గత కొన్ని రోజులుగా స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా 'అ'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్‌ని కూడా కొత్తగానే ప్రిపేర్ చేశారు. ప్రశాంత్ వర్మ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బ,అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శన్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. 'ఇది నా డైరీలో చివరి ఎంట్రీ.. నేనీ రోజు మాస్ మర్డర్ చేయబోతున్నా..' అంటూ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. పరిచయం చేసినట్లుగానే ప్రతీ పాత్రనూ అంతకన్నా కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు ట్రైలర్‌లో. క్యారెక్టర్స్‌ని ప్రమోట్ చేసిన విధానానికి వస్తున్న రెస్పాన్స్ అదరిపోతోంది.
ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో సరికొత్త అనుభూతినిచ్చింది 'అ' ట్రైలర్. చాలా ఎఫెక్టివ్‌గా రిచ్‌గా కనిపిస్తోంది. నాని ఈ సినిమాలో ఓ చేప పాత్రకు వాయిస్ ఇచ్చాడు. 'చేపలకు కూడా కన్నీళ్లుంటాయ్ బాస్.. కానీ నీళ్లలో ఉంటాం కదా కనిపించవంతే..' అని నాని చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. మాస్ రాజా రవితేజ ఈ సినిమాలో ఓ చెట్టు పాత్రకు వాయిస్ ఇచ్చాడు. ప్రతీ పాత్ర సినిమాకి అత్యంత కీలకమనే విషయం తెలుస్తోంది ట్రైలర్ ద్వారా. అయితే కాజల్ రోల్ కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తోంది. బహుశా కాజల్‌ది నెగిటివ్ రోల్ కావచ్చని ట్రైలర్ చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే కాజల్‌కిది కెరీర్‌లో బెస్ట్ ఛేంజ్ ఓవర్ అవుతుందనడంలో సందేహం లేదు. అలాగే ప్రతీ క్యారెక్టర్, ఆశ్చర్యంతో కూడిన ప్రత్యేకత ఏదో సంతరించుకుందీ సినిమాలో. అయితే ఏ పాత్ర ఇంపార్టెన్స్ ఎంతనేది సినిమా చూస్తే కానీ తెలీదు. ఫిబ్రవరి 16న 'అ' ప్రేక్షకుల ముందుకు రానుంది.
|