Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue302/783/telugu-serials/katyayani/katyayani/

 

(గత సంచిక తరువాయి).......కమలాకర్ చాలా పొద్దుపోయాక వచ్చాడు. రాగానే కడిగిన ముత్యంలా కనిపించిన భార్యని చూశాక అతనిలోని మన్మధుడు ఆనంద చిందులేశాడు. చాలా కాలానికి ఆమె అందాన్ని తనివితీరా చూశాడు.

ఆమె దగ్గరగా వెళ్లి గట్టిగా కౌగిలించుకుని, నుదుటితో ప్రారంభించి అన్నిచోట్లా ఆత్రంగా ముద్దులుపెట్టి ’ఇప్పుడే వస్తాను’ అని స్నానానికెళ్లి, సువాసన షాంపూతో తల స్నానం చేసి పంచ, జుబ్బా కట్టుకుని వచ్చాడు.

అతను వచ్చేసరికి కాత్యాయని డైనింగ్ టేబుల్ మీద ఆహార పదార్థాలు వేడి వేడిగా సర్దిపెట్టింది. కళ్లతో ఆమె అందాన్ని నంజుకుంటూ బోజనం చేసి ’నువ్వు కూడా భోజనం చేసి గదిలోకి రా’ అని ఆమె చెవిలో గుస గుసగా చెప్పి గదిలోకి వెళ్లిపోయాడు.

ఆమె పనంతా పూర్తి చేసుకుని అతని గదిలోకి వెళ్లేసరికి పావుతక్కువ పన్నెండయింది.

మాంచి ఆకలిమీద ఉన్న మద సింహంలా ఉన్నాడు. ఆమె రాగానే ఒక్క ఉదుటున మంచం మీదకి లాగి ఆమె మీద పడిపోయాడు.
చాలాకాలానికి వాళ్లిద్దరి మధ్య వెంట్రుకవాసి గ్యాప్ కూడా లేకుండా ఒక్కటైపోయారు.

***

కమలాకర్ అదే ఆఫీసులో జాయిన్ అయ్యాడు.

వాళ్ల జీవితంలో రోజులు మళ్లీ సాధారణ వేగాన్నందుకున్నాయి.

ఒకటి రెండు సార్లు కాత్యాయని భర్తకు మనోహర్ విషయం చెప్పాలనుకుంది. కాని అతను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే మళ్లీ జీవితాలు అల్లకల్లోలమైపోతాయన్న మీమాంశతో పెదాలదాకా వచ్చిన మాటల్ని మింగేసింది.

ఒకరోజు లంచ్ టైం.

మధ్యాహ్నం కమలాకర్ పక్కన విశాల్ కూర్చున్నాడు. వాళ్లిద్దరూ లేట్ గా రావడంతో కేంటీన్ లో ఎవ్వరూ లేరు.

విశాల్ అకౌంట్ సెక్షన్ లో పనిచేస్తాడు. ఇద్దరికీ బాగానే పరిచయం ఉంది.

కాసేపు ఆఫీసు రాజకీయాలు, సినిమాలూ మాట్లాడుకున్నాక "మొత్తానికి మృత్యు ముఖం దాకా వెళ్లి మృత్యుంజయుడిలా భలే తిరిగొచ్చావు బాస్"అన్నాడు విశాల్.

అవునన్నట్టుగా తలూపాడు కమలాకర్.

"ఎక్స్పెండిచర్ చాలానే అయ్యుంటుంది. నాకు తెలిసి నీకు మన కంపెనీ నుంచి గాని, పర్సనల్గా గాని మెడిక్లెయిమ్ ఫెసిలిటీ లేదు. అసలు అవి లేకే కదా అసలు నీకు ట్రీట్ మెంట్ అవుతుందో లేదో అన్న బెంగలో మీ ఫ్యామిలి మెంబర్స్ ఉండెవాళ్లు..అలాంటిది..నీకు మెడికల్ కవర్ ఎలా దొరికింది గురూ" అడిగాడు.

"హాస్పిటల్లో ఛారిటీ ట్రీట్ మెంట్ తో" తనకు తెలిసింది చెప్పాడు కమలాకర్.

"లేదు బాస్, ఆ హాస్పిటల్లో అలాంటిదేం లేదు. నేను సంవత్సరానికి రెండు సార్లు ఆ హాస్పిటల్ అకౌంట్స్ చూడ్డానికి వెళతాను" అన్నాడు.
ఆఖరి ముద్ద తినబోతున్న వాడు ఎందుకో అది సహించక టిఫిన్ బాక్స్ లో వేసేశాడు.

"ఏదేమైన నీకు ట్రీట్మెంట్ జరిగి మళ్లీ బతికి మా మధ్యలోకి వచ్చినందుకు శుభాకాంక్షలు గురూ"అని వెళ్లిపోయాడు విశాల్.
చాలా సేపు అలానే ఆలోచిస్తూండీపోయాడు.

సాయంత్రం ఆఫీసు వదలంగానే..క్యాబ్ మాట్లాడుకుని సరాసరి హాస్పిటల్ కి వెళ్లాడు.

రిసెప్షన్ కి వెళ్లి ‘తనకు జరిగిన ట్రీట్ మెంట్ కు డబ్బు ఎవరు పే చేశార’ని అడిగాడు?

ఆమె అతనికి సంబంధించిన డిటేయిల్స్ తీసుకుని కంప్యూటర్ లో చెక్ చేసి "మిస్టర్ మనోహర్"అంది.

అతని గుండె ఆగినంత పనయింది. తన వైద్యం కోసం అతనెందుకు అంత డబ్బు కర్చు పెడతాడు? కారణం ఏమిటి? ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కిపోయింది.

బయటకొచ్చి ఆటో మాట్లాడుకుని ఇంటికి బయల్దేరాడు.

కమలాకర్ ఆలోచనలు ఎటువంటి పరిస్థితులకు దారితీసాయో తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటవరకు ఆగాల్సిందే...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana