అనేవి ఇప్పటివి కాదు, ఎప్పటి నుండో ఉన్నాయి. టెక్నాలజీపై ఏమాత్రం పట్టులేని కాలంలో కూడా వీడియో గేమ్స్‌కి ప్రాచుర్యం ఉంది. అయితే అప్పటి వీడియో గేమ్స్‌కీ, ఇప్పటి వీడియో గేమ్స్‌కీ ఒక్కటే తేడా. అప్పుడు వీడియో గేమ్స్ అంటే ఏదో కాస్సేపు గేమ్ ఆడి పక్కన పెట్టేసేవారు. జస్ట్ గేమ్‌ని గేమ్‌లానే చూసేవారంతే. కానీ ఇప్పుడు, రియాల్టీగా ఫీలవుతున్నారు. గేమ్‌లో విన్ అయితే ఏదో ప్రపంచాన్నే జయించేసినట్లు ఫీలవుతున్నారు. ఓడిపోయారా జీవితాన్నే కోల్పోయామన్న బాధతో తమని తాము చంపుకోవడం, లేదా ఇతరుల్ని హత్య చేయడానికైనా వెనుకాడడం లేదు. ఓ వర్చువల్ వరల్డ్‌లోకి మనల్ని తీసుకెళ్లిపోతున్నాయి ఈ వీడియో గేమ్స్.
గేమ్‌ని రియాల్టీగా ఫీలయ్యేందుకు వీలుగా రకరకాల యాక్సెసరీస్ అందుబాటులోకి వచ్చేశాయి. కొంత కాలం పాటు ఈ యాక్సెసరీస్ చాలా కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు దాదాపు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. ముఖ్యంగా పిల్లల నుండి స్టార్ట్ అవుతున్న ఈ కల్చర్, మెల్ల మెల్లగా పెద్దలకూ పాకేస్తోంది. పిల్లల్లో మైండ్ పొల్యూషన్‌కి దారి తీస్తోంది. క్రమ క్రమంగా వారిలో హింసా ప్రవృత్తిని అలవాటు చేసేస్తోంది. గేమ్‌ని గేమ్‌లా కాకుండా, రియల్‌గా ఫీలవుతూ, ఓ ట్రాన్స్‌లోకి వెళ్లిపోతున్నారు. ఆ ట్రాన్స్ వారిని పిచ్చివాళ్లలా, సైకోల్లా చివరికి హంతకుల్లా మార్చేస్తోంది.
గతంలో వచ్చిన 'బ్లూ వేల్' తదితర గేమ్స్‌లో మానసికంగా శారీరకంగా తమని తాము హింసించుకుని, చివరికి చంపుకుంటే, తాజాగా ప్రాచుర్యంలో ఉన్న 'పబ్‌జీ' అనే గేమ్ పిల్లల్ని సైతం హంతకుల్లా మార్చేస్తోంది. లేదంటే పిచ్చివాళ్లలా మార్చేస్తోంది. ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగించాలి. కానీ మానసిక రోగాలకు కారణం కాకూడదు. తెలియని డిప్రెషన్‌లోకి నెట్టేస్తున్నాయి ఈ రకమైన మొబైల్, వీడియో గేమ్స్. ప్రధానంగా సెలబ్రిటీస్ ఈ గేమ్స్‌ని ఎంకరేజ్ చేయడంతో వీటికి మరింత పాపులారిటీ వచ్చేసింది. ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఇప్పుడు వినబడే మాట 'పబ్‌జీ'. చేతిలో గన్ పట్టుకుని పరుగెడుతూ కనిపించిన వారినల్లా కాల్చిపడేసే ఈ గేమ్‌ని రియల్ లైఫ్‌లో కూడా పిల్లలు అదే రకంగా ఫీలయితే ఎలా ఉంటుంది చెప్పండి. అదే జరుగుతోంది ఆల్రెడీ. ఇలాంటి గేమ్స్‌కి అదుపు చేయకుంటే, భవిష్యత్తులో చాలా చాలా ప్రమాదాలకు మన చేతులారా మనమే కారణమవుతాం.
ఇక్కడ గమనించాల్సిందేమంటే, గేమ్ తయారు చేసిన వారిని తప్పు పట్టలేం. దానికి ఎడిక్ట్ అవ్వడాన్నే తప్పు పట్టాలి. దేనికైనా లిమిట్స్ ఉండాలి కదా. ఆ లిమిట్స్‌ని ఫాలో చేసేలా చేసే బాధ్యత తల్లితండ్రులపైనే ఎక్కువగా ఉంది. లిమిట్స్ ఉంటే ఏదైనా బాగానే ఉంటుంది. అది ఈ పబ్‌జీ గేమైనా, ఇంకోటైనా. సో బీ అలర్ట్ ఫర్ దిస్ కిల్లింగ్ గేమ్స్.!
|