Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
youth new trend in weekends

ఈ సంచికలో >> యువతరం >>

చిన్నబొమ్మా చులకనగా చూడకమ్మా.!

short flim tecnology

'షార్ట్‌ ఫిలిం' ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. సినిమాల కన్నా, ఇప్పుడు షార్ట్‌ ఫిలింస్‌నే జనం ఎక్కువ ఇష్టపడుతున్నారు. తక్కువ ఖర్చుతో తక్కువ ఎక్విప్‌మెంట్స్‌తో, తాము అనుకున్న ఆలోచనకు ఈజీగా దృశ్యరూపం ఇచ్చి, తద్వారా ఓ మంచి మెసేజ్‌ని చాలా ఈజీగా జనంలోకి పాస్‌ చేస్తున్నారు. ఎంత క్రిటికల్‌ కాన్సెప్ట్‌ అయినా షార్ట్‌ ఫిలిం ద్వారా సింపుల్‌గా జనంలోకి వెళ్లేలా చేస్తున్నారు. షార్ట్‌ ఫిలింస్‌తో యూతే కాదు, ఇప్పుడు పాఠశాల స్థాయి విద్యార్ధులు కూడా విశేషంగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు.

చిన్న బొమ్మే కదా అని అస్సలు చులకన చేసేందుకు లేదు. సినిమాల కన్నా ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి ఈ షార్ట్‌ ఫిలిమ్స్‌. సాంకేతిక పరిజ్ఞానం బాగా విస్తరించిన నేటి తరుణంలో సినిమాల కన్నా షార్ట్‌ ఫిలిమ్సే ఎక్కువ శక్తివంతంగా మారుతున్నాయి. అందుకే స్కూల్‌ స్టడీస్‌ నుండి విద్యార్ధులు షార్ట్‌ ఫిలిమ్స్‌పై ఆశక్తి చూపుతున్నారు. ఆశక్తి చూపడమే కాదు, వారి చిన్న చిన్న మెదడుకు పదును పెట్టి, తమలోని టాలెంట్‌ని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.

నేటి ఫిలిం ఇండస్ట్రీ విషయానికి వస్తే, ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతోన్న పలువురు యంగ్‌ డైరెక్టర్లు షార్ట్‌ ఫిలిం మేకర్స్‌గా గుర్తింపు పొందిన వారే. షార్ట్‌ ఫిలిమ్స్‌ ద్వారా సత్తా చాటి, తద్వారా ఫిలిం మేకింగ్స్‌ ఛాన్సెస్‌ అందుకుంటున్నారు. స్టార్‌ హీరోలతో ఫిలిమ్స్‌ డైరెక్ట్‌ చేసే గొప్ప గొప్ప ఛాన్సెస్‌ని అందుకుంటున్నారు.

అయితే షార్ట్‌ఫిలిమ్స్‌ అంటే బూతు సినిమాలే అన్న బ్యాడ్‌ నేమ్‌ ఒకింత ప్రచారంలో ఉంది. కానీ అది తప్పు. అద్భుతాలు సృష్టించిన షార్ట్‌ఫిలిమ్స్‌ అనేకం ఉన్నాయి. అయితే కొంతమంది, బూతును ఎక్కువగా మెయిన్‌ ఎలిమెంట్‌గా తీసుకోవడం వల్ల, మొత్తం షార్ట్‌ఫిలిమ్స్‌కి ఇలాంటి చెడ్డ పేరు వస్తోంది. అందుకే ప్రియమైన యువతలారా! మీరు రూపొందించే షార్ట్‌ ఫిలిమ్స్‌ సమాజంలో మంచి ని ప్రేరేపించేలా ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. బూతును పారద్రోలండి. చెడుకు అవకాశమివ్వకండి. సమాజంలో పేరుకుపోయిన అనేక అన్యాయాలను ఎండగట్టేలా ఇన్‌స్పైరింగ్‌గా రూపొందించబడ్డ అనేక షార్ట్‌ఫిలిమ్స్‌ సోషల్‌ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, కుటుంబ బంధాలను ఆదర్శంగా తీసుకుని, మానవ సంబంధాల మధ్య ప్రేమలు, ఆప్యాయతలను పెంపొందించే కాన్సెప్ట్స్‌తో రూపొందిన లఘుచిత్రాలు కూడా ఉన్నాయి.

ట్రాఫిక్‌ అవగాహనలు, మహిళలపై లైంగిక దాడులు, పరిష్కారాలు, అందం, ఆరోగ్యం ఇలా ఒక్కటేమిటీ కాదేదీ షార్ట్‌ఫిలిమ్‌కనర్హం. అన్న చందంగా కుప్పలు తెప్పలుగా షార్ట్‌ఫిలిమ్స్‌ సోషల్‌మీడియాలో అందుబాటులో ఉంటున్నాయి. ఏది ఏమైనా గుర్తుంచుకోవల్సిన అంశం, మీరు తీసే ఈ చిన్న బొమ్మ సమాజాన్ని ప్రభావితం చేయడంలో ఎంత పెద్ద పాత్ర వహిస్తుందో ఆ దిశగా ఆలోచన చేయండి.

మరిన్ని యువతరం