Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
connecting everything

ఈ సంచికలో >> యువతరం >>

సమ్మర్‌ వెకేషనా? బీ కేర్‌ఫుల్‌.!

be careful

సమ్మర్‌ అనగానే యువత పోటీ పరీక్షలు, స్టడీస్‌కి అదనంగా వివిధ కోర్సుల్లో శిక్షణ వంటి అంశాలపై దృష్టి పెట్టడం మామూలే. అదే సమయంలో ఏడాదంతా, చదువుల్లో మునిగి తేలిన యువత ఓ నెల రోజులు కంప్లీట్‌గా రిలాక్స్‌ అవ్వాలనుకోవడం కూడా సహజమే. వారం నుండి నెల రోజుల వరకూ వారి వారి అనుకూలతల్ని బట్టి వెకేషన్స్‌ని ప్లాన్‌ చేసుకుంటుంటారు. యూత్‌ వెకేషన్స్‌ని ప్లాన్‌ చేయడం అంటే, అది ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తోనే. ఈ గ్యాంగ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండడం నయా ట్రెండ్‌. ఇక్కడే కూసింత కేర్‌ తీసుకోవాల్సిన పరిస్థితిని యువత గమనించుకోవాలి. 

సమ్మర్‌ వెకేషన్స్‌లో భాగంగా లాంగ్‌ టూర్స్‌కి వెళ్లే వారు, అత్యంత సన్నిహితులైనా సరే అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ వెకేషన్‌ని కొంతమంది నాలెడ్జ్‌ టూర్స్‌గా మార్చుకుంటుంటే, కొంతమంది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌గానే వాడుతున్నారు. ఏ టూర్‌ అయినా, వ్యక్తిగతంగా ఎవరికి వారు కొన్ని హద్దుల్ని గీసుకోవడం మంచిది. ఎంత ఎలాంటి బలహీన క్షణాలైనా ఆయా హద్దుల్ని మీరకుండా ఉంటే వారికీ మంచిది. వారి వెనకున్న కుటుంబానికీ మంచిది. ఈ జాగ్రత్త అనేది లైంగిక పరమైన జాగ్రత్త మాత్రమే కాదు, ఆరోగ్యం దగ్గర నుండి, ఇతరత్రా అన్ని విషయాల మీద శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత ఉంది. 

తాము ఎక్కడికి వెళ్తున్నాము, ఏ కారణం కోసం తమ టూర్‌ ప్లాన్‌ చేసుకున్నామనే సమాచారాన్ని తల్లితండ్రులకు తెలియచేసి, వారి అనుమతితో వెళ్లడం ఉత్తమం. ఈ మాట నేటి తరం యువతకు కొంత నచ్చుబాటు కాకపోవచ్చు. అయినప్పటికీ, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందుల బారిన పడకుండా ఉండాలంటే, ఈ చిన్నపాటి జాగ్రత్త తీసుకోవడం తప్పదని యువత గ్రహించాలి. ముందుగా ఎక్కడికి వెళ్తున్నామో, అక్కడి పరిస్థితులు ఎలాంటివో అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా ఎత్తైన కొండలు, సముద్రతీరాలు, జలాశయాలు వంటి డేంజరస్‌ ప్రదేశాల దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్‌ యంత్రాంగం సహాయం తీసుకోవాలి. అందుకు ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. 

ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్‌స్టెంట్‌ ఫుడ్‌ కొంత తమతో పాటే, ఉంచుకోవాలి. సొంత వాహనాల్లో ప్రయాణం అంత మంచిది కాదు. మద్యానికి దూరంగా ఉంటే చాలా మంచిది. ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం టూర్స్‌కి వెళ్లే మందే గ్రూప్స్‌ ఒకరికొకరు సహకరించుకునేలా ఉండాలని ఓ నిర్ణయానికి వచ్చి, టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే మంచిది. పై జాగ్రత్తలు, మెలకువలు పాఠించి, సమ్మర్‌ వెకేషన్‌ని హాయిగా ఎంజాయ్‌ చేయండి.

మరిన్ని యువతరం