Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

మీ టూ' యుద్ధానికి అటూ ఇటూ.!

Your to 'fight to war!

మన కళ్లెదుటే ఓ నిండు ప్రాణాన్ని పాత కక్ష్యలు అతి కిరాతకంగా బలిగొంటే కళ్లప్పగించి చూసి, ఏమీ చేయలేక చోద్యం చూస్తున్నాం. పొద్దున్న లేస్తే అత్యాచారం, హత్య వార్తలే కనిపిస్తున్నాయి. నెలల చిన్నారి నుండి వృద్ధ మహిళ దాకా వయసుతో సంబంధం లేదు, అందరూ అత్యాచార బాధితులే. స్కూళ్లకు పంపించాలంటే భయం. ఇంటి ఎదురుగా ఆడుకోనివ్వాలంటే భయం. ఉద్యోగం భయం, ఇంకో చోట ఇంకో భయం. అతివలకు లేదెక్కడా భద్రం.? దేశంలో అర్ధరాత్రి ఆడది ఒంటరిగా స్వేచ్చగా, ధైర్యంగా నడవగలిగిన రోజు అసలు సిసలు స్వాతంత్య్రం వచ్చినట్లు అని మహాత్ముడు చెప్పాడు. కానీ స్వాతంత్య్రమూ వచ్చింది. మహిళలూ, స్వేచ్చగా ధైర్యంగా తిరుగుతున్నారు. కానీ ఈ అఘాయిత్యాలు మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ధైర్యం దారి ధైర్యందే. భయం దారి భయందే. అఘాయిత్యాల దారి అఘాయిత్యాలదే..ఎవరిది తప్పు.? ఎవరిది నేరం.? ఏం చేయగలం మనం.?

పదేళ్ల కిందట ఓ సినిమా షూటింగ్‌లో తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తనూశ్రీ దత్తా అనే బాలీవుడ్‌ నటి తాజాగా ఆరోపించడం సంచలనమైంది. టాలీవుడ్‌లో శ్రీరెడ్డి, మాధవీలత, చిన్మయి ఇలా మరికొందరు సినీ పరిశ్రమలోని లైంగిక వేధింపులకు గళం విప్పారు. తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలు లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరయ్యాయి. సినీ పరిశ్రమ మాత్రమే లైంగిక వేధింపులకు అడ్డాగా మారుతోందా.? కానే కాదు. సమాజంలో అన్ని చోట్లా ఉన్నట్లే ఇక్కడా లైంగిక వేధింపులున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతిపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. ఆ నిర్భయ ఘటన దేశమంతా ప్రకంపనలు సృష్టించింది. దాంతో నిర్భయ చట్టం అమలులోకి వచ్చింది. కానీ ఆ తర్వాత దేశంలో అఘాయిత్యాలు పెరిగాయి తప్ప తగ్గలేదు. స్కూళ్లు, కాలేజీలు, పని చేసే ప్రాంతాలు ఇలా ఎక్కడా మహిళకు భద్రత లేదు. భద్రత కల్పించాల్సిన పోలీస్‌ వ్యవస్థలోనే లైంగిక వేధింపుల ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

లైంగిక వేధింపులు అంటే బాధితులు మహిళలు మాత్రమే కానక్కర్లేదు. మగవాళ్లు కూడా బాధితులే. ట్రెండ్‌ మారింది. మగమహారాజులు కూడా 'మీటూ' ఉద్యమంలో చేతులు కలపాలేమో. చెప్పుకుంటే పరువు పోతుందనీ చాలా మంది మగాళ్లు ఈ సమస్య గురించి బయట పడట్లేదు. ఓ సర్వే ప్రకారం ఇక్కడ జెండర్‌ ఈక్వాలిటీ చాలా స్పష్టంగా ఉందని తేలిందట. అంటే లైంగిక వేధింపులు మహిళల మీద ఎలా జరుగుతున్నాయో, మగాళ్ల మీదా అలాగే జరుగుతున్నాయి. మహిళలకు మహిళలు శత్రువులవుతున్నారు. పురుషులకు పురుషులు శత్రువులవుతున్నారు. 12 ఏళ్ల బాలుడిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం జరిపిన ఘటనల గురించి వింటున్నాం. పని ప్రదేశాల్లో లేడీ బాస్‌ తన కింద పని చేసే మహిళను లైంగిక వేధింపులకు గురి చేయడం గురించి వింటున్నాం. స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్మానించుకున్నాక ఇలాంటి వాటిని నేరాలుగా ఎలా పరిగణించగలం.? ఎలా అరికట్టగలం.? 'మీటూ' బాధితులు మహిళలు మాత్రమే కాదు, పురుషులు కూడా. వేటు పడాల్సింది పైశాచికత్వం మీద మృగాడు అనో, ఆడ పిశాచి అనో ఒక్కర్నే నిందించడంలో అర్ధం లేదు.

మరిన్ని యువతరం
This Is 'Kilpi': 'Selfie' with the Death