Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
No one can do anything .. nothing to do ..

ఈ సంచికలో >> యువతరం >>

యవతరం రాజకీయ తంత్రం.!

This is a political tactic.

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల హీట్‌ మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ వంతుగా ప్రయత్నాలు షురూ చేశాయ్‌. ప్రతీసారీ ఎన్నికలంటే యువ ఓటర్లే కీలకం. కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకుని తమ వంతుగా వ్యవస్థలో మార్పు కోసం యువత ప్రయత్నించడం చూస్తూనే ఉన్నాం. అయితే ఎంతో ఆశగా ఓటేద్దామనుకుంటే కపట రాజకీయాలు యువతకు ఓటు హక్కు లేకుండా చేస్తున్నాయ్‌. ఓట్ల తొలగింపు వివాదం తెరపైకి వచ్చిన ప్రతిసారీ యువతే బాధితులుగా తేలుతోంది. ఇటీవల తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ ఇదే జరిగింది. దాంతో ఈ సారి యువత ఇంకాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఓటు హక్కు నమోదు చేసుకోవడం మాత్రమే కాదు, అది ఉందో లేదో నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంది యువత.

యువతకు రాజకీయాలంటే కొంత అసహనం ఉన్నప్పటికీ, అంతిమంగా ప్రజాస్వామ్యంలో తాము భాగం కావాలనే వ్యవస్థలో మార్పు కోసం తమ వంతుగా కృషి చేయాలనీ ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఓటేయడం ద్వారా మెరుగైన రాజకీయాల కోసం కృషి చేయాలనీ అనుకుంటున్నారు కాబట్టే, రాజకీయాల్లో యువత పాత్ర రోజు రోజుకీ కీలకంగా మారుతోంది. యువత కోసం అధికారంలో ఉన్నవాళ్లు, అధికారం కోరుకుంటున్నవాళ్లు ఎన్నికల తాయిలాలు భారీగా ప్రకటిస్తున్నారు. అయితే నేటి యువత కోరుకుంటోన్నది తాయిలాలు కాదు, తమ కష్టానికి ప్రతిఫలం. చదివిన చదువుకు సరైన ఉద్యోగం. లేదా ఉపాధి మార్గం. ఆ దిశగా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు రూపిందిస్తున్నా, అవి రాతలకే పరిమితమవుతున్నాయి. చేతల్లో ఏ రాజకీయ పార్టీ యువత పట్ల చిత్తశుద్ధి చూపడం లేదు.

నిరుద్యోగ భృతి పేరుతో తమను కేవలం ఓటు బ్యాంకుగా పాలకులు చూడడాన్ని నేటి యువతరం ప్రశ్నిస్తోంది. విద్య కోసం ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేస్తున్నా, నాణ్యమైన విద్య అందని పరిస్థితి అంతటా ఉంది. మార్పు ఇక్కడి నుండే మొదలవ్వాలి. ఇదీ నేటి యువత డిమాండ్‌. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జరిగితే స్కిల్‌ అటోమెటిగ్గా పుట్టుకొస్తుంది. అప్పుడు ఉద్యోగాలు వెతుక్కోవడమే కాదు, ఉద్యోగాల కల్పన కూడా చేయగలిగే స్థాయికి యువత ఎదుగుతుంది. ఇది అత్యంత కీలకమైన విషయం. నిరుద్యోగ భృతి ప్రభుత్వ ఖజానా మీద భారం తప్ప యువతకు ఒరిగేదేమీ లేదు. ఇది ముక్త కంఠంతో యువత చెబుతున్న మాట. యువత అంటే ఎన్నికల వేళ ఏదో ఒక పార్టీ జెండా పట్టుకుని ఆవేశంగా ఊగిపోయే మూక అనే దురభిప్రాయాన్ని పోగొడుతూ సోషల్‌ మీడియా వేదికగా నేటి యువతరం తమ గళాన్ని విప్పుతోంది. మరి రాజకీయ పార్టీలు ఇకనైనా మేల్కొంటాయా.? వేచి చూడాల్సిందే. 

మరిన్ని యువతరం