1. బడ్జెట్ లో అన్యాయం, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, తెలుగు రాష్ట్రాలను చిన్న చూపు చూడడం మోడీ ప్రభుత్వం చేసిన, చేస్తున్నది పెద్ద తప్పు. ఇలాంటి పరిస్తితుల్లో ప్రశ్నించేందుకు పవన్ కళ్యాణ్ లాంటి ఒక శక్తి అవసరం. రాబోయే రోజుల్లో పవర్ స్టార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారనేది నిస్సందేహం.
2. పవన్ మరో రెండు సినిమాలు చేయనున్నారనేది అభిమానులకు సంతోషం కలిగించిన విషయం. రాజకీయ మేధావులకే అయోమయం కలిగిస్తున్న ఈ పరిస్తితుల్లో పవన్ కళ్యాణ్ వేసేవి తప్పటడుగులే అవుతాయి. తిరిగి అన్నయ్యలాగా సినిమాల్లోకే రావాలి. అదేదో అపజయాలెదురుకుని తిరిగొచ్చేకంటే, సినిమాల్లోనే కంటిన్యూ అవుతే అభిమానులు, దర్శకనిర్మాతలు ఎంతో సంతోషిస్తారు.
పై రెండిట్లో ఏది కరెక్ట్?
|