Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

కత్తిలాంటి అమ్మాయ్‌ టచ్‌ చేస్తే అంతేనోయ్‌.!

Touch and see.

ఆకాశంలో సగం, అన్నింటా సగం అయినా 'ఆమె' అంటే చులకన భావం. ఇప్పటికి చాలా మందికి ఇదే ఆలోచన ఉంది. కానీ మారింది మహిళా లోకం. పోరి కత్తిలా ఉంది.. అని కామెంట్‌ వేస్తే కత్తి పదునేంటో చూపించగల తెగువ చూపిస్తోంది మగువ. మగాళ్లతో పోలిస్తే కార్య దక్షత మహిళల్లోనే ఎక్కువని చాలా సర్వేలు తేల్చాయి. బాస్‌ చైర్లో మహిళ ఉంటే ఆ సంస్థ సాధించే ఫలితాలు అద్భుతంగా ఉంటున్నాయని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. అయినా ఆ మహిళకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోతున్నాం. ఈ నేపథ్యంలోనే సాధించగల తెగువ మాత్రమే కాదు, మా ఆత్మగౌరవాన్ని చాటి చెప్పడంలోనూ తెగువ చూపించగలమని నినదిస్తోంది నేటి మహిళా లోకం. 
స్కూల్లో విద్యనభ్యసిస్తున్నప్పటి నుండే అమ్మాయిల ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఏ కాంపిటేటివ్‌ ఎగ్జామ్‌ తీసుకున్నా అమ్మాయిలదే పై చేయి. మార్పుకు ఇదో సంకేతం.

అయినా పురుషాధిక్య సమాజంలో అమ్మాయికి ఏదీ అంత తేలిగ్గా దక్కదు. అదే ఆ కట్టడే అమ్మాయిల ఆలోచనల్ని మరింత వేగంగా పరుగులు పెట్టేలా చేస్తోంది. ఆకాశం అంచుల్ని తాకేస్తాం. సముద్రాల లోతుల్ని పసిగట్టేస్తాం.. అని అమ్మాయిలు తమ ఆలోచనల్ని పరుగులు పెట్టిస్తున్నారు. కాలేజీల్లో గ్రూపులు ఆఫీసుల్లో సమూహాలు ఇలా ఎక్కడికక్కడ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఓ పదివేల క్రితం నాటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ధైర్యే సాహసే లక్ష్మి అంటూ మహిళా లోకం ముందడుగు వేస్తోంది. అద్భుతాల్ని సాధించేస్తోంది.

సోషల్‌ మీడియాలో వేధింపులు కావచ్చు, రాజకీయాల్లో చిన్న చూపు కావచ్చు. విద్యా, ఉద్యోగాల్లో అసమానత కావచ్చు. ఇవన్నీ క్రమ క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. మగాడితో సమానంగా.. కాదు కాదు అంతకుమించి అంటూ ఉపాధి మార్గాల్ని అన్వేషిస్తోంది మహిళా లోకం. స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవడం, పది మందికి ఉపాధి కల్పించే ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడం వాట్‌ నాట్‌.. అన్నింట్లోనూ అమ్మాయిలదే పై చేయి అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పాశ్చాత్య దేశాల్లో ఎప్పటి నుండో ఉన్న ఈ పోకడ ఇప్పుడు మన దేశంలో మరింత ఉదృతమవుతోంది. గడిచిన ఐదారేళ్లలో ఈ కొత్త పోకడ సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఆడది అబల కాదు, సబల. ఆకాశంలో సగం, అన్నింటా సగం కాదు, అంతకు మించి.!

మరిన్ని యువతరం
Responsible youngers