'రంగస్థలం' ఫస్ట్‌లుక్ వచ్చింది. చిట్టిబాబుగా చరణ్ ఈ లుక్‌లో చిందేస్తున్న తీరు అదరగొట్టేస్తోంది. ఈ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కంప్లీట్‌గా ఛేంజ్ అయిపోయాడు చరణ్ ఈ సినిమా కోసం. ఇదిలా ఉండగా, ఈ లుక్ బయటికి వచ్చిన కొన్ని గంటల్లోనే సినిమాలోని హీరోయిన్‌గా నటిస్తున్న సమంత స్టిల్స్ కొన్ని బయటికి వచ్చాయి. ఈ స్టిల్స్ ఎలా లీకయ్యాయో తెలీడం లేదు చిత్ర యూనిట్‌కి. చాలా ఇంపార్టెంట్ స్టిల్స్ అవి. సినిమాకి కీలకమైన స్టిల్స్ కూడా. సర్‌ప్రైజింగ్‌గా ఈ స్టిల్స్‌ని రిలీజ్ చేయాలనుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. కానీ అనుకోకుండా ఈ లీకుల బెడద 'రంగస్థలం' సినిమాని ఇరకాటంలో పడేసింది. ఏ హంగూ ఆర్భాటం లేకుండా సమంత లుక్ బయటికి వచ్చేసింది. ఈ లీకుల విషయమై చిత్ర యూనిట్ పోలీసులనాశ్రయించింది.
ఏదేమైనా ఈ సినిమా కోసం ఇటు చరణ్, అటు సమంత ఇద్దరూ కంప్లీట్‌గా ఛేంజ్ అయిపోయారు. మేకప్, గెటప్ దగ్గర నుండీ బాడీ లాంగ్వేజ్ అంతా చాలా ఛేంజ్ అయిపోయింది. ఓ కొత్త లోకంలోకి సుకుమార్ తీసుకెళ్లనున్నాడు ఈ సినిమాతో. అయితే అసలు ఈ సినిమా కథేంటీ, నేపథ్యం ఏంటీ అనేది చిన్న లీక్ కూడా కాకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు. పక్కా పగడ్బంధీగా ప్లాన్ చేశాడు. అయినా కానీ స్టిల్స్ ఎలా లీకయ్యాయో తెలీదు. స్పెషల్‌గా రిలీజ్ చేద్దామనుకున్న సమంత లుక్ బయటికి వచ్చేసింది. అలాగే చరణ్, సమంత ఇద్దరి కాంబోలోని లుక్‌ని కూడా స్పెషల్‌గా రిలీజ్ చేయాలని అనుకున్నాడు ఈలోగా ఇలా జరిగింది. ఈ సినిమాలో అనసూయ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదో పల్లెటూరి నేపథ్యంలో సాగే అందమైన లవ్ స్టోరీ అనేంతవరకే తెలుసు. 1985 కాలం నాటి పరిస్థితులను చాలా నేచురల్‌గా హృద్యంగా చూపించనున్నారు ఈ సినిమాలో. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|