిగింది పక్కా పల్లోలోనైనా ఎందుకనో.. ఊళ్ళో ఆడపిల్లలంటే అతడికి చులకన. ఆ కారణంతోనే, ఇప్పటిదాకా.. ఇంట్లో ఎన్ని సంబంధాలు చూసినా.. పల్లెటూరమ్మాయితో పెళ్లి సంబంధం అని తెలియగానే,  ఏదో ఒక కుంటిసాకు చెప్పి తప్పించుకోవడం ప్రమోద్ కి బాగా అలవాటయ్యింది. కానీ ఈసారి మాత్రం తప్పించుకోవడానికి అవకాశంలేదు.  ‘‘ ఈ అమ్మాయితోనే నీ పెళ్లి ఖరారు..’ అని తేల్చినట్టుగా తండ్రి స్వరం ఫోన్లో మారుమోగింది. పైగా కొలీగ్ శైలూ.. తాజాగా శరీరంలో మొలకెత్తించిన కోరికలు.. ఇంకా ప్రమోద్ ని వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో.. పెళ్లిచూపులు చూడ్డానికి, పెళ్లికీ సిద్ధమయ్యాడు.

****

గదిలో పూలపందిరి అలంకరణ బావుంది. అమ్మాయి రాకుండానే పూలపరిమళం, అగరబత్తీల గుభాళింపుతో గదంతా మత్తుగా ఉంది. ఇప్పటికీ శోభనపు తంతు పాతపద్దుల్లోనే కొనసాగించడం ప్రమోద్ కీ బాగా నచ్చింది. ఇక అమ్మాయి రాకే ఆలస్యం. కానీ.. ఆ సమయంలోనూ.. ప్రమోద్ కి శైలూ గుర్తొస్తుంది. ‘మళ్ళీ అలాంటి స్పర్శను తిరిగి దక్కించుకోవడం కష్టమే. శైలూ ముందు.. అజంతా శిల్పంకూడా తక్కువే. చూపులతోనే కొలతలేసి మరీ చెప్పొచ్చు తన అందచందాల్నీ.. ప్చె..’’ అని మనసులో ఒకింత నిష్ఠూరపడుతున్న సమయంలో.. నెమ్మదిగా తలుపు తీసుకుంటూ.. లోపలకొచ్చింది కొత్తపెళ్లికూతురు.

దగ్గరగా వస్తూనే ప్రమోద్ ని కళ్ళతోనే పలకరించింది. శరీరానికి బిగుతుగా కట్టిన తెల్లని పట్టుచీరలో ఉమ తళతళా మెరిసిపోతుంది. దానికి తోడు.. సన్నని వొంకీలు తిరిగిన కురులు.. వదులుగా ఉంచి.. తలలో సరిపడినన్ని మల్లెపూలు అలంకరణ. చూడ్డానికి సింపుల్ గా.. ఉన్నా.. ఆమె అలా నెమ్మదిగా నడిచి వస్తుంటే.. పౌర్ణమివేళ.. సముద్రపు తీరాన.. వయ్యారంగా నడిచివస్తున్న కావ్యకన్నెలా ఉంది.

ఒక్కింత సిగ్గుపడుతూనే ప్రమోద్ దగ్గరకొచ్చి కూర్చుందామె. 

‘‘ కాచిన పాలు ఇక్కడే చెంబులో ఉన్నాయంట. అమ్మ చెప్పింది. అందుకే పాలగ్లాసుతో రాలేదు. గ్లాసులో వేసిస్తా.. తాగండి.. ’’ కొంచెం భయం, సిగ్గు కలబోతగా పాలచెంబు వైపు తిరిగిందామె.

ఆమె.. అటు తిరిగిందోలేదో.. ఉమ వెనకభాగంపై అనుకోకుండా ప్రమోద్ చూపుపడింది. నడుముకి.. మెడకు మధ్యగల దూరానికి వారధికట్టినట్టుగా.. జాజివర్ణపు జాకెట్టు. మధ్యలోంచి బాణంలాంటి చీలిక. అలా మంచంపై ఓపక్కగా కూర్చుని, చెంబులోంచి గ్లాసులోకి పాలు ఒంపుతున్న సమయంలో ఆమె నడుము ఒంపులు తిరుగుతోంది. నిటూరుగా నిలబడ్డ వీపు.. పూలపాన్పుని మైమరపిస్తోంది. ప్రమోద్ లో అలజడి మొదలైంది.

‘‘ ముందు.. భర్తకు పాలు ఇవ్వాలంటగా.. ’’ ప్రమోద్ చేతికి పాలగ్లాసు అందిస్తూ అంది ఉమ.

‘‘ ఇది.. కూడా మీ అమ్మే చెప్పిందా?!’’ సరసంగానే మాటలు కలిపాడు ప్రమోద్. ఏమాత్రం శబ్ధంలేకుండా చిరునవ్వుల్ని ఎంతో అందగా ఒలకబోశాయి ఆమె కాటుక కళ్ళు. పాలు కూడా సగభాగం అయ్యాయి.

‘‘పాలు తాగేశాంగా.. ఇక కూర్చోమరి..’’ చేయిపట్టుకుని ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. తను.. తనువు.. రెండూ ఒకటై.. దగ్గరగా జరిగేకొద్దీ.. జీవితంలో ఎప్పడూ చూడనంత అద్భుతం చూస్తున్నట్టుగా ఉంది అతడికి. సిగ్గుతో అటువైపుగా ఓరగా వొంగిందామె.

