Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

జయంతులు

 

మే 10

 

శ్రీ కొర్రపాటి గంగాధర రావు : వీరు మే 10, 1922 న మచిలీపట్నం లో జన్మించారు.   నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. వీరి నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్నాయి. నాటకరంగాన్ని గురించి, నాటక ప్రదర్శన విధానాల గురించి అనేక వ్యాసాలను రచించి నాటక కళాభివృద్ధికి కృషిచేశారు., కళావని అనే నాటక సమాజాన్ని స్థాపించి, దానికి అధ్యక్షులుగా, దర్శకులుగా వ్యవహరించారు.

మే 11

  1. శ్రీ వల్లూరి వెంకటరామయ్య :  వీరు మే 11, 1925 న కొలకలూరు లో జన్మించారు. ప్రముఖ  రంగస్థల నటుడు. ఆంధ్ర డ్రెమెటిక్ ఎమెఛ్యూర్స్  సంస్థ స్థాపకులలో ముఖ్యులు. ఎన్నో నాటకములలో అద్భుతంగా నటించి ఎంతో పేరు పొందారు. వారి కంఠం రెండు మూడు కిలోమీటర్లదాకా వినిపించేదట.

 

 2.శ్రీ సామల సదాశివ : వీరు మే 11, 1928 న, దహేగావ్ లో జన్మించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. తెలంగాణకు చెందిన తెలుగు మరియు ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు. హిందుస్తానీ సంగీతాన్ని తొలిసారిగా తెలుగు పాఠక లోకానికి పరిచయం చేసిన తొలి తెలుగు రచయిత.

మే 12

శ్రీమతి వింజమూరి అనసూయాదేవి :  వీరు మే 12, 1920 న , కాకినాడలో జన్మించారు. ప్రముఖ జానపద గాయని.  సంగీత దర్శకురాలు, రచయిత. మారుమూల పల్లెలలో దాగి ఉన్న జానపదగేయాలకు సభా గాన మర్యాద కలిగించి సంగీత జగత్తులో ఉన్నత స్థానాన్ని కలిగించిన తొలి గాయని.

· భారత దేశంలో జానపద గేయాలకు కర్నాటక బాణీ లో స్వర రచన చేసిన తొలి స్వర కర్త.

 

మే 15

శ్రీ వింజమూరి శివరామారావు : వీరు, మే 15, 1908 లో చంద్రపాళెం లో జన్మించారు. ప్రముఖ కవి.   పద్యాలను, గేయాలను సమప్రతిభతో రాయగల  నేర్పరి. ఆకాశవాణికి ఎన్నో లలిత గీతాలను, రూపకాలను వ్రాసి ప్రసారం చేశారు. 600 రేడియోనాటికలు వ్రాశారు. ఈయన అనువాద రచనలో కూడా సమర్ధులు.

 

వర్ధంతులు

మే 10

శ్రీ పినపాల వెంకట దాసు :  తొలి రోజుల్లో తెలుగు సినిమా పంపిణీదారుడు, తొలి తెలుగు స్టూడియో అధినేత మరియు సినీ నిర్మాత. 1934 లో మద్రాసులో తొలి స్టుడియో నిర్మించారు.

వీరు మే 10, 1936 న స్వర్గస్థులయారు.

మే 14

శ్రీ చందాల కేశవదాసు :   తొలి తెలుగు నాటక కర్త, తొలి సినీ గీత రచయిత, కవి[, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని. నాటకాల్లో మొదట పాడే “పరబ్రహ్మ పరమేశ్వర” అనే సుప్రసిద్ధ కీర్తనను రాసినది ఈయనే.  తెలుగులో మొదటి శబ్ద చిత్రం భక్త ప్రహ్లాదకు ఈయన పాటలు రాశారు.

వీరు మే 14, 1956 న స్వర్గస్థులయారు.

 

మే 15

శ్రీమతి మల్లాది సుబ్బమ్మ :  స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు.   కుల నిర్మూలన, ఛాందస వ్యతిరేక పోరాటం, మూఢవిశ్వాస నిర్మూలన, స్త్రీ జనోద్ధరణ, కుటుంబ నియంత్రణ, స్త్రీ విద్యకోసం కృషి చేశారు.

వీరు మే 15, 2014 న స్వర్గస్థులయారు.

 

మే 16

శ్రీ దాసు శ్రీరాములు :  ప్రసిధ్ధ కవి, పండితుడు. తర్క, వ్యాకరణ, సంగీత, సాహిత్య, వేదాంతాలలో పాండిత్యాన్ని పొందారు.  ఎంతో సాహిత్య సేవ చేసారు. ఏలూరు లో సంగీత నృత్యకళాశాలను స్థాపించి, ఎందరో స్త్రీలకు నేర్పించారు.

వీరు మే 16, 1908 న స్వర్గస్థులయారు.

 

 

 

 

మరిన్ని శీర్షికలు
tamilnadu