Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

తలైవి' కంగనా: ఈ సారైనా కొడుతుందా.?

kangana in talaivi

'తమిళ తంబీలంతా 'అమ్మ' అంటూ ఆప్యాయంగా పిలుచుకునే జయలలిత బయోపిక్‌లో కంగనా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెల్లడైంది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమాకి కథని సిద్ధం చేశారు. విజయ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 'తలైవి' అనే టైటిల్‌తో ఫస్ట్‌లుక్‌ లోగోని విడుదల చేశారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ని రూపొందించిన విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. కాగా జయలలిత బయోపిక్‌ అంటే పలు వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. అయితే వివాదాస్పద సంఘటనల్ని టేకప్‌ చేస్తారా.? లేక అమ్మగా జయలలిత తమిళనాడు ప్రజలకు చేసిన సేవాకార్యక్రమాల్నే మెయిన్‌ లీడ్‌గా ఎంచుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

ఇటీవల 'మణికర్ణిక' సినిమాతో కంగనా అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ కూడా రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. మరి జయలలిత బయోపిక్‌తో కంగనా ఇంకెంత క్రేజ్‌ సంపాదిస్తుందో చూడాలిక. మరోవైపు తమిళంలో నిత్యా మీనన్‌ ప్రధాన పాత్రలో ఇంకో బయోపిక్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ సినిమా సెట్స్‌పై ఉంది. ఇటీవలే జయలలిత గెటప్‌లో నిత్యామీనన్‌ ఫస్ట్‌లుక్‌ కూడా విడుదలైంది. ఆ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక కంగనాలాంటి నటి లీడ్‌ రోల్‌లో జయలలిత బయోపిక్‌ అంటే అందరి దృష్టీ ఆ ప్రాజెక్టు పైనే. గతంలో కంగనా సౌత్‌లో నటించిన 'ఏక్‌ నిరంజన్‌' అంతగా ఆకట్టుకోలేదు. ఇటీవల 'మణికర్ణిక'తోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చూడాలి మరి 'తలైవి'తోనైనా కంగనా ఆకట్టుకుంటుందో లేదో.! 

మరిన్ని సినిమా కబుర్లు
manmadhudu 2   start