Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి..... http://www.gotelugu.com/issue307/794/telugu-serials/anveshana/anveshana/

 

(గత సంచిక తరువాయి)..... పథకం ప్రకారమే మీదగ్గర ఉద్యోగంలో చేరాడు. అన్నీ అతననుకున్న పథకం ప్రకారమే అమలు చేసాడు. మీ అందరి కదలికల మీద నిఘా పెట్టాడు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోగలిగేవాడు.

మహాశ్వేతాదేవి తండ్రిగారిని బాగా త్రాగించి ఆ మందులో విషం కలిపాడు మదన్. అప్పుడే మద్యం మత్తులో మహాశ్వేతకి ఒక బిడ్డపుట్టాడని ఆబిడ్డని అనాధ శరణాలయంలో వదిలేసిన్ విషయం మీ తండ్రి గారి ద్వారా తెలుసుకున్నాడు. ఆ కుర్రాడ్ని దత్తత తీసుకున్నాడు. తన కక్ష తీరిన వెంటనే ఇండియా నుండి తీసుకుపోవాలన్నది మదన్ ప్లాన్.

అరకులోయలో మహాశ్వేతమీద అటాక్ చేయించాడు. చనిపోయిందని సంబరపడిపోయాడు. కానీ మహాశ్వేత తాను బ్రతికే ఉన్నానని మేనత్త శోభాదేవితో చెప్పడం మదన్ కి తెలిసిపోయింది. అప్పట్నుండీ మహాశ్వేతను వెంటాడుతూ ఎక్కడ దొరికితే అక్కడ చంపెయ్యమని ఇద్దరు కిరాయి హంతకులను ఆంధ్రా పంపించాడు. మహాశ్వేతని చంపబోయి ఆమె అమ్మమ్మని చంపేసాడు. అందులో ఒకడు నామీద అటాక్ చేసిన బౌన్సర్.

తనకు తెలిసిందంతా విడమర్చి చెప్పాడు ఎస్సై అక్బర్ ఖాన్.

సిమ్హాచలం కొండపైన తను రొట్టెకి జాం రాసి ఇచ్చిన ముసలమ్మ తన అమ్మమ్మ అని తెలియగానే  ఆనందంతో ఉప్పొంగిపోయింది మహాశ్వేత. మరుక్షణం తన కారణంగా అమ్మమ్మ ప్రాణం పోయిందే అని విలవిల్లాడిపోయింది.

అందుకేనా తనని చూస్తూనే గుర్తుపట్టినట్టు " అమ్మా.....తల్లీ....నువ్వేనా అమ్మా" అంటూ పలకరించింది. అమ్మా నేనూ ఒకేలా ఉంటామనేవాడు మానాన్న...అందుకేనా, అయ్యో " అంటూ మూగగా రోదించింది మహాశ్వేతాదేవి.

"అందుకేనా ఆ దొంగ మా శ్యాం ని ఎత్తుకుపోయాడు " ఉక్రోషంగా అన్నాడు రాము.

" మేము ముగ్గురం చిన్నప్పటి నుండి ఒక్కదగ్గరే పెరిగాం...ఒక్కదగ్గరే పడుకునేవాళ్ళం. అందుకే మా వార్డెన్ మా ముగ్గురం ఒక్క వయసు వాళ్ళమని....అన్నదమ్ముల్లా కలిసి మెలిసి తిరుగుతున్నామని రాము, సోము, శ్యాము అని పేర్లు పెట్టి పిలిచేవారు. సోము తలకున్న కట్టుమీద చేయ్యేసి నొప్పిని భరిస్తూ చెప్పాడు.

" సార్! మా అబ్బాయి మా దగ్గరికి ఎప్పుడు చేరతాడంటారు? ? ఉన్నట్టుండి అక్బర్ ఖాన్ కేసి చూస్తూ అడిగాడు  మహాశ్వేత భర్త హరిశ్చంద్రప్రస్దాద్. అక్బర్ ఖాన్ చెప్పేదంతా వింటూ ఏకాగ్రతగా కూర్చున్న మహాశ్వేత గతంలోకి వెళ్ళిపోయి ఏదో ఆలోచిస్తూ శిలలా కూర్చొని ఉన్నదల్లా భర్త హరిశ్చంద్రప్రసాద్ మాటలు వింటూనే ఒక్కసారే ఉలిక్కిపడి చూసింది. సరిగ్గా అదే సమయంల్;ఓ అక్బర్ ఖాన్ సెల్ రింగ్ అయ్యింది.

" జస్టెమినిట్" అంటూ అక్కడినుండి లేచి దూరంగా వెళ్ళి మాట్లాడాడు.మాట్లాడుతూనే ఆనందంగా మహాశ్వేతాదేవి కేసి  చూస్తూ నవ్వుకుంటూ మాట్లాడి సెల్ జేబులో పెట్టుకుంటూ అందరి మధ్యకి వచ్చాడు. ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉన్న అక్బర్ ఖాన్ కేసి అందరూ వింతగా చూడసాగారు.

