Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

మాంసాహారం వల్ల మానసిక వత్తిడి కలుగుతుందా.. - ..

stress-happens-with-non-veg-

మీరు తినే ఆహారం విషయానికి వస్తే మాంసాహారం కంటే శాకాహారం మీ  వ్యవస్థకి చాలా మెరుగైనది. ప్రపంచవ్యాప్తంగా కూడా వైద్యపరంగా ఈ అవగాహన పెరుగుతోంది కదా!! కానీ మన భారతీయులం ఈ విషయం ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాం. రెండు వేల సంవత్సరాల క్రితమే మహావీరుడు ‘‘మీరు జంతువుల మాంసం తింటే, ఆ జంతువుల లక్షణాలు మీలో ప్రవేశిస్తాయని” చెప్పాడు. దానికి ప్రజలు నవ్వారు. “నేను కోడి తిన్నాను. అంటే కోడిగా మారతానా?” అన్నది వారి వాదన. ఈ రోజు మన శాస్త్రవేత్తలు అదే విషయాన్ని ఇంకో విధంగా చెబుతున్నారు. ఒక జంతువుని మీరు చంపుతున్నప్పుడు మీరు ఎంత క్రూరంగా దాన్ని చంపుతున్నారనే విషయం అటుంచితే, చంపడానికి కొన్ని క్షణాల ముందు ఆ జంతువుకి దానిని చంపబోతున్నారని తెలుస్తుంది.

 

మీరు మీ మనస్సుకి సాక్షీభూతంగా ఉన్నట్లైతే, మీరు మీ మనస్సు చర్యకు అతీతంగా ఉన్నట్లైతే, మీకు అసలు బాధ అన్నదే ఉండదు.

 

ఒక వేళ, మీకే అలా జరగబోతోందనుకోండి. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకి మిమ్మల్ని చంపబోతున్నాం. మీలో ఏం జరుగుతుంది? విపరీతమైన వత్తిడి!!!.ఔనా కాదా? గోడలేక్కేస్తారు, పిచ్చెక్కిపోతారు. ఆరు గంటలకు మిమ్మల్ని చంపేస్తామంటే మీకు తెలుసు ఏం జరుగుతుందో. మనసులో వత్తిడి (tension) ఉన్నప్పుడు మీ శరీర కణజాలంలో ఆమ్ల లక్షణం పెరిగిపోతుంది. మీకీ విషయం తెలిసిందే, మీ మనసులో వత్తిడి ఉన్నప్పుడు , కడుపులో మంటగా ఉన్నట్టు ఉంటుంది.. మీరు గమనించారా? మీ మనసులో వత్తిడి ఉన్నప్పుడు, కేవలం పొట్టలోనే కాదు, మీ శరీరంలోని ప్రతి కణంలో ఆమ్లం అమాంతం పెరిగిపోతుంది. కాబట్టీ మీరు చంపబడుతున్నారన్నప్పుడు మీరు ఎలాంటి వత్తిడికి లోనౌతారో మీరు ఉహించగలరు. జంతువుకి కూడా అదే జరుగుతుంది. దాని శరీరంలో ఆమ్లం అమాంతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే “మీరు చంపబడ్డ జంతువు శరీరంలో ఉన్న ఆమ్లాలను తింటే వాటిలో ఉన్న వత్తిడిలు అన్నీ మీలో కూడా పుడతాయి - ఏ కారణం లేకుండానే.

(ఇషా ఫౌండేషన్ సౌజన్యంతో...)

మరిన్ని శీర్షికలు
pratapabhavalu