Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
new generation new sensation

ఈ సంచికలో >> యువతరం >>

జాబ్‌ కొట్టాలంటే ఇలా ట్రై చెయ్యి గురూ!

Try this job to hit the job!

కొత్తగా ఉద్యోగంలో జాయిన్‌ అవుతున్నామంటే చాలు అనేక రకాల అనుమానాలు, ఒత్తిడికి లోనవుతూ ఉంటుంటాం. అయితే ఆ ఒత్తిడి నుండి అనుమానాల నుండి బయటపడి, జాబ్‌ కొట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి. మన టాలెంట్‌కి తగ్గ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఇంటర్య్వూ దశలో కామన్‌గా ఉండే భయాన్ని వీడాలి. ఈ దశలో ఉండే భయం మనల్ని ముందే ఓడించేస్తుంది. సో ఉద్యోగాన్వేషణలో మొదటి స్టెప్‌ పడాల్సిందిక్కడే. భయాన్ని వీడి, ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇంటర్వ్యూ సమయంలో మన హావభావాలు, కాన్ఫిడెన్స్‌ అంతా ఆ కొన్ని క్షణాల మన బిహేవియర్‌తోనే బయటపడే అవకాశాలున్నాయి. అందుకే ఇక్కడ మన కాన్ఫిడెన్స్‌కి తగిన ప్రెజెన్స్‌ పర్‌ఫెక్ట్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. మరీ హైపర్‌ యాక్టివ్‌గా కనిపించకూడు. అలా అని మరీ డల్‌గానూ కనిపించకూడదు. ఇంటర్వ్యూ సమయంలో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జాబ్‌ కొట్టడానికి ఒక స్టెప్‌ని సక్సెస్‌ఫుల్‌గా వేసేసినట్లే!

ఇకపోతే జాబ్‌ సెర్చింగ్‌లో ఉన్న యువత, తాము ఎంచుకున్న రంగంపై పూర్తి అవగాహనతో ఉండాలి. అప్పటికే సదరు రంగాల్లో స్థిరపడిన ఉద్యోగుల నుండి కొన్ని సలహాలు, సూచనలు తీసుకోవాలి. రంగం ఏదైనా ఇప్పుడు ఆయా ఉద్యోగాల్లో క్రియేటివిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో విద్యార్ధులు ఈ విషయాన్ని ముందుగా గమనించి, తాము ఎంచుకున్న రంగానికి సంబంధించి, సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టేలా తమ ఆలోచనా సరళిని పెంపొందించుకోవాలి. మల్టీ టాలెంట్‌డ్‌ అనిపించుకుంటే, అందిపుచ్చుకునే ఉద్యోగావకాశాలు ఎక్కువన్న విషయం గమనించుకోవాలి. జాబ్‌ సెర్చింగ్‌ మొదలు పెట్టే ముందే ఆయా విషయాల్లో కనీస అవగాహనతో పాటు, వీలైతే ఎక్స్‌ట్రా నాలెడ్జ్‌నీ కలిగి ఉండాలి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా. ఆయా మార్పులకు అనుగుణంగా ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతోన్న టెక్నాలజీని అందుకునేందుకు నేటి యువత టెక్నాలజీతో సమానంగా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆయా విషయాలపై అవగాహన తప్పనిసరి.

ఐటీ రంగం విషయానికొస్తే, ఇంజినీరింగ్‌ కంప్లీట్‌ చేస్తే చాలు ఐటీ రంగంలో ఉద్యోగాలకు కొరతే లేదు.. అలాగే ఎక్కువ జీతం. ఇక లైఫ్‌ సెటిలైపోయినట్లే అని భావించే రోజులు కావివి. ఐటీ రంగంలో రోజుకో కొత్త మార్పు ఐటీ నిపుణుల్ని, నిరంతర విద్యార్ధులుగా మార్చేస్తోంది. ఐటీలో జాబ్‌ కొట్టడం అంత సులువైన మార్గమేమీ కాదు. ఇంజనీరింగ్‌ పూర్తయిపోయింది కదా, ట్రై చేస్తే ఉద్యోగం గ్యారంటీ అనుకుని చేతులు ముడుచుకుని కూర్చోవడం మంచిది కాదు. క్రియేటివిటీని పెంచుకునే దిశగా, వీలైనంతలో అవకాశమున్నంత నైపుణ్యాన్ని, జాబ్‌ సెర్చింగ్‌కి ముందే మన మెదడులో సిద్ధం చేసి పెట్టుకోవాలి. అంతేకాదు జీవితకాలం పాటు నేర్చుకునే సామర్ధ్యాన్ని ముందుగానే యువత నిక్షిప్తం చేసి ఉంచుకోవాలి. ఎందుకంటే నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ అనే విషయాన్ని యువత మర్చిపోకూడదు. సో డియర్‌ యూత్‌! జాబ్‌ సెర్చింగ్‌ టైంలోనే పైన చెప్పిన ఆయా విషయాలపై కనీస అవగాహన కలిగి ఉంటే, ఏ రంగంలోనైనా జాబ్‌ కొట్టగలమన్న కాన్ఫిడెన్స్‌ ఖచ్చితంగా పెరుగుతుందనడం నిస్సందేహం. 

మరిన్ని యువతరం