" మీ అందరికీ ఒక గుడ్ న్యూస్...మీ బాబు శ్యాం దొరికాడు. చెన్నై లోనే నగరానికి దూరంగా మదన్ ఉంటున్ న అపార్ట్ మెంట్ లోనే ఒక గదిలో బంధించి ఉంచాడట. చెన్నై పోలీసులు మదన్ ఫ్లాట్ ని సెర్చ్ చేసి మీ అబ్బాయిని విడిపించుకు వచ్చారట. " సంతోషంగా చెప్పాడు అక్బర్ ఖాన్.

" పదండి సార్.. ఇప్పుడే వెళ్దాం....పదండి " ఆత్రుతగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ అంది మహాశ్వేతాదేవి.

" ఇక్కడితో నా డ్యూటీ అయిపోయింది మేడం...మీరు వెంటనే చెన్నై వెళ్ళండి...పోలీస్ కమీషనర్ గారి సమ్రక్షణలో ఉన్నాడు మీ అబ్బాయి శ్యాం." అంటూ అందరికీ గౌరవపూర్వకంగా నమస్కరించాడు అక్బర్ ఖాన్. మౌనంగా అతడికేసి చూస్తూ కళ్ళల్లో కన్నీళ్ళు దించుకుంది మనోరమ.

********************

హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతం..

అమ్మానాన్న అనాధశరణాలయం. ఆరుబయట గ్రౌండులో పిల్లలందరూ ఆనందంగా గెంతుకుంటూ ఆడుకుంటున్నారు. రాము, సోము, శ్యాములు ముగ్గురూ గెంతుకుంటూ ఆడుకుంటున్నారు. పిల్లలందరూ గుంపులుగుంపులుగా కేరింతల్లో మునిగి తేలిపోయారు.
ఆఫీసులో మహాశ్వేతాదేవి కూర్చొని ఉండి ఆమెకెదురుగా అత్త శోభాదేవి, ఆమె భర్త, ఆమె ఇద్దరు కొడుకులు మహాశ్వేతాదేవి భర్త హరిశ్చంద్రప్రసాద్ మౌనంగా కూర్చొని ఉన్నారు.

" అత్తమ్మా నన్ను క్షమించండి. నేనిక చెన్నై రాలేను. యలమంచిలి గ్రూప్ కంపెనీలకు శాశ్వత చైర్మెన్ గా హరిశ్చంద్రప్రసాద్ గారినే ఎన్నుకుందాం. నేనిక్కడే ఉండి ఈ అనాధ శరణాలయంలో పిల్లల ఆలనా-పాలనా చూసుకోవాలనుకొంటున్నాను. నాకొడుకు శ్యాం కూడా రామూ-సోమూ లతోబాటే ఇక్కడే ఉంటాడు. మీ అందరూ దయచేసి నాకు సహకరించండి. మీరు మీ మీ పనుల్లో బాధ్యత వహించండి. నాన్న ఆశని, ఆశయాలను బ్రతికించండి" క్లుప్తంగా తన మనసులోని మాట చెప్పింది మహాశ్వేతాదేవి.

మహాశ్వేతా! మీరన్నట్టే చెయ్యండి. మేమందరం మీవెనుకే ఉంటాం. కానీ నాదో చిన్న విన్నపం. నన్నుకూడా మీతోపాటే ఉండనివ్వండి. భర్తగా కాదు, శ్యాం కి తండ్రిగా. మన యలమంచిలి గ్రూప్ కంపెనీల్లో పనిచేస్తున్న వేలమంది ఉద్యోగుల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా మనదే కదా. మీ నాన్నగారి ఆశ, ఆశయాలను నెరవేరుద్దాం. ఆయన తండ్రికిచ్చిన మాట నిలబెడదాం.

మీతోపాటే నేను, మనతోపాటే మనబాబు. మనబాబుతోపాటే ఈ అనాధలందరూ. ఇకవీళ్ళంతా అనాధలు కాదు మహాశ్వేతాదేవీ. మనపిల్లలు..మీ పిల్లలు, నా పిల్లలు...మన యలమంచిలి గ్రూప్ ఆఫ్ కమెనీస్ లో ఇది ఒక భాగమే. ఒక బాధ్యత. సరే అనండి" భార్య మహాశ్వేతాదేవి కేసి  తలెత్తి చూస్తూ ప్రేమగా అన్నాడు హరిశ్చంద్రప్రసాద్.

భర్త మాటలు విన్న మహాశ్వేత కళ్ళల్లోనుండి ఆనందభాస్పాలు జలజలా రాలిపడ్డాయి...

శుభం....

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani