Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

పార్టీలంటూ రెచ్చిపోతే చచ్చిపోతారు.!

The parties will die

ఇంటర్నెట్‌ పుణ్యమా అని చెడును ఎంత తొందరగా ఆపాదించేసుకుంటోందంటే యువత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి ఆవగింజంత అయితే, చెడు మాత్రం పుచ్చకాయంత.. అన్న చందంగా మారిపోయింది. మారుతున్న మోడ్రన్‌ కల్చర్‌ పేరు చెప్పి, యువత పార్టీలూ, పబ్‌లూ అంటూ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అమ్మాయిలూ, అబ్బాయిలూ, కల్చర్‌ పేరుతో చేస్తున్న హల్‌చల్‌ ఒక్కోసారి ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తోంది. నగరాల్లో మాత్రమే, అంతంత మాత్రంగా ఉన్న ఈ పార్టీ కల్చర్‌ ఇప్పుడు మెల్ల మెల్లగా ఓ మోస్తరు పట్టణాలకూ విస్తరించేసింది. పార్టీల పేరుతో ఒళ్లు మరిచి యువత చేస్తున్న సాహసాలు కన్నవారిని వేదనకు గురి చేస్తున్నాయి. యువత భవిష్యత్తును సుడిగుండంలోకి నెట్టేస్తున్నాయి. ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ కొత్త పార్టీ కల్చర్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
బర్త్‌డే అంటే ఏం చేస్తాం చెప్పండి. మహా అయితే కేక్‌ కటింగ్స్‌ చేస్తుంటారు. లేదంటే, ఏ పార్కులోనో, పబ్‌లోనో ఫ్రెండ్స్‌తో గ్రాండ్‌గా పార్టీ అరేంజ్‌ చేస్తారు. ఆ పార్టీలో ఫుల్‌గా మధ్యం ఏరి పారుతుందనుకోండి.

రేవ్‌ పార్టీలు తదితర నానా రకాల చెత్తా వీటి జాబితాలోకే వస్తుంది. ఇక్కడ అమ్మాయిలూ, అబ్బాయిలూ అంతా ఈక్వెల్‌ ఈక్వెల్‌ అండీ బాబూ. ఫుల్‌ ఖుషీగా రెచ్చిపోయి, రాత్రంతా ఆడి పాడి ఏదో టైంలో ఇళ్లకు చేరుకుంటారు. సరే, ఇది అందరికీ తెలిసిందే. కానీ కొత్తగా వచ్చిన బర్త్‌డే
పార్టీ తీరు తెన్నుల గురించి వింటే షాకవుతారు తెలుసా.?

ఓ వ్యక్తిని కింద పడేసి వీర కుమ్ముడు కుమ్మేయడమే ఈ బర్త్‌డే పార్టీ స్పెషల్‌. ఫన్నీగా ఉంది కదా ఈ తన్నుకునే పార్టీ. అయితే , ఇంతకీ ఆ కింద పడి తన్నులు తినే వ్యక్తి ఎవరనుకుంటున్నారు. ఆ రోజు బర్త్‌డే ఎవరిదైతే ఆ వ్యక్తినే కింద పడేసి కుమ్మేస్తారు. ఇదంతా ఏదో ఇండోర్‌లో జరిగేది కాదండోయ్‌. ఔట్‌ డోర్‌లోనే. అది కూడా రోడ్డుపై.. మొదట్లో ఫన్నీగా స్టార్ట్‌ అయిన ఈ పార్టీ కల్చర్‌ మెల్లమెల్లగా వివాదాస్పదమైంది. ఈ ఫన్నీ తన్నుడు కాస్తా, పగల తన్నుడుగా మారింది. ఎప్పటి నుండైనా ఆయా వ్యక్తులపై పగ పెంచుకుంటే, ఏడాది నుండీ ఆ పగని లోలోపల పెంచి పోషించి, బర్త్‌డే పార్టీలో భాగంగా లావాలా పెళ్లుబికించి ఆ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమవుతోందట.

ఇంతవరకూ పార్టీల పేరు చెప్పి, హద్దులు మీరి మద్యం సేవించడం, డ్రగ్స్‌ గట్రా తీసుకోవడం వంటి వికృత చర్యలతో ఎంజాయ్‌ చేసిన యువత, ఇంటికెళుతూ యాక్సిడెంట్ల పాలవడం, తద్వారా ప్రాణాలు కోల్పోవడం చూశాం. కానీ ఈ తన్నుకునే పార్టీల కారణంగా అన్యాయంగా బర్త్‌డే రోజు నిండు ప్రాణాలు బలి కావడం జరుగుతోందట. ఈ తన్నుడు పార్టీల్లో అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా విజృంభిస్తున్నారట. ఎక్కడో విదేశాల్లో పుట్టిన ఈ కల్చర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియా పుణ్యమా అని మన ఇండియాలోనూ అక్కడక్కడా విస్తరిస్తోంది. ఇలాంటి వికృత పార్టీలను మొదటిలోనే అరికట్టకపోతే, అవి మానులై పెరిగి యువత ప్రాణాల్ని అన్యాయంగా హరించేస్తాయ్‌. తస్మాత్‌ జాగ్రత్త.

మరిన్ని యువతరం
yuvataram stories compteion