సన్నటి దీపపు వెలుతురులోనూ.. విప్పారిన ఆమె వీపు భాగం వెలిగిపోతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. రెండు చేతుల్లో ఆమెను ఆమాంతంగా చుట్టేసుకుంటూ.. భుజాలపై మొఖాన్ని వాల్చి.. ఆఘ్రానింపు పరవశంలో మునిగిపోసాగాడు. ఆమె భుజాలు పాలసముద్రంలోని కెరటాల్లా మెరిపోతున్నాయి. మెడవొంపుల్లోంచి.. సుడులు తిరిగిన కురులు, వాటి మధ్య అల్లుకున్న మల్లెలపరిమళం.. కలబోతయై.. ప్రమోద్ ని.. ఎక్కడికో తీసుకెళుతున్నాయి. అటుగా తిరిగినామెను.. తనవైపు లాక్కోబోయాడు.

సిగ్గులు మొగ్గవుతున్నవేళ గదిలో వెలుగుతున్న బెడ్ లైట్ ఆర్పేందుకు లేవబోయింది ఆమె. వారించబోయేంతలో ఆమె పవిట అతడి చేతుల్లో పడి అప్రయ్నంగానే నేలపై జారిపడింది. చూపులు తిప్పుకోలేని ఆడతనం అతడిని కళ్ళప్పగించేలా చేస్తోంది. జారిపడ్డ పైట ఎదపొంగుపై వేసుకునేలోపే.. నడుపై చేయివేసి ఆమెను అలాగే మరింత దగ్గరకు తీసుకున్నాడతడు. ఎదపొంగులు పరవళ్ళు తొక్కినట్టుగా ఉందామె స్థితి కూడా.

‘‘ ఎన్నెన్ని పర్వతశిఖరాలు అదిరోహించి తపస్సు చేస్తే.. ఇంతటి ఫలం దక్కుతోంది. అడ్డుతెరగా ఉన్న జాకెట్టు హుక్స్ అతడి ప్రమేయంతో ఒక్కసారిగా సంకెళ్ళు తెంచుకోసాగాయి. అచ్ఛాదనలేని సజీవమైన పాలరాతి శిల్పంలా ఆమె. రాత్రంతా ఆ శిల్పసౌందర్యంతోనే తన్మయత్వం చెందేందుకు సిద్ధపడుతున్నవాడిలా అతడు. ఒక్కొక్కటిగా రెండు శరీరాలు నూలుపోగులేని స్థితిలోకి జారుతున్నాయి. రెండు అల్లుకున్న శరీరాల బరువుతో పందిరిమంచం కూడా ఆరాత్రిలో పలుసార్లు నిశ్శబ్దపు ఊయ్యాలయ్యింది. 

***

తెల్లారింది. శోభనపు పాన్పుపై మగత నిద్రలో ఉన్న భార్యను మరోసారి తృప్తిగా చూసుకున్నాడు. ‘‘ ప్రియమైన పల్లెటూరి భార్యా.. నన్ను క్షమించవా?’’ అని పల్లెటూరమ్మాయిలందరికీ తన భార్య సాక్షిగా మనసులోనే శిరస్సువంచి క్షమాపణ చెప్పుకున్నాడు. ఇంతలో కోలీగ్ శైలూ నుంచి ఫోన్..

‘‘హాయ్ ప్రమోద్.. నీపెళ్లికి రాలేకపోయా. సారీ డియర్. అదే రోజు.. రాజేష్ కి, నాకూ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరిగింది. సడన్ గా అనుకుని.. ఆరోజు ఇంట్లోవాళ్ళు అలా కానిచ్చేశారన్నమాట. అన్నట్టు..నీకోసం.. చిన్న గోల్డ్ రింగ్, మీ బంగారం కోసం చీర.. ఇక్కడ వెయిట్ చేస్తున్నాయ్.  ఊళ్ళోకి ఎప్పుడొస్తున్నావోయ్?’’  అని శైలూ ఎంతో ఆప్యాయంగా అడగ్గానే..

‘‘ అదేంటి.. గోల్డ్ రింగులు, చీరలు.. అవన్నీ ఇప్పుడు ఎందుకు శైలూ’’ ఆశ్చర్యపోతూ అడిగాడు ప్రమోద్ ‘‘ ఇదిగో మిష్టర్ ప్రమోద్..  మా ఇంట్లో మగపిల్లలు లేరు. ఉంటే గింటే నేనొక్కతినే మగరాయుడ్ని. ఏం.. అన్నయ్యలాంటి ప్రమోద్ కి.. సిస్టర్ శైలూ.. ఈ మాత్రం బుల్లిగిఫ్ట్ ఇవ్వకూడదా..’’ అలా శైలూ ఫోన్లో సొంత చెల్లెలు కంటే ఎక్కువుగా.. ప్రేమగా దబాయించినట్టు అడుగుతుంటే ప్రమోద్ కి.. ఒక్కసారిగా మనసు ఆర్ధ్రమైంది. కాసేపట్లో శైలూతో ఫోన్ సంభాషణ ముగిసింది.

‘‘ ఓ ఆడపిల్ల.. మగవాళ్ళతో కలుపుగోలు తనంతో ఉంటే అది సరస శృంగారానికి స్వాగతం పలకడంలాంటిదని అనుకోవడం ఎంత అనాగరికం. ఓహ్.. షిట్.. చదువుకున్నవాడినై ఉండికూడా  శైలూ గురించి ఎంత తప్పుగా ఆలోచించాను. ఆమె క్యారెక్టర్ని అలా చీప్ గా అంచనావేస్తే.. ఆమె మాత్రం.. నన్నో తోబుట్టువుగా భావించింది. ఐయామ్ సారీ.. శైలూ.. ఐయామ్ ఏ బిగ్ స్టుపిడ్ ఫెలో..బహుశా మగబుద్ధి అంటే ఇదేనేమో?!’’ కనువిప్పుతో అతడి కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి.

మరిన్ని కథలు
masakabarina nakshatram