Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

మీ 'చిత్రమ్‌' మిమ్మల్ని చంపేస్తుంది.!

technology hackers

చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ దానికో ఇంటర్నెట్‌ కనెక్షన్‌. ఇంకేముంది ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే. కానీ గుప్పిట్లో ఉండాల్సిన మన గుట్టు క్షణాల్లో ప్రపంచమంతా పాకేస్తోంది. ఎందుకిలా? ఎవడు చేసిన కర్మ వాడే అనుభవించాలి.. అన్నది వెనకటి మాట. తప్పు మనది కాకపోయినా చిన్న పొరపాటు కారణంగా శిక్ష అనుభవించాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఇది మరణ శిక్ష కూడా అవుతోంది. అది మనకు మనం విధించుకుంటున్న మరణ శిక్ష అవుతుండడం దురదృష్టకరం. ఫోనేంటీ.? మనల్ని మనం చంపుకునేలా చేయడమేంటీ..? ఫోటో లేదా వీడియో మనల్ని చంపేయడమేంటి? అసలేం జరుగుతోంది.? 

ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ లేకపోవడం మనిషి ప్రాణాలతో లేకపోవడం రెండూ ఒక్కటే అనే తేలిక భావన చాలా మందిలో కనిపిస్తోంది. దీంతో స్మార్ట్‌ ఫోన్‌ వాడకం పెరిగిపోయింది. సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు తీయడం, వాటిని సోషల్‌ మీడియాలో పెట్టి స్నేహితుల నుండి స్పందన రాబట్టడం, ఓ ఫ్యాషన్‌ అయిపోయింది. ఈ క్రమంలో గుప్పిట్లో ఉండాల్సిన వ్యక్తిగత సమాచారమ్‌ బహిర్గతం అయిపోయింది. ప్రైవేట్‌ మూమెంట్స్‌ కూడా ఇంటర్నెట్‌లోకి ఎక్కేస్తున్నాయ్‌. అట్నుంచి అవి అశ్లీల వెబ్‌సైట్స్‌లో కొలువు దీరుతున్నాయి. ఆ విషయం మనకు తెలిసేటప్పటికి ప్రపంచం అంతా చుట్టేస్తోంది. ముఖం మనదే, శరీరం మనది కాదు. కానీ దాన్ని నిరూపించుకోవడంలో అవకాశం లేదు. ఇంకేముంది? అవమానం. ఆ తర్వాత తీసుకోవడమే ప్రాణం. 

15 నుండి 35 ఏళ్ల లోపు వారికి ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటోంది. ఇంట్లో వారికి తెలిసిపోతుందేమో, పరువు పోతుందేమో అన్న భయం ప్రాణాల మీదకు తెస్తోంది. ఫోటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడమే పెద్ద నేరమైపోతోంది. అలా మన ఫోటోను ఎవరో కాపీ చేసేయకుండా ఉండడానికి పలు మార్గాలున్నాయి. కానీ అవేమీ పూర్తిగా మన సమస్యల్ని పరిష్కరించలేవు. కాబట్టి ఫోటోలు, వీడియోల్ని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేయాలనుకునే ముందే ఒకటికి పది సార్లు కాదు, వంద సార్లు ఆలోచించుకోవాలి. ఇంకో అతి ముఖ్య విషయం ఏంటంటే మన ఫోన్‌లోని కెమెరా మన ప్రమేయం లేకుండా ఫోటోల్ని వీడియోల్ని చిత్రీకరించేస్తోంది. ఆ తరహా చెడు టెక్నాలజీని హ్యాకర్స్‌ వినియోగిస్తున్నారు. సో బీ కేర్‌ఫుల్‌. 
'ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దేన్‌ క్యూర్‌'. రోగం వచ్చాక మందు వేయడం వల్ల ప్రయోజం లేదు. రోగం రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందే. ఇది టెక్నాలజీ రోగం. మరి దీనికి మందేదీ.!

మరిన్ని యువతరం
Do you love heart