Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

డెడ్లీ క్యాన్సర్‌ అయినా అక్కర్లేదు నజర్‌.!

No deadly cancer

'క్యాన్సర్‌' ఈ మాట వింటేనే భయపడేవాళ్లం ఒకప్పుడు. ఎందుకంటే క్యాన్సర్‌ బారిన పడితే ఇంక అంతే సంగతి, మృత్యు ఒడిలోకి జారుకోవడమే. తప్ప దీనికి నివారణ లేదు. కానీ ఇప్పుడు కాలం మారింది. అన్ని రకాల రోగాలతో పాటు, క్యాన్సర్‌కు కూడా మందు దొరికింది. మందు దొరికింది అనేదాని కన్నా, అవేర్‌నెస్‌ పెరిగింది అనడం సబబేమో. ఈ మహమ్మారి బారిన పడి కూడా, ఎంతో ధైర్యంగా దాన్ని ఎదుర్కొని, తిరిగి తమ జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్న వారెంతో మంది ఉన్నారు. ఎక్కువగా ఈ మధ్య సెలబ్రిటీలు క్యాన్సర్‌ పట్ల అవగాహన కలిగిస్తున్నారు. ప్రముఖ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌, బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌, హీరోయిన్‌ మనీషాకోయిరాల, మమతా మోహన్‌దాస్‌, గౌతమి.. ఇలా తదితరులు క్యాన్సర్‌ మహమ్మారిని ఎదిరించి, కెరీర్‌లో మళ్లీ తమ ప్రయాణం సాఫీగా కొనసాగిస్తున్నారు. తాజాగా ముద్దుగుమ్మ సోనాలీ బింద్రే కూడా క్యాన్సర్‌ని జయించింది.

ఆహ్వానించదగ్గ పరిణామం ఏంటంటే, క్యాన్సర్‌ బారిన పడిన సెలబ్రిటీలు చిరునవ్వుతో ఆ వ్యాధి నుండి బయటపడి తాము అనుభవించిన ఆ బాధను మరొకరు పడకుండా, అవేర్‌నెస్‌ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము సంపాదించిన సంపాదనలో క్యాన్సర్‌ బాధితుల నిమిత్తం కాస్త ఖర్చుపెడుతున్నారు. క్యాన్సర్‌ సోకిందంటే ఇక జీవితం కోల్పోవడమే అని కుంగిపోవడం కాకుండా, ఆత్మస్థైర్యంతో ఆ వ్యాధిని జయించి తిరిగి రావచ్చన్న నమ్మకం కలిగి ఉండాలి. అయితే ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా, మెంటల్‌గా ఎంతో ధైర్యం కావాలి ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు. అసలింతకీ క్యాన్సర్‌ అంటే ఏంటీ.? ఒక కణం ఆ కణమే పుట్టుకకు కారణం. అదే కణం ఈ క్యాన్సర్‌కీ కారణం. అయితే శరీరం పెరుగుదలకు కారణమైన మంచి కణాలను పాడు చేసేసి, ఆ స్థానంలో అనవసరమైన హానికారక కణాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడమే క్యాన్సర్‌. జన్యుపరమైన కారణాలు క్యాన్సర్‌కి 10 శాతం కారణమైతే, మిగిలిన 90 శాతం జీవనశైలే కారణం. 
యంగ్‌ జనరేషన్‌ ఇప్పుడు ఎక్కువగా క్యాన్సర్‌ బారిన పడుతోంది.

అందుకు కారణం పాస్ట్‌ ఫుడ్‌ కల్చర్‌. ఆహారంలో పెస్టిసైడ్స్‌, ప్లాస్టిక్‌ పార్టికల్స్‌ ఎక్కువగా మిళితం కావడంతో యంగ్‌ జనరేషన్‌ ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతోంది. తెలుసుకోవల్సిందేమంటే, ధూమపానం, మద్యపానం తదితర చెడు అలవాట్ల కారణంగా మాత్రమే క్యాన్సర్‌ సంక్రమిస్తుందనేది కూడా అపోహే అవుతుంది. ఎక్కువ శాతానికి ఇది కారణమైనా, జీవనశైలినే ప్రధమ కారణంగా చెబుతున్నారు నిపుణులు. వయసుతో సంబంధం లేకుండా, అలవాట్లతో సంబంధం లేకుండా, క్యాన్సర్‌ మహమ్మారి ఈ జనరేషన్‌ని కబళించేస్తోంది. అందుకే చిన్నతనం నుండే పిల్లలకు చక్కని జీవన శైలిని అలవాటు చేయాలి. సీఫుడ్స్‌, ఆకుకూరలు, సిట్రస్‌ పండ్లూ, సోయా ఉత్పత్తులు, బాదం, వాల్‌నట్స్‌ వంటి డ్రై ఫ్రూట్స్‌తో పాటు చెర్రీస్‌, బ్లూ బెర్రీస్‌, వంటివి క్యాన్సర్‌ కణాలకు యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. ఏది ఏమైనా ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దేన్‌ క్యూర్‌ అనేది మిగిలిన వ్యాధులకు వర్తిస్తుంది. కానీ క్యాన్సర్‌ విషయంలో కొంత అవగాహన, మనోధైర్యం, బతుకు మీద ఆశ, బతుకుతామన్న నమ్మకంతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉంటే, మనోధైర్యం ముందు ఏ వ్యాధీ నిలవలేదని మళ్లీ మళ్లీ నిరూపించొచ్చు. 

మరిన్ని యువతరం
That's why fat!