Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

నేనింతే మారేది లేదంతే.!

nenimte maredi ledante

ఉరకలేసే ఉడుకు రక్తం సవాళ్లను ఇష్టపడడం కొత్తేం కాదు. సమాజానికే సవాల్‌ విసురుతుంటుంది ఒక్కోసారి ఈ ఉడుకు రక్తం. చాలా వరకూ తానేంటో సమాజానికి చూపించాలని కసి, పట్టుదలతో యువత కనిపిస్తుంటుంది. మారుతున్న సమాజం ఎప్పటికప్పుడు యువతకు సవాల్‌ విసురుతూనే ఉంది. సవాల్‌ స్వీరకరించకపోతే యువతరే అర్ధమే లేదు. చేసే పని మంచిదైనప్పుడు, ఆ పని పట్ల పూర్తి స్పష్టత ఉన్పన్పుడు ఎవరైనా వెనక్కి లాగితే, ఆ లాగుడు వ్యవహరాన్ని లెక్క చేయాల్సిన పనిలేదు. ఇలాంటి ఆటిట్యూడ్‌నే ఇప్పుడంతా ఆర్జున్‌రెడ్డి పాత్రతో పోలుస్తున్నారు. కానీ అది సినిమా. సినిమా వేరు. ఆ కథ వేరు. జీవితం వేరు. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం రఫ్‌ అండ్‌ టఫ్‌గా ఎవరు కనిపించినా అర్జునరెడ్డి అనేస్తున్నాం. అమ్మాయిలు కూడా ఈ ఆటిట్యూడ్‌కీ, పేరుకీ తక్కువేం కాదు. లేడీ అర్జున్‌రెడ్డి అనిపించే సుకుంటున్నారు  సింపుల్‌గా. సినిమా సంగతి పక్కన పెడితే సాధించాలన్న తపనే యువతను సక్సెస్‌ వైపు పరుగులు పెట్టిస్తోంది. 
మంచి పని చేస్తున్న వాడిని వెనక్కి లాగాల్సిన పనేముంది.? కానీ ఒక్కోసారి ఈ అతివిశ్వాసం కొంపలు ముంచేస్తోంది. యువతను పక్కదారి పట్టించేస్తోంది. అదే పెను ప్రమాదాలకు అవకాశం కల్పిస్తోంది. ఎవడైతే నాకేంటి? అనే ఆటిట్యూడ్‌తో పాటు, డీవియేషన్‌లోకి వెళ్లిపోతున్నానా అనే క్రాస్‌ చెక్‌ కూడా చాలా అవసరం. ఉద్యోగం కావచ్చు. వ్యాపారం కావచ్చు.

సరికొత్త ఆవిష్కరణ కావచ్చు. ఏదైనా కావచ్చు. స్టాప్‌ లుక్‌ అండ్‌ ప్రొసీడ్‌.. అనే సూత్రం పాఠించడం తప్పని సరి. ఇతరుల పట్ల కొంచెం రెస్పెక్ట్‌ కొంచెం బాధ్యత మనల్ని గొప్పవారిగా తీర్చిదిద్దుతోంది. ఇవి మన వ్యక్తిత్వానికి అదనపు ఆకర్షణలే తప్ప చిన్నతనం కాబోవు. యువత నేర్యుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలివి. ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా ఇది బాగా ఉపయోగ పడుతుంది. కానీ మంచి ఆలోచనల వైపు అడుగులు వేసే యువత ఒక్కోసారి అతి ముఖ్యమైన ఈ ఇన్‌గ్రీడియంట్‌ మిస్‌ అవుతోంది. ఏ పనైనా సాధించాలనుకుంటే, దానికి స్కెచ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. ఆ స్కెచ్‌కి రూపకల్పన చేసేటప్పుడే అన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఒకరికి ఒక ఆటిట్యూడ్‌ వర్కవుట్‌ అయ్యిందని ఇంకొకరు దాన్నే ఫాలో అయితే బొక్క బోర్లా పడాల్సి వస్తుంది. ఎవరి ఆటిట్యూడ్‌ వారిది. ఎవరి ఆలోచన వారిది. ఎవరి లక్ష్యాలు వారివి. వీటిలో ఇంకొకరిని ఇమిటేట్‌ చేయడం భావ్యం కాదు. అలా అని ఒకరు ఎక్కువా ఇంకొకరు తక్కువా కూడా కాదు. మెరగైన అత్వవిశ్వాసం, మెరుగైన ఆలోచనా విధానం మెరుగైన అతప్రమత్తత ఉంటే, అద్భుతమైన విజయాలకు దారి సులభమవుతుంది. ఈ చిన్న విషయాన్ని గమనించి యువత అడుగులు వేస్తే ఆకాశమంత అద్భుతాలు ఆవిష్కృతం కావడం తథ్యం.

మరిన్ని యువతరం
No aging, 70 years old.