Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Wow, Varma 'Officer'

ఈ సంచికలో >> సినిమా >>

కాలం కాటేసింది: అతిలోక సుందరిని తీసుకెళ్ళిపోయింది

Tragedy shines light on Bollywood pressures

దుబాయ్‌లో జరిగిన తన మేనల్లుడు పెళ్లి కార్యక్రమానికి హాజరైన అతిలోక సుందరి శ్రీదేవి హార్ట్‌ ఎటాక్‌తో మరణించారు అనే వార్త టాలీవుడ్‌ని కుదిపేసింది. అపస్మారక స్థితిలో బాత్‌ టబ్‌లో మునిగి శ్రీదేవి కన్ను మూసింది అనే వార్త వినగానే టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా దేశం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. మరణానికి మూడు రోజుల ముందు పెళ్లి వేడుకలో ఉత్సాహంగా కనిపించిన శ్రీదేవి నిర్జీవంగా మీడియాలో కనిపించేసరికి ఆమె అభిమానులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోయారు. అనుమానాస్పద స్థితిలో శ్రీదేవి మరణించడంతో ఎప్పుడూ తన వెన్నంటి తోడు నీడగా ఉండే భర్త బోనీకపూర్‌ని అనుమానించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే శ్రీదేవి మరణం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదనీ, ప్రమాదవశాత్తూ బాత్‌ టబ్‌లో మునిగి శ్రీదేవి ప్రాణాలు విడిచారంటూ దుబాయ్‌ పోలీసులు ధృవీకరించారు.

సినీ రంగానికి మొట్టమొదటి లేడీ సూపర్‌స్టార్‌ ఆమె. దాదాపు దేశ వ్యాప్తంగా 8 భాషల్లో హీరోయిన్‌గా నటించారు. టాలీవుడ్‌లో అప్పటి అగ్ర హీరోలు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణ, మురళీమోహన్‌ తదితర హీరోలందరితోనూ నటించారు. ఆ తర్వాతి జనరేషన్‌లో అగ్రహీరోలైన చిరంజీవి, వెంటేష్‌, నాగార్జున తదితర హీరోలతో నటించారు. ఒక్క బాలకృష్ణతో మాత్రమే ఆమె నటించలేదు. అలాగే బాలీవుడ్‌లోని నాటి తరం అగ్రహీరోలతోనూ ఆ తర్వాతి తరం అగ్రహీరోలతోనూ శ్రీదేవి నటించారు.. అలాగే తమిళంలో కమల్‌హాసన్‌ తదితర హీరోలతోనూ నటించి అగ్ర నటిగా పేరు తెచ్చుకున్నారు. అందంలో నిజంగా దేవకన్యే. నటనలోనూ ఆమెని మించినవారే లేరు ఆమె వయసు 54 ఏళ్లు. ఈ మధ్యనే సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు. చిన్న వయసులోనే అందాల తార శ్రీదేవి మరణం అందర్నీ తీవ్రంగా కలచి వేసింది. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam