Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu by Sairam Akundi

ఈ సంచికలో >> శీర్షికలు >>

వంటిల్లు: గుమ్మడికాయ దప్పళం - పి. శ్రీనివాసు

Recipe: Gummadikaaya Dappalam

కావలసిన పదార్థాలు:
గుమ్మడికాయ, చిలగడ దుంపలు, వంకాయ, ఉల్లిపాయ, వెల్లులి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, చింతపండు, పసుపు, ఉప్పు, కారం, పోపు దినుసులు

తయారు చేయు విధానం:
ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిరపకాయల్ని కలిపి ముద్దగా చేసుకోవాలి. బాణీ లో నూనె పోసుకొని అందులో ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోవాలి. అది కొద్దిగా వేగాక, అందులో గుమ్మడికాయ ముక్కలు, వంకాయ ముక్కలు, చిలగడ దుంప ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒక నిమిషం మగ్గాక,  చింతపండు పులుసు పోసుకోవాలి. అందులో బెల్లం వేసుకొని, ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి. ముక్కలు బాగా ఉడికాక కొత్తిమీర వేసుకొని, పోపు పెట్టుకుంటే, రుచికరమైన గుమ్మడికాయ పులుసు (గుమ్మడికాయ దప్పళం) రెడీ

మరిన్ని శీర్షికలు